Citroen C3X sedan : సీ3ఎక్స్ సెడాన్ లాంచ్‌కు ప్లాన్ చేస్తున్న సిట్రోయెన్.. విశేషాలివే!
21 May 2023, 8:31 IST
- Citroen C3X sedan : సీ3ఎక్స్ సెడాన్ మోడల్‌ను ఇండియాలో లాంచ్ చేసేందుకు సిట్రోయెన్ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
సీ3ఎక్స్ సెడాన్ లాంచ్‌కు ప్లాన్ చేస్తున్న సిట్రోయెన్.. విశేషాలివే!
Citroen C3X sedan : వరుస లాంచ్‌లతో దూసుకెళుతున్న ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సిట్రోయెన్.. ఇండియా మార్కెట్లో మరో కారును లాంచ్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అదే సిట్రోయెన్ సీ3ఎక్స్ సెడాన్. ఈ క్రాసోవర్ సెడాన్ వచ్చే ఏడాదిలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. వోక్స్వ్యాగన్ వర్టూస్, స్కోడా స్లావియాకు గట్టిపోటీనిచ్చే విధంగా ఈ మోడల్‌ను సిట్రోయెన్ రూపొందిస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సెడాన్‌పై ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని తెలుసుకుందాము..
సిట్రోయెన్ సీ3ఎక్స్- డిజైన్..
ఈ సిట్రోయెన్ సీ3ఎక్స్ ఎక్స్టీరియర్ లుక్.. సిట్రోయెన్ సీ3ని పోలి ఉండొచ్చు. స్కల్ప్టెడ్ బానెట్, బంపర్ మౌంటెడ్ హెడ్‌లైట్స్ విత్ స్ప్లిట్ టైప్ డీఆర్ఎల్స్, స్లీక్ గ్రిల్, డబుల్ చెవ్రాన్ లోగో, ఫ్లేర్డ్ వీల్ ఆర్చీస్, ఫాస్ట్‌బ్యాక్ లైక్ స్లోపింగ్ రూఫ్‌లైన్, డిజైనర్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి.
Citroen C3X sedan launch in India : ఇక ఈ సెడాన్ రేర్‌లో వ్రాప్ అరౌండ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ ఉంటాయని తెలుస్తోంది.
సిట్రోయెన్ సీ3ఎక్స్- ఫీచర్స్..
సిట్రోయెన్ సీ3ఎక్స్ సెడాన్ ఇంటీరియర్ వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇందులోని స్పేషియస్ కేబిన్‌లో మినిమలిస్ట్ డాష్‌బోర్డ్, ప్రీమియం అప్‌హోలిస్ట్రీ, యాంబియెంట్ లైటింగ్, మేన్యువల్ ఏసీ వెంట్స్, రేర్ ఏసీ వెంట్స్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10 ఇంచ్ టచ్‌స్కీన్ ఇన్ఫోటైన్మెంట్ ప్యానెల్ ఉండనున్నాయి. ఇందులో ఇన్ఫోటన్మెంట్ సిస్టెమ్.. సీ3, సీ3 ఎయిర్‌క్రాస్‌ను పోలీ ఉంటుందని తెలుస్తోంది.
ప్యాసింజర్ సేఫ్టీ కోసం మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్ లభిస్తాయి.
సిట్రోయెన్ సీ3ఎక్స్ సెడాన్- ఇంజిన్..
Citroen C3X sedan price : ఇందులో 1.2 లీటర్, లిక్వ్‌డ్ కూల్డ్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. ఇది 108.4 హెచ్‌పీ పవర్‌ను, 190ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 6స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ ఉండొచ్చు.
సిట్రోయెన్ సీ3ఎక్స్- ధర..
Citroen C3X sedan price in India : ఈ సెడాన్ మోడల్ ధరకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. లాంచ్ డేట్, స్పెసిఫికేషన్స్, ధర, ఫీచర్స్పై రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ప్రీమియం సెగ్మెంట్లో ఇది అడుగుపెట్టొచ్చు.
సిట్రోయెన్ సీ4.. వచ్చేస్తోంది!
Citroen C4 : సిట్రోయెన్ నుంచి.. సీ3, సీ3 ఎయిర్‌క్రాస్, సీ5 ఎయిర్‌క్రాస్‌తో పాటు ఈసీ3 ఎలక్ట్రిక్ వెహికిల్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే.. సిట్రోయెన్ సీ4 ప్రస్తుతం టెస్ట్ రన్ దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వెహికిల్ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.