తెలుగు న్యూస్  /  Business  /  Flipkart Big Saving Days Sale Will Start Tomorrow Know Discounts Deals Card Offer Details

Flipkart Big Saving Days: రేపటి నుంచి ఫ్లిప్‍కార్ట్‌ సేల్.. వారికి నేడే మొదలు.. 70శాతం వరకు ఆఫర్లు!

15 December 2022, 9:42 IST

    • Flipkart Big Saving Days: ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ వచ్చేస్తోంది. యూజర్లందరికీ రేపు సేల్ మొదలవుతుంది. ప్లస్ మెంబర్లకు నేడే అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్‍లో ఉండే డిస్కౌంట్లు, బ్యాంక్ కార్డ్ ఆఫర్ వివరాలు ఇవే.
Flipkart Big Saving Days: రేపటి నుంచి ఫ్లిప్‍కార్ట్‌ మరో సేల్
Flipkart Big Saving Days: రేపటి నుంచి ఫ్లిప్‍కార్ట్‌ మరో సేల్

Flipkart Big Saving Days: రేపటి నుంచి ఫ్లిప్‍కార్ట్‌ మరో సేల్

Flipkart Big Saving Days: ప్రముఖ దేశీయ ఈ-కామర్స్ ప్లాట్‍ఫామ్ ఫ్లిప్‍కార్ట్ మరో సేల్‍ను తీసుకొచ్చింది. బిగ్ సేవింగ్ డేస్ సేల్‍ను ప్రకటించింది. రేపు (డిసెంబర్ 16) ఈ సేల్ మొదలవుతుంది. ఐదు రోజుల పాటు అంటే ఈనెల 21వ తేదీ వరకు కొనసాగుతుంది. అయితే, ఫ్లిప్‍కార్ట్ ప్లస్ మెంబర్లకు నేడే (డిసెంబర్ 15) ఈ సేల్ అందుబాటులోకి వచ్చింది. సాధారణ యూజర్లందరికీ రేపు డీల్స్ లభిస్తాయి. బిగ్ సేవింగ్ డేస్ సేల్‍లో భాగంగా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‍టాప్‍లతో పాటు టీడబ్ల్యూఎస్ ఇయర్‍బడ్స్, హెడ్‍ఫోన్స్, స్మార్ట్ వాచ్‍లు లాంటి గాడ్జెట్లపై కూడా డిస్కౌంట్లు ఉంటాయి. 70శాతం వరకు ఆఫర్లు ఉంటాయని ఫ్లిప్‍కార్ట్ ప్రకటించింది. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు లాంటి హోమ్ అప్లయెన్సెస్‍లపై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ కార్డ్ ఆఫర్లను కూడా యూజర్లు వాడుకోవచ్చు.  ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‍‍లో డీల్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.

Flipkart Big Saving Days Sale: డిస్కౌంట్లు ఇలా..

బిగ్ సేవింగ్ డేస్ సేల్‍లో స్మార్ట్ ఫోన్లపై 50 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్‍కార్ట్ పేర్కొంది. యాపిల్, సామ్‍సంగ్, రియల్‍మీ, షావోమీ, ఒప్పో, వివో, నథింగ్‍తో పాటు అన్ని బ్రాండ్ల మొబైళ్లపై ఆఫర్లు ఉంటాయని తెలిపింది. ఐఫోన్ 13, పోకో ఎక్స్4 ప్రో 5జీ, గూగుల్ పిక్సెల్ 6ఏ, మోటోరోలా జీ72, వివో టీ1 5జీ, రియల్‍మీ 9 సిరీస్ మొబైళ్లు, ఒప్పో ఎఫ్19 5జీ, నథింగ్ ఫోన్ 1తో పాటు చాలా మొబైళ్లపై తగ్గింపు ధరలు ఉండనున్నాయి.

రియల్‍మీ, సామ్‍సంగ్, ఎంఐతో పాటు మిగిలిన కంపెనీల స్మార్ట్ టీవీలపై ఈ బిగ్ సేవింగ్ డేస్ సేల్‍లో 70శాతం వరకు ఆఫర్లు ఇస్తున్నట్టు ఫ్లిప్‍కార్ట్ చెబుతోంది. హెడ్‍ఫోన్లు, స్పీకర్లపై 70 శాతం వరకు, హోమ్ అప్లియన్సెస్‍పై 70 శాతం వరకు, ఏసీలపై 55 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని వెల్లడించింది. ల్యాప్‍టాప్‍లపై 40 శాతం వరకు, స్మార్ట్ వాచ్‍లపై 60 శాతం వరకు ఆఫర్లను ఇస్తున్నట్టు ఫ్లిప్‍కార్ట్ వెల్లడించింది.

Flipkart Big Saving Days Sale: బ్యాంక్ కార్డ్ ఆఫర్లు

ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‍లో కొటాక్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే వినియోగదారులు అదనంగా 10శాతం వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే చాలా ప్రొడక్టులపై ఎస్‍బీఐ క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంటుంది.