Citroen eC3 bookings : సిట్రోయెన్ ఈసీ3 బుకింగ్స్ షురూ.. ఇలా బుక్ చేసుకోండి
23 January 2023, 11:32 IST
- Citroen eC3 bookings : సిట్రోయెన్ ఈసీ3 బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. వచ్చే నెలలో ఈ ఈవీ లాంచ్కానుంది.
సిట్రోయెన్ ఈసీ3 బుకింగ్స్ షురూ.. ఇలా బుక్ చేసుకోండి
Citroen eC3 bookings : ఫ్రెంచ్ దిగ్గజ ఆటో సంస్థ సిట్రోయెన్ నుంచి ఇండియాలో మొదటి ఈవీ లాంచ్కానుంది. అదే సిట్రోయెన్ ఈసీ3! వచ్చే నెల నుంచి ఈ ఈవీ ఇండియా రోడ్డు మీద చక్కర్లు కొట్టనుంది. ఇక ఇప్పుడు ఈ సిట్రోయెన్ ఈసీ3 ఈవీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
సిట్రోయెన్‌కు చెందిన లా మైసన్ డీలర్షిప్ షోరూమ్స్‌లో ఈ సిట్రోయెన్ ఈసీ3 ఈవీని బుక్ చేసుకోవచ్చు. ఇందుకు రూ. 25వేలు అడ్వాన్స్ కింది చెల్లించాల్సి ఉంటుంది. సిట్రోయెన్ అధికారిక వెబ్సైట్లోనూ ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను బుక్ చేసుకోవచ్చు.
సిట్రోయెన్ ఈసీ3.. టాటా టియాగోకు పోటీగా!
Citroen eC3 on road price : సీ5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీతో 2021లో ఇండియా మార్కెట్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది సిట్రోయెన్ ఆటో సంస్థ. ఇక గతేడాది లాంచ్ అయిన సిట్రోయెన్ సీ3.. ఈ ఆటో సంస్థకు బెస్ట్ సెల్లింగా ఉంది. సిట్రోయెన్ ఈసీ3 అనేది.. సీ3కి ఎలక్ట్రిక్ వర్షెన్!
సిట్రోయెన్ ఈసీ3 పొడవు 3,981ఎంఎం. వెడల్పు 1,733ఎంఎం, ఎత్తు 1,586ఎంఎం. రూఫ్ రెయిల్స్‌తో కలుపుకుని 1,604 ఎంఎం. వీల్‌బేస్ వచ్చేసి 2,540ఎంఎం.
Citroen eC3 first drive review వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సిట్రోయెన్ ఈసీ3లో 29.2కేడబ్ల్యూహెచ్‌తో కూడిన ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 57పీఎస్ పవర్‌ను, 143ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఈ ఈవీ 320కి.మీల దూరం ప్రయాణిస్తుందని తెలుస్తోంది. 10-100శాతం ఛార్జింగ్‌కు 15ఏ ప్లగ్ పాయింట్‌తో 30 నిమిషాలు పడుతుందని సమాచారం. ఇక డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 10-80శాతం ఛార్జింగ్‌కు 57 నిమిషాలు పడుతుందని తెలుస్తోంది.
Citroen eC3 features : సిట్రోయెన్ ఈసీ3 ధరకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. అయితే.. ఈ ఈవీ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 8.99లక్షలుగా ఉంటుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఇండియా మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత.. ఈ సిట్రోయెన్ ఈసీ3.. టాటా టియాగోకి గట్టిపోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి.
Citroen eC3 vs Tata Tiago EV : ఈ రెండు ఈవీల మధ్య ది బెస్ట్ ఏదనేది తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.