Citroen eC3 first drive review : సిట్రోయెన్​ ఈసీ3 ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూ.. కొత్త ఈవీ ఎలా ఉంది?-citroen ec3 first drive review check full details and first impression here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Citroen Ec3 First Drive Review Check Full Details And First Impression Here

Citroen eC3 first drive review : సిట్రోయెన్​ ఈసీ3 ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూ.. కొత్త ఈవీ ఎలా ఉంది?

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 21, 2023 02:02 PM IST

Citroen eC3 first drive review : త్వరలో లాంచ్​కానున్న సిట్రోయెన్​ ఈసీ3 ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూ వచ్చేసింది. మరి ఈ ఈవీ మెప్పించిందా?

సిట్రోయెన్​ ఈసీ3 ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూ.. కొత్త ఈవీ ఎలా ఉంది?
సిట్రోయెన్​ ఈసీ3 ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూ.. కొత్త ఈవీ ఎలా ఉంది? (HT AUTO)

Citroen eC3 first drive review : ఇండియా ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో సిట్రోయెన్​ ఈసీ3 ఇప్పుడొక హాట్​టాపిక్​. వచ్చే నెలలో లాంచ్​కానున్న ఈ ఈవీని సిట్రోయెన్​ సంస్థ ఇప్పటికే ఆవిష్కరించింది. ఇక ఇప్పుడు.. హిందుస్థాన్​ టైమ్స్​ ఆటో బృందం ఈ వెహికిల్​ను నడిపింది. చెన్నైలోని టెస్ట్​ ట్రాక్​లో 45 నిమిషాల పాటు.. సిట్రోయెన్​ ఈసీ3ని డ్రైవ్​ చేసింది. ఈ నేపథ్యంలో.. ఈ కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​ ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూను ఓసారి చూసేద్దాం..

సిట్రోయెన్​ ఈసీ3 ఎక్స్​టీరియర్​..

గతేడాది లాంచ్​ అయిన సిట్రోయెన్​ సీ3కి.. ఈ సిట్రోయెన్​ ఈసీ3 ఈవీకి ఎక్స్​టీరియర్​ విషయంలో పెద్దగా మార్పులు లేవు. ఫలితంగా.. ఈ రెండు వాహనాల డైమెన్షన్స్​, స్టైలింగ్​ ఒకటే. ఇది ఆ సంస్థకు కలిసివచ్చే విషయమే! అయితే.. ఈసీ3లో టెయిల్​ పైప్​ లేదు. ఫ్రంట్​ సైడ్​లో ఛార్జింగ్​ సెక్షన్​ వచ్చింది. మల్టిపుల్​ కలర్​ ఆప్షన్​, ఆలాయ్​ డిజైన్​, హెడ్​లైట్​- డీఆర్​ఎల్​ షేప్​ ఒకే విధంగా ఉన్నాయి.

సిట్రోయెన్​ ఈసీ3- క్యాబిన్​..

Citroen eC3 review : సిట్రోయెన్​ సీ3- ఈసీ3 క్యాబిన్​లలోనూ పెద్దగా మార్పులు జరగలేదు. ఆరు నెలల క్రితమే సిట్రోయెన్​ సీ3 లాంచ్​ అవ్వడంతో.. ఇప్పటికీ అది ఫ్రెష్​గానే ఉండటం సంస్థకు కలిసి వచ్చింది. సీ3లో ఉన్నట్టుగానే.. ఈసీ3లో 10 ఇంచ్​ స్మార్ట్​ ఇన్​ఫోటైన్​మెంట్​ స్క్రీన్​ ఉంటుంది. డైరక్ట్​ సన్​లైట్​లోనూ టచ్​ బాగా రెస్పాన్సివ్​గా ఉంది. ఈవీకి సంబంధించిన అప్డేట్స్​ క్యాబిన్​లో ఏం కనిపించలేదు. వయర్​లెస్​ ఆండ్రాయిడ్​ ఆటో- యాపిల కార్​ప్లే వంటి ఫీచర్స్​ వచ్చాయి. డ్రైవర్​ డిస్​ప్లే మాత్రం రొటీన్​గా, బేసిక్​గా ఉంది. స్పీడ్​, బ్యాటరీ ఛార్జ్​, ఎస్టిమేటెడ్​ రేంజ్​ రిమైనింగ్​ వంటివి కనిపిస్తున్నాయి. సీ3తో పోల్చుకుంటే.. ఈసీ3 ఈవీలో డ్రైవర్​ డిస్​ప్లే ఇంకాస్త మెరుగ్గా చేసి ఉండాల్సింది.

డాష్​బోర్డ్​ లేఅవుట్​ విషయానికొస్తే.. ఏసీ వెంట్స్​, కంట్రోల్​ నాబ్స్​ డిజైన్​ ఒకే విధంగా ఉంది. అయితే.. సెంటర్​ కన్సోల్​ మారింది. స్పేస్​ విషయంలో ఈసీ3 చాలా కన్​ఫర్ట్​ని ఇస్తుంది. టాటా టియాగో ఈవీతో పోల్చుకుంటే దీని డైమెన్షన్స్​ పెద్దగా ఉండటం ఇందుకు కారణం. బూట్​ స్పేస్​ కూడా పెద్దగా ఉండటం విశేషం.

Citroen eC3 vs Tata Tiago EV : సిట్రోయెన్​ ఈసీ3 వర్సెస్​ టియాగో ఈవీ.. ఈ రెండింట్లో ది బెస్ట్​ ఏదనేది తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

Citroen eC3 on road price in Hyderabad : బ్యాటరీ, రేంజ్​పై సిట్రోయెన్​ సంస్థ బాగా దృష్టిపెట్టినట్టు కనిపిస్తుంది. 29.2కేడబల్యూహెచ్​ బ్యాటరీ ఉండటంతో ఇది 300కి.మీల దూరం ప్రయాణిస్తుందన అంచనాలు ఉన్నాయి. హిందుస్థాన్​ టైమ్స్​ ఆటో.. రేంజ్​ను టెస్ట్​ చేయలేకపోయింది. పైగా.. టెస్ట్​ ట్రాక్​ చాలా స్మూత్​గా, సెక్యూర్​గా ఉండటంతో.. ఈ ఈవీ ఎబిలిటీని లెక్కగట్టడం సరైన విషయం కాదు. కాగా.. ఈ ఈవీ 57 హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. దీని టాప్​ స్పీడ్​ 107కేఎంపీహెచ్​. ఇంత తక్కువ స్పీడ్​ ఉంటే.. మంచి మేలేజ్​ వస్తుందని సంస్థ చెబుతోంది.

ఇక కర్వ్​లు వచ్చినప్పుడు.. సిట్రోయెన్​ ఈసీ3లో బాడీ రోల్​ జరుగుతోంది. 143ఎన్​ఎం టార్క్​ జనరేట్​ అవుతున్నప్పటికీ.. స్పీడ్​ అనేది నిదానంగా పెరుగుతోంది. సీ3తో పోల్చుకుంటే.. ఈసీ3లో సస్పెన్షన్​ సెటప్​ను మార్చినట్టు సిట్రోయెన్​ సంస్థ చెబుతోంది. కానీ ఫ్లాట్​ ట్రాక్​పై దానిని టెస్ట్​ చేయడానికి కుదరలేదు.

సిట్రోయెన్​ ఈసీ3 ఫస్ట్​ డ్రైవ్​ వర్డిక్ట్​..!

Citroen eC3 bookings : ఇండియన్​ రోడ్ల మీద నడిపితే కాని.. సిట్రోయెన్​ ఈసీ3 ప్రదర్శనపై పూర్తి అంచనాకు రాలేము. కానీ.. టెస్ట్​ డ్రైవ్​లో మాత్రం.. ఈసీ3 మెరుగైన ప్రదర్శనే చేసిందని హెచ్​టీ ఆటో బృందం చెబుతోంది.

అయితే.. ఈసీ3 ధర ఇప్పుడు కీలకంగా మారనుంది. టాటా టియాగో ఈవీకి గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉండటంతో.. ఈ సిట్రోయెన్​ ఈసీ3 ఈవీ ధర రూ. 10లక్షలలోపు ఉంటుందని తెలుస్తోంది. ఇదే జరిగితే.. ఇండియాలోనే అత్యంత చౌకైన ఈవీల్లో ఒకటిగా ఈ వెహికిల్​ నిలిచిపోతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం