Electric car : ఈ ఎలక్ట్రిక్ కారు సేల్స్ టాటా ఈవీలను దాటేశాయి- హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ప్రైజ్ ఎంతంటే..
03 December 2024, 12:10 IST
MG Windsor EV on road price Hyderabad : ఇండియాలో గత రెండు నెలలుగా బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారుగా కొనసాగుతోంది ఎంజీ విండ్సర్ ఈవీ! ఈ ఈవీ రేంజ్‌తో పాటు హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
బెస్ట్ సెల్లింగ్ ఎంజీ విండ్సర్ ఈవీ..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇటీవలే లాంచ్ అయిన ఎంజీ విండ్సర్ ఈవీ దుమ్మురేపుతోంది. వరుసగా రెండు నెలల పాటు బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది ఈ ఎంజీ విండ్సర్. మరీ ముఖ్యంగా.. ఇండియన్ ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో రారాజుగా గుర్తింపు తెచ్చుకున్న టాటా మోటార్స్‌కి చెందిన ఈవీలను వెనక్కి నెట్టి మరీ సేల్స్‌లో ఈ కారు దూసుకెళుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఈ ఎంజీ విండ్సర్ ఈవీ రేంజ్, హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
టాటా ఈవీలను దాటేసిన ఎంజీ విండ్సర్..
2024 నవంబర్‌లో ఎంజీ విండ్సర్ ఈవీకి సంబంధించిన 3,144 యూనిట్లను విక్రయించినట్టు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ తెలిపింది. అక్టోబర్‌లో సైతం సేల్స్ భారీగానే జరిగాయి. ఫలితంగా ఈ మోడల్ వరుసగా రెండు నెలల పాటు బెస్ట్ సెల్లింగ్‌గా ఉంది. ఇక నవంబర్‌లో, ఎలక్ట్రిక్ వెహికిల్ సేల్స్ విషయంలో ఎంజీ మోటార్ సంస్థ (6019).. టాటా మోటార్స్ (5,202)ని దాటేసింది. ఇందులో కీలక భాగం ఇటీవలే లాంచ్ అయిన ఎలక్ట్రిక్ కారుదే.
హైదరాబాద్‌లో ఎంజీ విండ్సర్ ఈవీ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు..
- ఎంజీ విండ్సర్ ఈవీ ఎగ్జైట్- రూ. 14.22 లక్షలు
- ఎంజీ విండ్సర్ ఈవీ ఎక్స్‌క్లూజివ్- రూ. 15.27 లక్షలు
- ఎంజీ విండ్సర్ ఈవీ ఎసెన్స్- రూ. 16.32 లక్షలు
ఈ మూడు వేరియంట్లలో టాప్ ఎండ్ మోడల్ ఎంజీ విండ్సర్ ఈవీ ఎసెన్స్ బెస్ట్ సెల్లింగ్‌గా ఉండటం విశేషం.
సాధారణంగా వెహికల్‌కి ఎక్స్‌షోరూం ప్రైజ్, ఆన్‌రోడ్ ప్రైజ్‌లు వేరువేరుగా ఉంటాయి. వెహికిల్‌ని లాంచ్ చేసే సమయంలో ఆటోమొబైల్ సంస్థలు ఎక్స్‌షోరూం ధరలను మాత్రమే చెబుతాయి. కాగా ఆన్‌రోడ్ ప్రైజ్ అనేది వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్‌లు వేరువేరుగా ఉండటంతో మారుతుంటూ ఉంటుది. అందుకే కస్టమర్లు వెహికిల్‌ని కొనే ముందు, ఎక్స్‌షోరూం ప్రైజ్ కాకుండా ఆన్‌రోడ్ ప్రైజ్ తెలుసుకుని బడ్జెట్ వేసుకోవాలి. సమీప డీలర్షిప్ షోరూమ్స్ని సందర్శిస్తే.. ఆ సమయంలో వెహికిల్‌పై ఏవైనా ఆఫర్స్ ఉన్నాయా? అనేది కూడా తెలుస్తుంది. అది ఖర్చు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
ఎంజీ విండ్సర్ ఈవీ రేంజ్..
విండ్సర్ ఈవీలో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా 38 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగిస్తోంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 332 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ని అందిస్తుంది. రియాలిటీలో, డ్రైవింగ్ రేంజ్ 260 నుంచి 280 కిలోమీటర్ల మధ్యలో ఉంటుందని తెలుస్తోంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి బ్యాటరీ ప్యాక్‌ని కేవలం 55 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు.
ఎంజీ విండ్సర్ ఈవీ నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. అవి స్టార్బరస్ట్ బ్లాక్, పర్ల్ వైట్, క్లే బీజ్, టర్కోయిస్ గ్రీన్.