Citroen eC3 launch : 320కి.మీ రేంజ్​తో సిట్రోయెన్​ ఈసీ3.. ఫిబ్రవరిలో లాంచ్​ ఫిక్స్​-citroen ec3 electric hatchback unveiled to launch in february check full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Citroen Ec3 Launch : 320కి.మీ రేంజ్​తో సిట్రోయెన్​ ఈసీ3.. ఫిబ్రవరిలో లాంచ్​ ఫిక్స్​

Citroen eC3 launch : 320కి.మీ రేంజ్​తో సిట్రోయెన్​ ఈసీ3.. ఫిబ్రవరిలో లాంచ్​ ఫిక్స్​

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 17, 2023 06:52 AM IST

Citroen eC3 launch date in India : ఈసీ3 ఎలక్ట్రిక్​ వెహికిల్​ని ఆవిష్కరించింది సిట్రోయెన్​. వచ్చే నెలలో ఇది ఇండియా మార్కెట్​లోకి అడుగుపెట్టనుంది!

320కి.మీ రేంజ్​తో సిట్రోయెన్​ ఈసీ3
320కి.మీ రేంజ్​తో సిట్రోయెన్​ ఈసీ3

Citroen eC3 launch date in India : ఇండియా ఈవీ మార్కెట్​లో పోటీని మరింత పెంచుతూ.. ఓ కొత్త ఎలక్ట్రిక్​ వాహనాన్ని అధికారికంగా ఆవిష్కరించింది సిట్రోయెన్​ సంస్థ. ఈ సిట్రోయెన్​ ఈసీ3 ఈవీ.. ఫిబ్రవరిలో లాంచ్​ కానున్నట్టు ప్రకటించింది. ఈ నెల 22 నుంచి బుకింగ్స్​ ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది.

సీ3.. ఈసీ3.. సిట్రోయెన్​ జోరు!

సిట్రోయెన్​ ఈసీ3లో ఉండే ఎలక్ట్రిక్​ మోటార్​.. 57 పీఎస్​ పవర్​ను, 143 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇది.. 0- 60కేఎంపీహెచ్​ను 6.8 సెకన్లలో అందుకుంటుంది. సిట్రోయెన్​ నుంచి వస్తున్న ఈ ఈవీ టాప్​ స్పీడ్​ 107కేఎంపీహెచ్​గా ఉంది. ఇందులో ఉండే 29.2 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ను ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. ఈ ఈవీ 320కి.మీల వరకు ప్రయాణిస్తుందని తెలుస్తోంది. డీసీ ఫాస్ట్​ ఛార్జింగ్​కు సపోర్ట్​ చేస్తుండటంతో.. 10శాతం నుంచి 80శాతం ఛార్జ్​ను కేవలం 57 నిమిషాల్లో పొందచ్చు! 15ఏ పవర్​ సాకెట్​తో అయితే.. 10 నుంచి 100శాతం ఛార్జింగ్​ను పొందడానికి 10.5 గంటల సమయం పడుతుంది.

Citroen eC3 EV : ఈ ఈసీ3 ఈవీ.. గతేడాది ఇండియా మార్కెట్​లో లాంచ్​ అయ్యి, మంచి డిమాండ్​ పొందుతున్న సిట్రోయెన్​ సీ3కి ఎలక్ట్రిక్​ వర్షెన్​ అన్న విషయం తెలిసిందే. సీ3కి ఈ ఈవీకి ఎన్నో ఫీచర్స్​ ఒకే విధంగా ఉంటాయి. ఇందులో మేన్యువల్​ ఏసీ, డిటిటైజ్​డ్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 10 ఇంచ్​ ఇన్​ఫోటైన్​మెంట్​ టచ్​స్క్రీన్​, వయర్​లెస్​ ఆండ్రాయిడ్​ ఆటో, యాపిల్​ కార్​ప్లే ఉంటాయి. ఈ సిట్రోయెన్​ ఈసీ3లో 315 లీటర్ల బూట్​ స్పేస్​ ఉంది. స్పేర్​ వీల్​ను కూడా ప్రొవైడ్​ చేస్తున్నారు.

రెండు వేరియంట్లలో సిట్రోయెన్​ ఈసీ3..

సీ3లో ఉన్నట్టుగానే.. ఈ సిట్రోయెన్​ ఈసీ3ని కూడా రెండు వేరియంట్లలో తీసుకొస్తున్నారు. అవి.. లివర్​, ఫీల్​. అంతేకాకుండా.. అనేక కస్టమైజ్​డ్​ ఆప్షన్స్​, యాక్ససరీస్​తోనూ ఈ ఎలక్ట్రిక్​ వాహనాన్ని పొందవచ్చు.

Citroen eC3 price in India : ఇక లాంచ్​ తర్వాత.. ఈ సిట్రోయెన్​ ఈసీ3.. టాటా టియాగో ఈవీ, టాటా టిగోర్​ ఈవీకి గట్టి పోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. ధరకు సంబంధించిన వివరాలు సిట్రోయెన్​ ఇంకా ప్రకటించలేదు. కొన్ని రోజుల్లో ఈ విషయంపై స్పష్టత వస్తుంది. అయితే.. ఈ సిట్రోయెన్​ ఈసీ3 ప్రారంభం ఎక్స్​షోరూం ప్రైజ్​ రూ. 8.99లక్షలుగా ఉంటుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. ఇదే నిజమైతే.. ఇండియాలో లభిస్తున్న అతి చౌకైన ఈవీల్లో ఒకటిగా ఈ సిట్రోయెన్​ ఈసీ3 ఎలక్ట్రిక్​ వాహనం నిలిచిపోతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం