Citroen eC3 vs Tata Tiago EV : సిట్రోయెన్ ఈసీ3 వర్సెస్ టియాగో ఈవీ.. ది బెస్ట్ ఏది?
Citroen eC3 vs Tata Tiago EV : సిట్రోయెన్ ఈసీ3.. లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టాటా టియాగో ఈవీతో ఈ ఈవీని పోల్చి.. ది బెస్ట్ ఏదనేది ఇప్పుడు తెలుసుకుందాము.
Citroen eC3 vs Tata Tiago EV : ఇండియా ఆటో మర్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది! వివిధ ఈవీల లాంచ్‌లతో ఆటో సంస్థలు బిజీబిజీగా ఉంటున్నాయి. ఇండియా ఈవీ సెగ్మెంట్లో టాటా మోటార్స్ దూసుకెళుతున్న విషయం తెలిసిందే. అయితే.. టాటా మోటార్స్‌కు గట్టిపోటీనిచ్చేందుకు ఇతర సంస్థలు సైతం ప్రయత్నిస్తున్నాయి. ఈ లిస్ట్‌లో సిట్రోయెన్ ఆటో సంస్థ ముందు వరుసలో ఉంది! సిట్రోయెన్ ఈసీ3 ఈవీని ఆవిష్కరించింది. ఫిబ్రవరిలో ఇది మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. లాంచ్ తర్వాత.. ఈ సిట్రోయెన్ ఈసీ3.. టాటా టియాగో ఈవీకి గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. మరి వీటిని ఓసారి పోల్చి చూసి ది బెస్ట్ ఈవీ ఏదనేది తెలుసుకుందాము..
సిట్రోయెన్ ఈసీ3 వర్సెస్ టాటా టియాగో ఈవీ- డైమెన్షన్స్..
Citroen eC3 launch date in India : సిట్రోయెన్ ఈసీ3 పొడవు 3,981ఎంఎం. వెడల్పు 1,733ఎంఎం, ఎత్తు 1,586ఎంఎం. రూఫ్ రెయిల్స్‌తో కలుపుకుని 1,604 ఎంఎం. వీల్‌బేస్ వచ్చేసి 2,540ఎంఎం.
ఇక టాటా టియాగో ఈవీ పొడవు 3,769ఎంఎం. వెడల్పు 1,677ఎంఎం. ఎత్తు 1,536ఎంఎం. వీల్‌బేస్ వచ్చేసి 2,400 ఎంఎం. డైమెన్షన్స్ విషయంలో సీట్రోయెన్ ఈసీ3.. టటా టియాగో ఈవీని డామినేట్ చేస్తోందని స్పష్టమవుతోంది.
సిట్రోయెన్ ఈసీ3 వర్సెస్ టాటా టియాగో ఈవీ- ఇంజిన్..
Citroen eC3 range : సిట్రోయెన్ ఈసీ3లో 29.2కేడబ్ల్యూహెచ్‌తో కూడిన ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 57పీఎస్ పవర్‌ను, 143ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఈ ఈవీ 320కి.మీల దూరం ప్రయాణిస్తుందని తెలుస్తోంది. 10-100శాతం ఛార్జింగ్‌కు 15ఏ ప్లగ్ పాయింట్‌తో 30 నిమిషాలు పడుతుందని సమాచారం. ఇక డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 10-80శాతం ఛార్జింగ్‌కు 57 నిమిషాలు పడుతుందని తెలుస్తోంది.
టాటా టియాగో ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి.. 19.2కేడబ్ల్యూహెచ్, 24కడబ్ల్యూహెచ్. మొదటిది.. 61పీఎస్ పవర్‌ను, 110ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250కి.మీల దూరం ప్రయాణిస్తుంది. 10-100శాతం ఛార్జింగ్ కోసం 3.3కేడబ్ల్యూ ఛార్జర్‌తో 6.4గంటలు పడుతుంది. 25కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌తో.. 10-80శాతం ఛార్జింగ్‌కు 57 నిమిషాలు పడుతుంది.
