Royal Enfield Hunter 350 vs Bajaj Avenger 220: ఒకే రేంజ్ ధరలో ఉన్న ఈ రెండు బైక్‍లు ఎలా ఉన్నాయి? ఏ అంశంలో ఏది బెస్ట్?-royal enfield hunter 350 vs bajaj avenger 220 cruise which motorcycle should you buy check comparison ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Royal Enfield Hunter 350 Vs Bajaj Avenger 220: ఒకే రేంజ్ ధరలో ఉన్న ఈ రెండు బైక్‍లు ఎలా ఉన్నాయి? ఏ అంశంలో ఏది బెస్ట్?

Royal Enfield Hunter 350 vs Bajaj Avenger 220: ఒకే రేంజ్ ధరలో ఉన్న ఈ రెండు బైక్‍లు ఎలా ఉన్నాయి? ఏ అంశంలో ఏది బెస్ట్?

Chatakonda Krishna Prakash HT Telugu
May 23, 2023 11:30 AM IST

Royal Enfield Hunter 350 vs Bajaj Avenger 220 Cruise: రాయల్ ఎన్‍ఫీల్డ్ హంటర్ 350, బజాజ్ అవేంజర్ 220 క్రూజ్ బైక్‍ల మధ్య కంపారిజన్ ఇక్కడ చూడండి. ఏ అంశంలో ఏది అత్యుత్తమంగా ఉందో తెలుసుకోండి.

Royal Enfield Hunter 350 vs Bajaj Avenger 220: ఒకే రేంజ్ ధరలో ఉన్న ఈ రెండు బైక్‍లు ఎలా ఉన్నాయి? (Photo: HT Auto)
Royal Enfield Hunter 350 vs Bajaj Avenger 220: ఒకే రేంజ్ ధరలో ఉన్న ఈ రెండు బైక్‍లు ఎలా ఉన్నాయి? (Photo: HT Auto)

Royal Enfield Hunter 350 vs Bajaj Avenger 220 Cruise: రాయల్ ఎన్‍ఫీల్డ్ గతేడాది తీసుకొచ్చిన హంటర్ 350 బైక్ చాలా హిట్ అయింది. అమ్మకాల్లోనూ అదరగొడుతోంది. రాయల్ ఎన్‍ఫీల్డ్ లైనప్‍లో చవకైన బైక్‍గా ఇది ఉంది. ధర విషయానికి వస్తే రాయల్ ఎన్‍ఫీల్డ్ హంటర్ 350కి బజాజ్ అవేంజర్ 220 క్రూజ్ సమీపంలో ఉంది. అయితే, ఈ రెండింట్లో ఏది కొనాలని కొందరికి సందేహంగా ఉండొచ్చు. అందుకే, రాయల్ ఎన్‍ఫీల్డ్ హంటర్ 350, బజాజ్ అవేంజర్ 220 క్రూజ్ మధ్య కంపారిజన్‍ను ఇక్కడ చూడండి. ఏ అంశంలో ఏది ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Royal Enfield Hunter 350 vs Bajaj Avenger 220 Cruise: లుక్స్

లుక్స్ విషయంలో అయితే ఈ రెండు బైక్‍లు చాలా డిఫరెంట్‍గా ఉన్నాయి. బజాజ్ అవేంజర్ 220 క్రూజ్ బైక్.. డిఫరెంట్ హ్యండిల్ బార్, లో స్లంగ్ సీట్, ఫార్వార్డ్ ఫుట్ పెగ్స్, బ్యాక్‍రెస్ట్, పొడవుగా ఉండే విండ్ స్క్రీన్‍ను కలిగి ఉంటుంది. అందుకే ఇది చూడడానికి అసలైన క్రూజ్‍ లుక్‍ను ఇస్తుంది. మరోవైపు, రాయల్ ఎన్‍ఫీల్డ్ హంటర్ 350.. నియో రెట్రో ఎలిమెంట్లతో రోడ్‍స్టర్‌లా కనిపిస్తుంది.

Royal Enfield Hunter 350 vs Bajaj Avenger 220 Cruise: ఇంజిన్

ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఫ్యుయల్ ఇంజెక్షన్ ఇంజిన్‍నే ఈ రెండు బైక్‍లు కలిగి ఉన్నాయి. 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో వచ్చాయి. అయితే, బజాజ్ అవేంజర్ 220 క్రూజ్ బైక్ ఇంజిన్ సామర్థ్యం 220ccగా ఉంది. 8,500 rpm వద్ద 18.76 bhp పవర్, 7,000 rpm వద్ద పీక్ 17.55 టార్క్యూను ఈ ఇంజిన్ జనరేట్ చేయగలదు. ఇక, రాయల్ ఎన్‍ఫీల్డ్ హంటర్ 350 బైక్ 349cc సామర్థ్యమున్న ఇంజిన్‍ను కలిగి ఉంది. 6,100 rpm వద్ద 20.11 bhp, 27 Nm పీక్ టార్కూను ఈ బైక్ ఇంజిన్ ప్రొడ్యూజ్ చేయగలదు.

Royal Enfield Hunter 350 vs Bajaj Avenger 220 Cruise: ఫీచర్లు

ఫీచర్ల విషయానికి వస్తే, బజాజ్ అవేంజర్ 220 క్రూజ్ బైక్ ఫుల్లీ డిజిటల్ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్, డిజిటల్ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్, స్పోక్డ్ రిమ్స్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, హాలోజెన్ లైటింగ్‍ను కలిగి ఉంది. ఇక వేరియంట్‍ను బట్టి, హంటర్ 350 బైక్ సెమీ డిజిటల్ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్, యూఎస్‍బీ పోర్టు, హాలోజెన్ లైటింగ్, అలాయ్ వీల్స్, డ్యుయల్ చానెల్ ఏబీఎస్, ట్రిప్పర్ నేవిగేషన్ సిస్టమ్‍ను కలిగి ఉంది.

Royal Enfield Hunter 350 vs Bajaj Avenger 220 Cruise: ధర

బజాజ్ అవేంజర్ 220 క్రూజ్ ధర రూ.1.43లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. రాయల్ ఎన్‍ఫీల్డ్ హంటర్ 350 ప్రారంభ ధర రూ.1.50లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. హంటర్ బైక్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. టాప్ వేరియంట్ ధర రూ.1.73లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

డిజైన్, లుక్ పరంగా బజాజ్ అవేంజర్ 220 క్రూజ్ స్టైలిష్‍గా ఉండగా.. పర్ఫార్మెన్స్‌లో మాత్రం రాయల్ ఎన్‍ఫీల్డ్ హంటర్ 350 మెరుగ్గా ఉంది.

Whats_app_banner