Discounts on Maruti Suzuki cars : మారుతీ సుజుకీ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్..!
05 August 2023, 9:30 IST
- Discounts on Maruti Suzuki cars : ఆగస్ట్ నెలలో మారుతీ సుజుకీ వాహనాలపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
మారుతీ సుజుకీ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్..!
Discounts on Maruti Suzuki cars : మారుతీ నెక్సా రేంజ్ కారును కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం! ఆగస్ట్ నెలకు సంబంధించి.. పలు మోడల్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్స్‌ను ప్రకటించింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుతీ. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
మారుతీ సుజుకీ ఇగ్నిస్..
ఈ మోడల్‌పై రూ. 35వేల క్యాష్ బోనస్, రూ. 15వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10వేల అడిషనల్ ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4వేల కార్పొరేట్ బోనస్, రూ. 5వేల స్క్రాపేజ్ డిస్కౌంట్ లభిస్తోంది. అన్ని కలుపుకుంటే ఇది రూ. 69వేల డిస్కౌంట్!
ఇక ఇగ్నిస్ స్పెషల్ ఎడిషన్‌పై రూ. 15,500 క్యాష్ డిస్కౌంట్, రూ. 15వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10వేల అడిషనల్ ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్, రూ. 5వేల వరకు స్క్రాపేజ్ డిస్కౌంట్ వస్తున్నాయి. ఇది రూ. 49,500 డిస్కౌంట్.
మారుతీ సుజుకీ ఇగ్నీస్ ఎక్స్‌షోరూం ధర రూ. 5.84లక్షలు- రూ. 8.16లక్షల మధ్యలో ఉంటుంది.
ఇదీ చూడండి:- Discounts on Hyundai cars : హ్యుందాయ్ వాహనాలపై రూ. 2లక్షల వరకు డిస్కౌంట్లు..!
మారుతీ సుజుకీ బలెనో..
ఈ మోడల్‌పై రూ. 20వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 10వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10వేల అడిషనల్ ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5వేల స్క్రాపేజ్ డిస్కౌంట్ లభిస్తున్నాయి. మొత్తం మీద రూ. 45వేల డిస్కౌంట్ వస్తోంది.
Maruti Suzuki Baleno on road price Hyderabad : మార్కెట్లో బలెనో ఎక్స్‌షోరూం ధర రూ. 6.61లక్షలు- రూ. 9.88లక్షల మధ్యలో ఉంటుంది.
మారుతీ సుజుకీ సియాజ్..
ఈ సెడాన్ మోడల్‌పై మొత్తం మీద రూ. 33వేల వరకు ఆఫర్స్ ఉన్నాయి. అవి.. రూ. 25వేలు విలువ చేసే ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5వేల వరకు స్క్రాపేజ్ డిస్కౌంట్, రూ. 3వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్. మార్కెట్లో ఈ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 9.30లక్షల నుంచి రూ. 12.29లక్షల మధ్యలో ఉంటుంది.
Discounts on Maruti Suzuki Ciaz : గ్రాండ్ విటారా, ఎక్స్ఎల్6 వంటి ప్రీమియం సెగ్మెంట్ మోడల్స్‌పై ఈసారి ఎలాంటి డిస్కౌంట్లను ప్రకటించలేదు మారుతీ సుజుకీ.
- పైన చెప్పిన డిస్కౌంట్లు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. అందుకే సమీప డీలర్షిప్షోరూమ్ను సందర్శించి, పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.
మారుతీ సుజుకీ క్యూ1 ఫలితాలు..
Maruti Suzuki Q1 results 2023 : దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ.. ఎఫ్వై24 క్యూ1 ఫలితాలను ఇటీవలే ప్రకటించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ స్టాండెలోన్ నెట్ ప్రాఫిట్ రూ. 2,485.1 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే ఇది 145శాతం (రూ. 1,012.8కోట్లు) అధికం! సేల్స్ వాల్యూమ్ వృద్ధిచెందడంతో పాటు చిప్ కొరత తగ్గడం వంటి అంశాలు సంస్థకు కలిసివచ్చాయి. ఈ ఫలితాలు మార్కెట్ అంచనాల కన్నా మించి ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.