Discounts on Hyundai cars : హ్యుందాయ్​ వాహనాలపై రూ. 2లక్షల వరకు డిస్కౌంట్లు..!-hyundai offers discounts up to 2 lakh on select models in august 2023 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Discounts On Hyundai Cars : హ్యుందాయ్​ వాహనాలపై రూ. 2లక్షల వరకు డిస్కౌంట్లు..!

Discounts on Hyundai cars : హ్యుందాయ్​ వాహనాలపై రూ. 2లక్షల వరకు డిస్కౌంట్లు..!

Sharath Chitturi HT Telugu
Aug 04, 2023 11:28 AM IST

Discounts on Hyundai cars : కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే.. హ్యుందాయ్​ ఇస్తున్న క్రేజీ డిస్కౌంట్ల గురించి తెలుసుకోవాల్సిందే..

Hyundai Alcazar
Hyundai Alcazar

Discounts on Hyundai cars : దేశంలో పండుగ సీజన్​ సమీపిస్తున్న తరుణంలో.. కస్టమర్లను ఆకర్షించేందుకు ఆటోమొబైల్​ సంస్థలు ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నాయి! ఇందులో భాగంగానే.. తమ పోర్ట్​ఫోలియోలోని పలు వాహనాలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హ్యుందాయ్​ మోటార్స్​. ఐ20, ఐ20 ఎన్​ లైన్​, గ్రాండ్​ ఐ10 నియోస్​, ఆరా, అల్కజార్​, కోనా ఎలక్ట్రిక్​ వంటి మోడల్స్​పై ఆగస్ట్​ నెలలో క్రేజీ ఆఫర్స్​ ఇస్తోంది. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

హ్యుందాయ్​ కోనా ఎలక్ట్రిక్​..

కోనా ఎలక్ట్రిక్​పై రూ. 2లక్షల వరకు డిస్కౌంట్లు ఇస్తోంది హ్యుందాయ్​ మోటార్స్​. జులైలో ఈ నెంబర్​ రూ.1లక్షగా ఉండేది. దేశంలో సంస్థ నుంచి లాంచ్​ అయిన తొలి ఈవీగా గుర్తింపు పొందిన ఈ కోనా ఎలక్ట్రిక్​లో 39.2 కేడబ్ల్యూహెచ్​ లిథియం ఐయాన్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది.

ఐ20.. ఐ20 ఎన్​ లైన్​..

Hyundai I20 on road price : ఈ రెండు మోడల్స్​పై రూ. 40వేల వరకు డిస్కౌంట్​ లభిస్తోంది. రూ.10లక్షల బడ్జెట్​లోపు మంచి హ్యాచ్​బ్యాక్​ కొనాలని భావించే వారికి ఈ మోడల్​ సరైన ఆప్షన్​ అవుతుంది. క్యాష్​ డిస్కౌంట్స్​, ఎక్స్​ఛేంజ్​ బోనస్​, కార్పొరేట్​ బోనస్​ వంటి బెనిఫిట్స్​ కలుపుకుని రూ.40వేల వరకు తగ్గింపు లభిస్తుంది.

ఇదీ చూడండి:- Hyundai exter price : హైదరాబాద్​లో హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలివే!

హ్యుందాయ్​ గ్రాండ్​ ఐ10 నియోస్​..

గ్రాండ్​ ఐ10 నియోస్​పై రూ. 43వేల వరకు డిస్కౌంట్​ పొందవచ్చు. ఇందులో 1.2 లీటర్​ కప్పా పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. సీఎన్​జీ వేరియంట్​కి కూడా ఈ డిస్కౌంట్​ వర్తిస్తుంది.

హ్యుందాయ ఆరా..

ఈ మోడల్​కు మార్కెట్​లో మంచి డిమాండే ఉంది! దీనిపై ఈ నెలలో రూ. 33వేల వరకు డిస్కౌంట్​ ఇస్తోంది ఆటోమొబైల్​ సంస్థ. వయర్​లెస్​ ఫోన్​ ఛార్జింగ్​, స్మార్ట్​ కీ, కీలెస్​ ఎంట్రీ, క్రూజ్​ కంట్రోల్​ వంటి క్రేజీ ఫీచర్స్​ ఇందులో లభిస్తున్నాయి.

హ్యుందాయ్​ అల్కజార్​..

Hyundai Alcazar on road price Hyderabad : హ్యుందాయ్​ అల్కజార్​ ఎస్​యూవీపై ఆగస్ట్​లో రూ. 20వేల వరకు డిస్కౌంట్​ను ఇస్తోంది సంస్థ. 6 సీట్​, 7సీట్​ కాన్ఫిగరేషన్​ ఉన్న అల్కజార్​కు డిమాండ్​ చాలానే ఉంది.

అయితే.. సంస్థకు బెస్ట్​ సెల్లింగ్​గా ఉన్న క్రేటా, వెన్యూ, వెర్నాలపై మాత్రం ఈ నెలలో ఎలాంటి డిస్కౌంట్లు లభించడం లేదు.

(గమనిక:- డిస్కౌంట్లు, ఆఫర్స్​ వంటివి డీలర్​షిప్​షోరూమ్స్​పై ఆధారపడి ఉంటాయి. పూర్తి వివరాల కోసం మీరు మీ సమీప డీలర్​షిప్​షోరూమ్స్​ను సంప్రదించాల్సి ఉంటుంది.)

సంబంధిత కథనం