తెలుగు న్యూస్  /  బిజినెస్  /  How To Save Money With Low Income : తక్కువ జీతంతోనూ డబ్బును పొదుపు చేయండిలా!

How to save money with low income : తక్కువ జీతంతోనూ డబ్బును పొదుపు చేయండిలా!

23 January 2023, 12:28 IST

google News
    • How to save money with low income : మీకు రూ. 20వేల జీతం వస్తోందా? తక్కువ జీతంతో సేవింగ్స్​ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా? అయితే ఇది మీకోసమే. తక్కువ జీతంతో సేవింగ్స్​ చేసేందుకు పాటించాల్సిన టిప్స్​ మీకోసం. 
తక్కువ జీతంతోనూ డబ్బును పొదుపు చేయండిలా!
తక్కువ జీతంతోనూ డబ్బును పొదుపు చేయండిలా!

తక్కువ జీతంతోనూ డబ్బును పొదుపు చేయండిలా!

How to save money with low income : "మాకు వచ్చే తక్కువ జీతంతో నెలను గపడమే చాలా కష్టం. ఇక సేవింగ్స్​ ఆలోచనే రాదు!" అని చాలా మంది మధ్యతరగతి ప్రజలు భావిస్తుంటారు. కానీ తక్కువ జీతంతో సేవ్​ చేయడం అనేది అంత పెద్ద కష్టమేమీ కాదు. వాస్తవానికి జీతం చిన్నదైనా, పెద్దదైనా.. దానిని ఖర్చు చేస్తున్న విధానంతోనే మనం డబ్బులను వెనకేసుకుంటామా లేదా అన్నది తెలుస్తుంది. మన బడ్జెట్​ను సరిగ్గా ప్లాన్​ చేసి, అమలు చేస్తే సరిపోతుంది. అప్పుడు రూ. 10తో మీరు మొదలుపెట్టే సేవింగ్స్​.. రూ. 100 అవుతాయి, రూ. 1000 అవుతాయి. వాటికి ‘ఇన్​వెస్ట్​మెంట్’​ టచ్​ ఇస్తే.. అవి రూ. లక్ష కూడా అవుతాయి. మరి తక్కువ జీతంతో సేవింగ్స్​ చేయడం కోసం పాటించాల్సిన కొన్ని టిప్స్​ను ఇప్పుడు తెలుసుకుందాము..

బడ్జెట్​.. బడ్జెట్​.. బడ్జెట్​..

'బడ్జెట్​' అన్న పదం సామాన్యుడి జీవితంలో చాలా ముఖ్యం. ప్రతి దానికి ఓ బడ్జెట్​ వేసుకోవాలి. మన అవసరాలకు అయ్యే ఖర్చులు, పొదుపు చేయాల్సిన డబ్బుల విషయాల్లో చేయాల్సిన ఖర్చులు వంటివి ముందే ప్లాన్​ చేసుకోవాలి. మన ఖాతాలో నెల జీతం పడడానికి 1,2 రోజుల ముందే ఈ ప్లాన్​ వేసుకోవడం శ్రేయస్కరం.

How to save money with less salary : అయితే.. పేపర్​లో బడ్జెట్​ను రాసుకుంటే సరిపోదు! దానిని అమలు చేయాలి కూడా. చాలా మంది.. రాసుకుంటారు కానీ పాటించారు. మీరు కూడా అలాగే ఉంటే దీర్ఘకాలంలో మీ కుటుంబానికి ద్రోహం చేసిన వారు అవుతారు. అందుకే.. ఓ బడ్జెట్​ను తయారు చేసుకుని దానికి తగ్గట్టుగా ఖర్చులు చేయండి.

సేవింగ్స్​తోనే బంగారు భవిష్యత్తు!

