Kawasaki Eliminator vs Royal Enfield Super Meteor 650 : ఈ రెండు బైక్స్‌లో ఏది బెస్ట్?
27 March 2023, 6:22 IST
Kawasaki Eliminator vs Royal Enfield Super Meteor 650 : కవాసకి ఎలిమినేటర్, రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియర్ 650లో ది బెస్ట్ ఏది? ఇక్కడ తెలుసుకోండి..
ఈ రెండు బైక్స్‌లో ఏది బెస్ట్?
Kawasaki Eliminator vs Royal Enfield Super Meteor 650 : ప్రముఖ జపనీస్ బైక్ తయారీ సంస్థ కవాసకి.. 2023 ఎలిమినేటర్ వర్షెన్‌ను అంతర్జాతీయంగా లాంచ్ చేసింది. రెండు దశాబ్దాల తర్వాత ఎలిమినేటర్ మళ్లీ రోడ్లపైకి వచ్చింది. ఈ మోడల్‌కు మంచి డిమాండే కనిపిస్తోంది. ఇండియాలో ఇది త్వరలోనే లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే.. రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియర్ 650 నుంచి కవాసకి ఎలిమినేటర్‌కు గట్టి పోటీ తప్పదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది బెటర్ అన్నది తెలుసుకుందాము..
కవాసకి ఎలిమినేటర్ వర్సెస్ రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియర్ 650- లుక్స్..
Kawasaki Eliminator price : కవాసకి ఎలిమినేటర్‌లో నియో- రెట్రో డిజైన్ ఉంటుంది. స్లోపింగ్ ఫ్యూయెల్ ట్యాంక్, వైడ్ హాండిల్బార్, రౌండ్ హెడ్‌ల్యాంప్, స్ప్లిట్ టైప్ సీట్, సైడ్ మౌంటెడ్ ఎగ్సాస్ట్, డిజైనర్ అలాయ్ వీల్స్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్ వంటివి ఉంటాయి.
Royal Enfield Super Meteor 650 on road price in Hyderabad : ఇక రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియర్ 650లో క్రూజర్ సిల్హాయిట్ డిజైన కనిపిస్తుంది. టియర్‌డ్రాప్ షేప్ ఫ్యూయెల్ ట్యాంక్, సర్క్యులర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, వైడ్ హాండిల్బార్, అడ్జస్టెబుల్ లెవర్స్, డ్యూయెల్ సైడ్ మౌంటెడ్ ఎగ్సాస్ట్, అలాయ్ వీల్స్ ఉంటాయి.
కవాసకి ఎలిమినేటర్ వర్సెస్ రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియర్ 650- ఇంజిన్..
Kawasaki Eliminator India launch : కవాసకి ఎలిమినేటర్‌లో 398సీసీ లిక్వ్‌డ్ కూల్డ్ డీఓహెచ్సీ, పారలెల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 47.3 హెచ్‌పీ పవర్‌ను, 37 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియర్ 650లో 648సీసీ, ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్, పారలెల్ ట్విన్ మోటార్ ఉంటుంది. ఇది 47హెచ్‌పీ పవర్‌ను, 52ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఈ రెండు బైక్స్‌లోనూ 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది.
కవాసకి ఎలిమినేటర్ వర్సెస్ రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియర్ 650- సేఫ్టీ..
Kawasaki Eliminator features : సేఫ్టీ ఫీచర్స్ విషయానికొస్తే.. ఈ రెండు బైక్స్‌లోనూ డిస్క్ బ్రేక్స్ (ఫ్రెంట్, రేర్), డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్ వంటివి ఉన్నాయి. కాగా కవాసకిలో టెలిస్కోపిక్ ఫ్రెంట్ ఫోర్క్స్ వస్తుండగా.. ఎన్ఫీల్డ్లో 43ఎంఎం ఇన్వర్టెడ్ ఫోర్క్స్ లభిస్తున్నాయి.
రెండు బైక్స్‌లోనూ రేర్ ఎండ్‌లో డ్యూయెల్ షాక్ అబ్సార్బర్ యూనిట్స్ వస్తున్నాయి.
కవాసకి ఎలిమినేటర్ వర్సెస్ రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియర్ 650- ధర..
Royal Enfield Super Meteor 650 price : రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియర్ 650 ఎక్స్‌షోరూం ధరలు రూ. 3.49లక్షలు- రూ. 3.79లక్షల మధ్యలో ఉంటుంది. 2023 కవాసకి ఎలిమినేటర్ ధరకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. కాగా జపాన్ దీని ధర 7,59,000 జపనీస్ యెన్. అంటే దాదాపు రూ. 4.78లక్షలు.