తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Harley Davidson X440 : హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440.. వావ్​! వాట్​ ఎ బైక్​..!

Harley Davidson X440 : హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440.. వావ్​! వాట్​ ఎ బైక్​..!

Sharath Chitturi HT Telugu

26 May 2023, 16:05 IST

google News
    • Harley Davidson X440 : హార్లీ డేవిడ్​సన్​ నుంచి త్వరలో రానున్న ఎక్స్​440 బైక్​ డిజైన్​ను సంస్థ ఆవిష్కరించింది. లాంచ్​ డేట్​తో పాటు ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
హర్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440..
హర్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440.. (HT AUTO)

హర్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440..

Harley Davidson X440 : హర్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440 బైక్​.. జూలై 3న ఇండియాలో లాంచ్​కానుంది. తాజాగా.. ఈ మేడ్​ ఇన్​ ఇండియా బైక్​ డిజైన్​ను సంస్థ రివీల్​ చేసింది. యూఎస్​ ఆధారిత హార్లీ డేవిడ్​సన్​, దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హీరో మోటోకార్ప్​ కొలాబొరేషన్​లో వస్తున్న తొలి వెహికిల్​గా ఈ ఎక్స్​440 గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ బైక్​ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

హర్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440- డిజైన్​..

ఐకానిక్​ ఎక్స్​ఆర్​1200 బైక్​ను స్ఫూర్తి పొంది ఈ హర్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440ని రూపొందించినట్టు కనిపిస్తోంది. ఇందులో మస్క్యులర్​ ఫ్యూయెల్​ ట్యాంక్​, డీఆర్​ఎల్​తో కూడిన సర్క్యులర్​ ఎల్​ఈడీ హెడ్​లైట్​, విండ్​ హ్యాండిల్​బార్​, సింగిల్​ పీస్​ స్టెప్డ్​- అప్​ సీట్​, రౌండ్​ మిర్రర్స్​, అప్​స్వెప్ట్​ ఎగ్సాస్ట్​, టాపర్డ్​ టెయిల్​ సెక్షన్​, స్లీక్​ ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్​ వంటివి వస్తున్నాయి.

ఈ నియో రెట్రో రోడ్​స్టర్​లో సింగిల్​ పాడ్​ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ ఉంటుంది. అలాయ్​ వీల్స్​ వస్తాయి. బ్లూటూత్​ కనెక్టివిటీ ఫీచర్​ వస్తుందని తెలుస్తోంది.

ఇదీ చదవండి:- Royal Enfield Hunter 350 vs Bajaj Avenger 220: ఒకే రేంజ్ ధరలో ఉన్న ఈ రెండు బైక్‍లు ఎలా ఉన్నాయి? ఏ అంశంలో ఏది బెస్ట్?

ఎక్స్​440 ఇంజిన్​ వివరాలు..

త్వరలోనే లాంచ్​కానున్న ఈ బైక్​లో వచ్చే ఇంజిన్​ వివరాలను సంస్థ ఇంకా ప్రకటించలేదు. కాగా.. ఇందులో 440సీసీ, సింగిల్​ సిలిండర్​, ఎయిర్​ అండ్​ ఆయిల్​ కూల్డ్​ ఇంజిన్​ వస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ ఇంజిన్​ 38హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది.

Harley Davidson X440 price in India : ఇక ఈ మేడ్​ ఇన్​ ఇండియా బైక్​ ఎక్స్​షోరూం ధర రూ. 2.5లక్షలుగా ఉండొచ్చు. జులై 3 లాంచ్​ డేట్​ దగ్గరపడే కొద్ది.. ఈ బైక్​కు సంబంధించిన మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయి.

ఇక లాంచ్​ తర్వాత.. ఈ హర్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440 బైక్​ రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350, యెజ్డీ రోడ్​స్టర్​, హోండా హెచ్​నెస్​ సీబీ350, జావా 42 వంటి మోడల్స్​కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం