తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Rates Today 13th May 2023 Check Latest Prices In Hyderabad

Gold and silver rates today : భారీగా పతనమైన వెండి ధర- దిగొచ్చిన పసిడి!

Sharath Chitturi HT Telugu

13 May 2023, 5:57 IST

    • Gold and silver rates today : దేశంలో పసిడి ధరలు పడ్డాయి. వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా.. (REUTERS)

మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు శనివారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 400 తగ్గి.. రూ. 56,550కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 56,950గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 4,000 తగ్గి రూ. 5,65,500కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,655గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Air India-Vistara merger: ఎయిర్ ఇండియా - విస్తారా విలీనంపై కీలక అప్ డేట్ ఇచ్చిన టాటా సన్స్

Changes from May 1 : మే 1 నుంచి ఈ విషయాల్లో భారీ మార్పులు.. కచ్చితంగా తెలుసుకోవాలి

Best Mutual Funds : ఏడాది కాలంలో అద్భుత రిటర్నులు ఇచ్చిన టాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ ఇవే..

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 155 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో భారీ ప్రాఫిట్స్​!

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 440 తగ్గి.. రూ. 61,690కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 62,130గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 4400 తగ్గి.. రూ. 6,16,900గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,169గా ఉంది.

Gold rate today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,650గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,840గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,550 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 61,690గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,050గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,240గాను ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 56,600గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 61,740గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,550గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,690గాను నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,600గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 61,740గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 56,550గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,690గా ఉంది.

ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శనివారం భారీగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,500గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 2600 పడి.. రూ. 75,000గా కొనసాగుతోంది. శుక్రవారం ఈ ధర రూ. 77,600గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 78,700 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 75,000.. బెంగళూరులో రూ. 78,700గా ఉంది.