బడ్జెట్​ అనేది మన జీవితాల్లో ఓ ముఖ్యమైన పదం అని అనుకుంటే.. ఈ 'సేవింగ్స్​' అనేది మన భవిష్యత్తుకు బాటలు వేస్తుంది! సేవింగ్స్​ చాలా అవసరం. నెల జీతం పడిన వెంటనే.. కరెంట్​ బిల్లు, వాటర్​ బిల్లు, రెంట్​ అంటూ.. డబ్బులు పంపించేస్తాము. అదే విధంగా.. సేవింగ్స్​ను కూడా ఓ బిల్లులాగా భావించి.. వెంటనే పక్కన పెట్టేయాలి. 'ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత.. ఏదైనా మగిలితే అప్పుడు సేవ్​ చేద్దాం' అన్న ధోరణ మంచిది కాదు. అది ఒక్క రూపాయి అయినా, లేదా 10 రూపాయలు అయినా.. ముందు సేవ్​ చేయాల్సిందే. నెమ్మదిగా సేవింగ్స్​ ఖాతాను పెంచుకోవచ్చు.

Types of savings account : సేవింగ్స్​ అకౌంట్​ ఎన్ని రకాలు? వాటి ఉపయోగాలేంటి? వంటి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

How to save money to buy a house : ఎలాంటి లక్ష్యాలు లేకుండా సేవ్​ చేస్తే.. కొంతకాలానికి మొత్తానికే ఆపేసే ప్రమాదం ఉంటుంది. అందుకే.. సేవింగ్స్​ కోసం కూడా ఓ లక్ష్యం పెట్టుకోండి. పిల్లల చదువు కోసం పొదుపు, పిల్లల పెళ్లిళ్ల కోసం సేవింగ్స్​ వంటి గోల్స్​ మీ ముందు ఉంటే.. ఖచ్చితంగా సేవ్​ చేయాలని మీకు గుర్తుంటుంది.

అనవసర ఖర్చులు తగ్గించుకోండి..!

భారతీయుడు తన రోజువారీ జీతంలో సగటు 3.5శాతం తిండికే ఖర్చు చేస్తాడు! అమెరికలో అది 0.6శాతంగా ఉంది. ఈ వివరాలను 'కాస్ట్​ ఆఫ్​ ఎ ప్లేట్​ ఆఫ్​ ఫుడ్​' అనే పేరుతో యూఎన్​ వరల్డ ఫుడ్​ ప్రోగ్రామ్​.. కొన్ని నెలల క్రితం చేసిన సర్వేలో తేలింది.

Financial tips to save money : ఒక్క తిండి విషయమనే కాదు. కొన్నిసార్లు మనం మన జీవనశైలిని పరిశీలించుకోవాల్సి ఉంటుంది. మనం ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నాము, అది నిజంగానే అవసరమా? అన్నది ఆలోచించుకోవాలి. బిందాస్​గా ఖర్చులు చేయకుండా మనల్ని మనం నియంత్రించుకోవాలి.

కొన్ని నెలలు మన స్టాండర్డ్స్​ను తగ్గించుకుని సేవింగ్స్​ చేస్తే.. భవిష్యత్తులో కచ్చితంగా ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా తక్కువ జీతం వస్తున్న వారికి ఇది ఉపయోగపడుతుంది. అనవసరమైన సబ్​స్క్రిప్షన్స్​, ఖరీదైన ఫోన్​లు, ఫోన్​ ప్లాన్స్​, వినోదానికి అనవసరంగా పెడుతున్న ఖర్చులు వంటివి తగ్గించుకోవచ్చు.

బీమా.. ఎమర్జెన్సీ ఫండ్​.. ఇన్​వెస్ట్​మెంట్​..

Financial rules to save money : ఈ కాలంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న సమయాలు.. క్షణాల్లోనే బాధ కలిగించే విధంగా ఉంటాయి. వీటన్నిటి నుంచి మన కుటుంబాన్ని రక్షించుకోవాలంటే.. బీమా తీసుకోవాల్సిందే. టర్మ్​ లైఫ్​ ఇన్ష్యూరెన్స్​, లైఫ్​ ఇన్ష్యూరెన్స్​, హెల్త్​ ఇన్ష్యూరెన్స్​ వంటిపై ఫోకస్​ చేయాలి. నేటి టెక్​ యుగంలో.. వీటికి సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో సులభంగా లభిస్తున్నాయి. అన్నింటి కన్నా ముందు ఓ బీమా పాలసీ తీసుకోవడం అత్యావశ్యకం.

