Harley Davidson X 500 vs Royal Enfield Interceptor 650 : ఈ రెండు బైక్స్‌లో ఏది బెస్ట్?
24 April 2023, 6:47 IST
- Harley Davidson X 500 vs Royal Enfield Interceptor 650 : హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 500 వర్సెస్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650. ఈ రెండిట్లో ఏది బెస్ట్? ఇక్కడ తెలుసుకోండి..
ఎక్స్ 500 వర్సెస్ ఇంటర్‌సెప్టర్ 650.. ఏది బెస్ట్?
Harley Davidson X 500 vs Royal Enfield Interceptor 650 : సరికొత్త ఎక్స్ 500 బైక్‌ను అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ చేసింది హార్లీ డేవిడ్సన్. క్యూజే మోటార్ కొలాబరేషన్‌తో వస్తున్న రెండో బైక్ ఇది. ఈ ఆల్ న్యూ నియో రెట్రో బైక్.. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650కి గట్టి పోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ రెండింటినీ పోల్చి, ది బెస్ట్ ఏది? అన్నది తెలుసుకుందాము.
హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 500 వర్సెస్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650- లుక్స్..
Harley Davidson X 500 price in India : హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 500లో మస్క్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్, సర్క్యులర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఓవల్ షేప్ మిర్రర్స్, వైడ్ హ్యాండిల్‌బార్, సింగిల్ పీస్ స్టెప్డ్ అప్ సీట్, సైడ్ మౌంటెడ్ డబుల్ బారెల్ ఎగ్సాస్ట్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్తో కూడిన టేపరింగ్ టెయిల్ సెక్షన్ వంటివి ఉన్నాయి.
ఈ బైక్ ఎత్తు 820ఎంఎం. గ్రౌండ్ క్లియరెన్స్ 153ఎంఎం. వీల్‌బేస్ 1,458ఎంఎం. కర్బ్ వెయిట్ 208కేజీలు.
Royal Enfield Interceptor 650 price Hyderabad : ఇక రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650లో టియర్‌డ్రాప్ షేప్డ్ ఫ్యూయెల్ ట్యాంక్, రౌండ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, రైజ్డ్ హ్యాండిల్‌బార్, డ్యూయెల్ అప్స్వెప్ట్ ఎగ్సాస్ట్, సింగిల్ పీస్ సీట్, ఫోర్క్ గైటర్స్, ఎల్ఈడీ టెయిల్ల్యాంప్ లభిస్తున్నాయి.
ఈ బైక్ ఎత్తు 804ఎంఎం. గ్రౌండ్ క్లియరెన్స్ 174ఎంఎం. వీల్‌బేస్ 1,398ఎంఎం. కర్బ్ వెయిట్ 218కేజీలు.
ఇదీ చదవండి:- Retro bikes in India : బైక్ నడిపితే ‘రెట్రో’ ఫీల్ రావాలా? ఇవి బెస్ట్..!
హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 500 వర్సెస్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650- ఇంజిన్..
Harley Davidson X 500 top speed : హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 500లో క్యూటే మోటార్‌కు చెందిన 500సీసీ, లిక్విడ్ కూల్డ్, డీఓహెచ్సీ ప్యారెలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 47.5 హెచ్‌పీ పవర్‌ను, 46 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఇక ఇంటర్‌సెప్టర్ 650లో 648సీసీ, ప్యారెలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 47 హెచ్‌పీ పవర్‌ను, 52ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఈ రెండు బైక్స్‌లోనూ 6 స్పీడ్ గేర్‌బాక్స్ లభిస్తోంది.
Royal Enfield Interceptor 650 price : ఇక సేఫ్టీ విషయానికొస్తే.. రెండు బైక్స్‌లోనూ డిస్క్ బ్రేక్స్ (ఫ్రెంట్, రేర్), డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్ వంటివి వస్తున్నాయి. ఎక్స్ 500లో ఇన్వర్టెడ్ ఫ్రెంట్ ఫోర్క్స్, మోనో షాక్ యూనిట్స్ వస్తుంటే.. ఎన్ఫీల్డ్ బైక్‌లో టెలిస్కోపిక్ ఫ్రెంట్ ఫోర్క్స్, డ్యూయెల్ షాక్ అబ్సార్బర్స్ వంటివి లభిస్తున్నాయి.
హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 500 వర్సెస్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650- ధర..
Harley Davidson X 500 launch : 2023 రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ఎక్స్‌షోరూం ధర రూ. 3.03లక్షలు- రూ. 3.31లక్షల మధ్యలో ఉంది. ఇక ఎక్స్ 500 ధర చైనాలో 44,388 సీఎన్వైగా ఉంది. ఇండియా కరెన్సీ ప్రకారం ఇది దాదాపు రూ. 5.28లక్షలు.