తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Price Today: పసిడి రేటు మరింత పైకి.. కాస్త తగ్గిన వెండి

Gold Price Today: పసిడి రేటు మరింత పైకి.. కాస్త తగ్గిన వెండి

11 May 2023, 6:25 IST

    • Gold Price Today: దేశీయ మార్కెట్‍లో పసిడి రేటు మరింత అధికమైంది. మరోవైపు వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. నేటి రేట్లు ఇవే..
నేటి బంగారం ధరలు ఇలా..
నేటి బంగారం ధరలు ఇలా.. (MINT_PRINT)

నేటి బంగారం ధరలు ఇలా..

Gold Price Today: బంగారం (పసిడి) ధర వరుసగా మూడో రోజు పెరిగింది. దేశీయ మార్కెట్‍లో రేటు మరింత ఎగిసింది. గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.250 అధికమై రూ.56,950కు ఎగబాకింది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల (తులం) గోల్డ్ రేటు రూ.280 పెరిగి రూ.62,130కు చేరింది. దీంతో మరోసారి రూ.62వేల మార్కును దాటింది. మరోవైపు వెండి (Silver) ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

Upcoming electric cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.. క్రేజీ లైనప్​!

Royal Enfield Guerrilla 450 : అదిరిపోయేలా.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​- లాంచ్​ ఎప్పుడు?

ఢిల్లీలో ఇలా..

Gold Price Today: దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,100కు ఎగబాకింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.62,280కు చేరింది.

హైదరాబాద్‍లో..

Gold Price today in Hyderabad: హైదరాబాద్‍‍ మార్కెట్లోనూ బంగారం ధర పెరిగింది. హైదరాబాద్‍లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం రేటు రూ.56,950కు చేరింది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.62,130కు వెళ్లింది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

వివిధ ప్రధాన నగరాల్లో..

Gold Price Today: బెంగళూరు, అహ్మదాబాద్‍ల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.57,000కు ఎగబాకింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.62,180కు పెరిగింది.

Gold Price Today: చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,370కు చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.62,590కు ఎగబాకింది. ముంబైలో 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.56,950కు వెళ్లింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,130కు చేరింది. కోల్‍కతాలోనూ ఇదే ధర ఉంది.

Gold price Today: గత 24 గంటల్లో అంతర్జాతీయ మార్కెట్‍లో గోల్డ్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సు రేటు 2,031 డాలర్ల వద్ద ఉంది. అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం ఆందోళన, ద్రవ్యోల్బణం, డిమాండ్‍లో మార్పులు లాంటి కారణాలు బంగారం ధరలపై ఎఫెక్ట్ చూపుతున్నాయి.

స్వల్పంగా తగ్గిన వెండి

Silver Rate Today: దేశంలో నేడు వెండి రేటు కాస్త తగ్గింది. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.78,000కు చేరింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నంల్లో కిలో వెండి రేటు రూ.82,700కు వెళ్లింది. ఢిల్లీ, కోల్‍కతా, ముంబైల్లో కిలో వెండి ధర రూ.78,000గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణనలోకి తీసుకోలేదు.)

తదుపరి వ్యాసం