కోటీశ్వరులు అవ్వాలన్న మీ కలలను సాకారం చేసుకునేందుకు పాటించాల్సిన టిప్స్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇక తక్కువ జీతంతో సేవింగ్స్​ చేస్తూనే.. ఓ ఎమర్జెన్సీ ఫండ్​ను మెయిన్​టైన్​ చేయడం ఉత్తమం. బీమా వంటి వాటిల్లో లిక్విడిటీ ఉండదు. మనకు రెండీగా డబ్బు కావాలంటే.. ఈ ఎమర్జెన్సీ ఫండ్​ ఉపయోగపడుతుంది. అందుకే.. కొంత మొత్తంలో ఈ ఫండ్​ను ఏర్పాటు చేసుకోవాలి. అయితే.. ఒక్కోసారి లిక్విడిటీ ఎక్కువ ఉండటం, సులభంగా ఖర్చు పెట్టేందుకు వీలుగా ఉండటం కూడా సరైన విషయం కాదు. అందుకే.. ఓ బ్యాంక్​ అకౌంట్​లో సేవింగ్స్​ను వేసి(ఎమర్జెన్సీ ఫండ్​ నిధులను మినహాయించి).. ఆ అకౌంట్​కు యూపీఐ ట్రాన్సాక్షన్​ వెసులుబాటును ఇవ్వకుండా చూసుకోవాలి. అప్పుడే.. బ్యాంక్​ ఖాతాలోకి ఇన్​కమింగ్​ పెరుగుతంది, ఔట్​గోయింగ్​ తగ్గుతుంది.

Tips to invest in stock market : సేవింగ్స్​తో పాటు ఇన్​వెస్ట్​మెంట్స్​ ఉండటం కూడా చాలా అవసరం. ఇన్​ఫ్లేషన్​ కారణంగా.. ఈరోజు రూ. 10కి దొరుకున్న వస్తువు రేపు రూ. 20, రూ. 30కి కూడా లభించకపోవచ్చు. ఇన్​ఫ్లేషన్​ భూతం నుంచి బయటపడాలంటే ఇన్​వెస్ట్​ చేయాల్సిందే. స్టాక్​ మార్కెట్​, మ్యూచువల్​ ఫండ్స్​ వంటి ఆప్షన్స్​ ఉంటాయి. రిస్క్​ వద్దు అనుకునే వారు.. ప్రభుత్వ ఆధారిత ఫండ్స్​ (పీపీఎఫ్​, ఎన్​పీఎస్​)లో పెట్టుబడులు పెట్టవచ్చు.

స్టాక్​ మార్కెట్​లో డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా?  అయితే మీరు తెలుసుకోవాల్సిన టిప్స్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

అటు బీమా తీసుకుని, ఇటు ఎమర్జెన్సీ ఫండ్స్​ పెట్టుకుని, ఇన్​వెస్ట్​మెంట్​ చేయడం అంటే చాలా కష్టమైన విషయంగా అనిపిస్తుంది. తొలినాళ్లల్లో ఇలాగే ఉంటుంది. కానీ కొంత కాలం గడిచేసరికి మీకు మీ ఫైనాన్షియల్స్​పై పట్టు పెరుగుతుంది. ఆటోమెటిక్​గా మీరు అవన్నీ చేసేస్తారు!

రూ. 20వేల జీతంతో నెల ఎలా గడపాలి?

How to save money for future : రూ. 20వేల జీతంతో నెల గడపాలంటే బడ్జెటింగ్​ రూల్స్​ను పాటించాల్సిందే. వీటిల్లో "50-20-30" రూల్​ చాలా ప్రాముఖ్యత సంపాదించుకుంది. అంటే.. మీ జీతంలో 50శాతం డబ్బులు అవసరాలకు ఖర్చు చేయాలి. మరో 30శాతం ఇష్టాల కోసం, మరో 20శాతం సేవింగ్స్​, పెట్టుబడుల కోసం కేటాయించాలి. 30శాతం ఇష్టాల కోసం కేటాయించే నిధులను ఇంకాస్త తగ్గించుకుంటే.. మరీ మంచిది!

తదుపరి వ్యాసం