తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Electric Car For Long Trips : లాంగ్​ ట్రిప్స్​​ కోసమే ఈ టాటా ఈవీ- హైదరాబాద్​లో ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే…

Best electric car for long trips : లాంగ్​ ట్రిప్స్​​ కోసమే ఈ టాటా ఈవీ- హైదరాబాద్​లో ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే…

Sharath Chitturi HT Telugu

02 December 2024, 18:31 IST

google News
    • Tata Curvv EV on road price in Hyderabad : లాంగ్​ డ్రైవ్​, లాంగ్​ ట్రిప్స్​కి వెళ్లేందుకు ఉన్న ఎలక్ట్రిక్​ కార్ల ఆప్షన్స్​లో టాటా కర్వ్​ ఈవీకి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో టాటా కర్వ్​ ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సింగిల్​ ఛార్జ్​తో 585 కి.మీ రేంజ్​- హైదరాబాద్​లో ఈ ఈవీ ధర ఎంతంటే..
సింగిల్​ ఛార్జ్​తో 585 కి.మీ రేంజ్​- హైదరాబాద్​లో ఈ ఈవీ ధర ఎంతంటే..

సింగిల్​ ఛార్జ్​తో 585 కి.మీ రేంజ్​- హైదరాబాద్​లో ఈ ఈవీ ధర ఎంతంటే..

ఎలక్ట్రిక్​ వాహనాలను నగరాల్లో ఎలాగైనా వాడొచ్చు. కానీ లాంగ్​ డ్రైవ్స్​లో ఛార్జింగ్​, బ్యాటరీ సమస్యలు వస్తే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే చాలా మంది ఈవీ కొనేందుకు డౌట్​ పడుతున్నారు. అయితే, లాంగ్​ డ్రైవ్​ కోసమే టాటా మోటార్స్​ నుంచి ఒక ఎలక్ట్రిక్​ కారు వచ్చింది. దీని పేరు టాటా కర్వ్​ ఈవీ. ఇదొక కూపే ఎస్​యూవీ. సింగిల్​ ఛార్జ్​తో 585కి.మీ వరకు రేంజ్​ని ఈ కారు ఇస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో టాటా కర్వ్​ ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హైదరాబాద్​లో టాటా కర్వ్​ ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​..

టాటా కర్వ్​ ఈవీ క్రియేటివ్ 45 కేడబ్ల్యూ​- రూ. 18,39,925

టాటా కర్వ్​ ఈవీ అకంప్లీష్​డ్ 45 కేడబ్ల్యూ​- రూ. 19.45 లక్షలు

టాటా కర్వ్​ ఈవీ అకంప్లీష్​డ్​ 55 - రూ. 20.24 లక్షలు

టాటా కర్వ్​ ఈవీ అకంప్లీష్​డ్​ ప్లస్​ ఎస్​ 45- రూ. 20.28 లక్షలు

టాటా కర్వ్​ ఈవీ అకంప్లీషీడ్​ ప్లస్​ ఎస్​ 55- రూ. 21.01 లక్షలు

టాటా కర్వ్​ ఈవీ ఎంపవర్డ్​ ప్లస్​ 55- రూ. 22.33 లక్షలు

ఎంపవర్డ్​ ప్లస్​ ఏ 55- రూ. 23.11 లక్షలు.

అంటే హైదరాబాద్​లో టాటా కర్వ్​ ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ ధర రూ. 18.3 లక్షల నుంచి రూ. 23.11 లక్షల వరకు ఉంటుంది.

సాధారణంగా వెహికల్​కి ఎక్స్​షోరూం ప్రైజ్​, ఆన్​రోడ్​ ప్రైజ్​లు వేరువేరుగా ఉంటాయి. వెహికిల్​ని లాంచ్​ చేసే సమయంలో ఆటోమొబైల్​ సంస్థలు ఎక్స్​షోరూం ధరలను మాత్రమే చెబుతాయి. కాగా ఆన్​రోడ్​ ప్రైజ్​ అనేది వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్​లు వేరువేరుగా ఉండటంతో మారుతుంటూ ఉంటుది. అందుకే కస్టమర్లు వెహికిల్​ని కొనే ముందు, ఎక్స్​షోరూం ప్రైజ్​ కాకుండా ఆన్​రోడ్​ ప్రైజ్​ తెలుసుకుని బడ్జెట్​ వేసుకోవాలి. సమీప డీలర్​షిప్​ షోరూమ్స్​ని సందర్శిస్తే.. ఆ సమయంలో వెహికిల్​పై ఏవైనా ఆఫర్స్​ ఉన్నాయా? అనేది కూడా తెలుస్తుంది. అది ఖర్చు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

టాటా కర్వ్​ ఈవీ బ్యాటరీ- రేంజ్​ వివరాలు..

టాటా కర్వ్ ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్​ ఉన్నాయి. అవి.. 45 కిలోవాట్, 55 కిలోవాట్ల బ్యాటరీ. రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు 165 బీహెచ్​పీ పవర్​ని జనరేట్​ చేసే ఎలక్ట్రిక్ మోటార్​తో కనెక్ట్​ చేసి ఉంటాయి. 55 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ అమర్చిన కర్వ్ ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 585 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్​ని అందిస్తుంది. 45 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఫుల్ ఛార్జ్ చేస్తే 425 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. కర్వ్ ఈవీ 15 నిమిషాల్లో 150 కిలోమీటర్లను కవర్ చేయగలదని టాటా మోటార్స్ పేర్కొంది. R ఈవీ కేవలం 8.6 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

తదుపరి వ్యాసం