Citroen C4 : టెస్ట్​ రన్​ దశలో సిట్రోయెన్​ సీ4.. ఇండియాలో లాంచ్​ అవుతుందా?-citroen c4 spotted in india see full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Citroen C4 : టెస్ట్​ రన్​ దశలో సిట్రోయెన్​ సీ4.. ఇండియాలో లాంచ్​ అవుతుందా?

Citroen C4 : టెస్ట్​ రన్​ దశలో సిట్రోయెన్​ సీ4.. ఇండియాలో లాంచ్​ అవుతుందా?

Sharath Chitturi HT Telugu
May 14, 2023 10:05 AM IST

Citroen C4 India : వరుస లాంచ్​లతో జోరు మీద ఉన్న సిట్రోయెన్​ సంస్థకు చెందిన మరో మోడల్​ టెస్ట్​ రన్​ దశలో ఉంది. అదే సిట్రోయెన్​ సీ4. మరి ఈ మోడల్​ ఇండియాలోకి ఎప్పుడొస్తుంది?

టెస్ట్​ రన్​ దశలో సిట్రోయెన్​ సీ4.. ఇండియాలో లాంచ్​ అవుతుందా?
టెస్ట్​ రన్​ దశలో సిట్రోయెన్​ సీ4.. ఇండియాలో లాంచ్​ అవుతుందా? (Representative image)

Citroen C4 SUV : ఇండియా మార్కెట్​లో కొత్త కొత్త లాంచ్​లతో దూసుకెళుతోంది సిట్రోయెన్​ సంస్థ. సీ5 ఎయిర్​క్రాస్​తో ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. సీ3​, ఈసీ3 మోడల్స్​ను తీసుకొచ్చింది. కొత్తగా సీ3 ఎయిర్​క్రాస్​ను కూడా పరిచయం చేసింది. ఇక ఇప్పుడు సిట్రోయెన్​ సీ4 ఎస్​యూవీ తాజాగా.. ఇండియా రోడ్ల మీద కనిపించింది! మరి ఈ మోడల్​ ఇండియాలో లాంచ్​ అవుతుందా?

సిట్రోయెన్​ సీ4 ఎస్​యూవీ- టెస్ట్​ డ్రైవ్​ దశలో..

Citroen C4 India : టెస్ట్​ రన్​ దశలో ఉన్న సిట్రోయెన్​ సీ4 ఎస్​యూవీ.. ఇటీవలే ఇండియన్​ రోడ్ల మీద దర్శనమిచ్చింది. ఇందులో స్క​ల్ప్​టెడ్​ క్యామ్​షెల్​ బానెట్​, బంపర్​ మౌంటెడ్​ హెడ్​లైట్స్​ విత్​ ఎక్స్​ షేప్​ స్ప్లిట్​ డీఆర్​ఎల్స్​, స్లీక్​ క్రోమ్డ్​ గ్రిల్​, డబుల్​ చెవ్రాన్​ లోగో, సిల్వర్డ్​ స్కిడ్​ ప్లేట్స్​, రూఫ్​ రెయిల్స్​, ఓఆర్​వీఎంలు, ఫ్లేర్డ్​ వీల్​ ఆర్చీస్​, డిజైనర్​ అలాయ్​ వీల్స్​ వచ్చే అవకాశం ఉంది. ఇక రేర్​లో వ్రాప్​ రౌండ్​ ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​ ఉన్నాయి.

సిట్రోయెన్​ సీ4 5 సీటర్​ కేబిన్​లో డ్యూయెల్​ టోన్​ ఇంటీరియర్​ థీమ్​ ఉండొచ్చు. మినిమలిస్ట్​ డాష్​బోర్డ్​, ప్రీమియం అప్​హోలిస్ట్రీ, యాంబియెంట్​ లైటింగ్​ ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, రేర్​ ఏసీ వెంట్స్​, మల్టీఫంక్షనల్​ స్టీరింగ్​ వీల్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, లేటెస్ట్​ కనెక్టివిటీ ఆప్షన్స్​ ఉండొచ్చు.

ఇదీ చూడండి:- Tata Punch EV news : ఇదిగో టాటా పంచ్​ ఈవీ.. 300కి.మీ రేంజ్​? లాంచ్​ ఎప్పుడు?

ఇక ప్యాసింజర్​ సేఫ్టీ కోసం ఈ ఎస్​యూవీలో మల్టిపుల్​ ఎయిర్​బ్యాగ్స్​, ఏబీఎస్​, ఎలక్ట్రానిక్​ స్టెబులిటీ కంట్రోల్​ వంటివి వస్తున్నాయి.

Citroen C4 price in India : ఈ సిట్రోయెన్​ సీ4 ఎస్​యూవీ ఇంజిన్​ ఆప్షన్స్​ గురించి ఇంకా ఎలాంటి సమాచారం వెలువడలేదు. అంతర్జాతీయ మార్కెట్​లో ఈ సీ4కు పెట్రోల్​, డీజిల్​తో పాటు ఎలక్ట్రిక్​ మోటార్​ ఆప్షన్​ కూడా ఉంది.

లాంచ్​ ఎప్పుడు?

Citroen C4 news : సిట్రోయెన్​ సీ4 వాహనం మిడ్​ సైజ్​ కూపే ఎస్​యూవీ సెగ్మెట్​లోకి వస్తుంది. ఈ సెగ్మెంట్​కు ఇండియాలో ప్రస్తుతానికైతే పెద్దగా డిమాండ్​ లేదు. మోడల్స్​ కూడా లేవు! అందుకే ఈ సీ4 ఎస్​యూవీ ఇప్పట్లో ఇండియాలో లాంచ్​ అవ్వకపోవచ్చని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. ఇంజిన్​ ఆప్షన్స్​ను పరీక్షించేందుకే సిట్రోయెన్​.. ప్రస్తుతం ఈ సీ4 టెస్ట్​ రన్​ను​ చేపట్టినట్టు తెలుస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం