Camikara Rum । చెరుకు రసంతో రమ్.. దీని రుచి ఎంతో మధురం!
20 October 2022, 16:03 IST
- Camikara Rum: చెరుకు రసంతో పంచదార తయారు చేసే కంపెనీ, అనుకోకుండా రమ్ తయారు చేసింది. దాని రంగు, రుచి, చిక్కదనం ఇంకా ధర ఎలా ఉందో ఇక్కడ చూడండి.
Camikara Rum
పికాడిలీ డిస్టిలరీస్ Camikara అనే రమ్ రకాన్ని తయారు చేసింది. ఇది అట్టాంటి, ఇట్టాంటి రమ్ కాదు. స్వచ్ఛమైన చెరుకు రసంతో తయారు చేసిన రమ్. అమెరికా ఓక్ పీపాలో 12 ఏళ్లుగా పరిపక్వం చేసిన అరుదైన రకం రమ్. చెరుకు రసంతో భారతదేశం నుంచి అభివృద్ధి చేసిన మొట్టమొదటి రమ్ రకం ఇదే కావడం విశేషం. అందుకే దీనికి చామీకర (Camikara) అనే పేరు పెట్టారు. చామీకర అంటే సంస్కృతంలో బంగారం అనే అర్థం వస్తుంది.
Camikara Rum ను 50% ABVతో బాటిలింగ్ చేస్తున్నారు. తమ ద్రవరూప బంగారాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో విడుదల చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. ఇప్పటికే అమెరికా నుంచి ముందస్తు బుకింగ్స్ రావడం వలన, ఆ దేశానికి 1200 Camikara బాటిళ్లు, UKకు 400 బాటిళ్లు ఎగుమతి చేస్తుండగా, ఇతర ప్రపంచ దేశాలకు మొత్తంగా 1600 బాటిళ్లు ఎగుమతి చేయనున్నట్లు పికాడిలీ డిస్టిలరీస్ తెలిపింది.
భారతదేశంలో కేవలం 400 బాటిళ్లను విక్రయించనుంది. ఇండియాలో ఒక్కో బాటిల్ Camikara Rum ధర, రూ. 6,200/- కు రిటైల్ చేయాలని కంపెనీ భావిస్తోంది. మరి, ఇంత తక్కువ మొత్తంలో ఉత్పత్తి ఉన్నప్పుడు, ఈ బాటిల్ వినియోగదారుడి చేతికి వచ్చినపుడు ఎంత ధర చెల్లించాల్సి రావచ్చో ఊహించలేం.
12 Years Aged Camikara Rum- 12 ఏళ్ల ద్రవరూప బంగారం
పికాడిలీ అగ్రో సర్వీసెస్ కంపెనీ సాధారంగా పంచదార, దాని ఉప ఉత్పత్తులను తయారుచేస్తుంది. ఇదేక్రమంలో 2009లో పంజాబ్‌లోని పాటియాలాలోని ఒక గ్రామం నుండి చెరుకుని స్వీకరించింది. ఆపై చెరుకు రసాన్ని తీసి ఓక్ బారెల్స్‌లో నిల్వచేసింది. దాదాపు 12 సంవత్సరాల ఇప్పుడు ఈ బారెల్స్‌ను ఖాళీ చేయగా చూస్తే, అసలు చెరుకు రసంలో 6.6% మాత్రమే మిగిలి ఉన్నట్లు కంపెనీ గుర్తించింది. దీంతో కంపెనీ ఆ మిగిలిన 12 ఏళ్ల నాటి చెరుకు రసంతో Camikara Rum తయారు చేసింది.
ఈ రమ్ సృష్టించిన తర్వాత కంపెనీ ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది.. “మేము అనుకోకుండా ఇలాంటి రమ్‌ను ఒకటి సృష్టిస్తామని ఎప్పుడూ ఊహించలేదు. ఈ ప్రాంతంలోని స్థానికుల నుంచి మాకు ఇలా చేయాలనే ప్రేరణ కలిగింది, ఇక్కడ వారు లాహన్ అనే స్థానిక సారాను తయారు చేసేందుకు చెరకు రసాన్ని స్వేదన చేస్తారు. మేము అది చూసి అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించాం" అని పేర్కొంది.
మొత్తానికి పంచదార చేసే కంపెనీ రమ్ తయారు చేసింది. మరి ఈ రమ్ ఎలా ఉంటుందో రుచి చూస్తే గానీ తెలియదు.
టాపిక్