Tata Tiago EV range : ఇక రెండో బ్యాటరీ ప్యాక్ 75పీఎస్ పవర్‌ను, 114 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315కి.మీల దూరం ప్రయాణిస్తుంది. 7.2కేడబ్ల్యూ ఛార్జర్‌తో 10-100శాతం ఛార్జింగ్‌కు 3.6గంటల సమయం పడుతుంది. 25కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 10-80శాతం ఛార్జింగ్‌కు 57 నిమిషాల సమయం పడుతుంది.
టాటా టియాగోతో ఈవీతో పోల్చుకుంటే.. సిట్రోయెన్ ఈసీ3 ఈవీ రేంజ్ పెద్దగా ఉంది.
సిట్రోయెన్ ఈసీ3 వర్సెస్ టాటా టియాగో ఈవీ- ఫీచర్స్..
సిట్రోయెన్ ఈసీ3లో ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో కూడిన హాలోజెన్ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. ఆప్షనల్ డ్యూయెల్ టోన్ రూఫ్ కూడా లభిస్తోంది. రూఫ్ రైల్స్, బాడీ కలర్డ్ బంపర్స్, ఫుల్ వీల్ కవర్స్, ఫాబ్రిక్ అప్‌హోలిస్ట్రీ, క్రోమ్ ఇన్సైడ్ డోర్ హ్యండిల్స్, ఫిక్స్డ్ ఫ్రంట్ అండ్ రేర్ హెడ్రెస్ట్, డిజిటైజ్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12వీ సాకెట్, టిల్ట్ స్టీరింగ్, మేన్యువల్ ఏసీ, ఓఆర్వీఎంలు, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ కాలింగ్ కంట్రోల్స్, హైట్ అడ్జస్టెబుల్ డ్రైవర్ సీట్ ఉన్నాయి.
Citroen eC3 features : ఇందులో 4 పవర్ విండోస్, 4 స్పీకర్ మ్యుజిక్ సిస్టెమ్, 10.2 ఇంచ్ టచ్‌స్క్రీన్, కనెక్టెడ్ కార్ టెక్, వయర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో- యాపిల్ కార్ప్లే, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రేర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
టాటా టియాగో ఈవీలో.. ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో కూడిన ఆటో- ప్రొజెక్టెర్ హెడ్‌ల్యాంప్స్, ఆప్షనల్ బ్లాక్ రూఫ్, స్టైల్డ్ వీల్ కవర్స్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, బడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్- బంపర్స్, ఓఆర్వీఎమ్లు, లెథరెట్ అప్‌హోలిస్ట్రీ, లెథర్ వ్రాపిడ్ స్టీరింగ్ వీల్, ఫ్లాట్ బాటమన్ స్టీరింగ్ వీల్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్వీఎం, ఆటో ఏసీ, ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ ఓఆర్వీఎం, క్రూయిజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్/ స్టాప్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, డిజిటైజ్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హైట్ అడ్జస్టెబుల్ డ్రైవర్ సీట్, 4 పవర్ విండోస్, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్, 4 ట్వీటర్స్- 4 స్పీకర్స్, ఆండ్రాయిడ్ ఆటో- యాపిల్ కార్ప్లే, రివర్సింగ్ కెమెరా, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, టీపీఎంసీ, ఏబీఎస్ విత్ ఈబీడీ, రేర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
సిట్రోయెన్ ఈసీ3తో పోల్చుకుంటే.. టాటా టియాగో ఈవీలో బెటర్ ఫీచర్స్ ఉన్నట్టు కనిపిస్తోంది.
సిట్రోయెన్ ఈసీ3 వర్సెస్ టాటా టియాగో ఈవీ- ధర..
Citroen eC3 price in Hyderabad : సిట్రోయెన్ ఈసీ3 ధరకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. అయితే.. ఈ ఈవీ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 8.99లక్షలుగా ఉంటుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
Tata Tiago EV on road price in Hyderabad : ఇక టాటా టియాగో ఈవీ ఎక్స్‌షోరూం ధర రూ. 8.49లక్షలు- రూ. 11.79లక్షల మధ్యలో ఉంటుంది.
సంబంధిత కథనం