తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Byd Seal Ev : ఇండియాలో బీవైడీ సీల్​ ఈవీ లాంచ్​.. 650 కి.మీ రేంజ్​- ధర చూస్తే షాక్​!

BYD Seal EV : ఇండియాలో బీవైడీ సీల్​ ఈవీ లాంచ్​.. 650 కి.మీ రేంజ్​- ధర చూస్తే షాక్​!

Sharath Chitturi HT Telugu

05 March 2024, 13:41 IST

    • BYD Seal EV launch date in India : బీవైడీ సీల్​ ఈవీ.. ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ ఫీచర్స్​, రేంజ్​, ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
650కి.మీ రేంజ్​తో బీవైడీ సీల్​ ఈవీ లాంచ్​..
650కి.మీ రేంజ్​తో బీవైడీ సీల్​ ఈవీ లాంచ్​..

650కి.మీ రేంజ్​తో బీవైడీ సీల్​ ఈవీ లాంచ్​..

BYD Seal EV price in India : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోకి మరో లగ్జరీ ఎలక్ట్రిక్​ వెహికిల్​ ఎంట్రీ ఇచ్చింది. చైనాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ బీవైడీ.. ఇండియాలో సీల్​ ఈవీని లాంచ్​ చేసింది. ఇదొక లగ్జరీ సెడాన్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​. 2023లో జరిగిన ఆటో ఎక్స్​పోలో తొలిసారిగా ఈ బీవైడీ సీల్​ ఎలక్ట్రిక్​ కారును ప్రదర్శించిన సంస్థ.. ఎట్టకేలకు ఇండియాలో దీనిని లాంచ్​ చేసింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ఫీచర్స్​, రేంజ్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

బీవైడీ సీల్​ ఈవీ ఫీచర్స్​..

బీవైడీ సీల్​ ఎలక్ట్రిక్​ కారులో క్రిస్టల్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, బూమరాంగ్​ షేప్​లో ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​, ఫుల్​ విడ్త్​ ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​ వంటివి వస్తున్నాయి.

ఇక ఈ లగ్జరీ ఎలక్ట్రిక్​ వెహికిల్​ కేబిన్​లో సాఫ్ట్​ టచ్​ మెటీరియల్స్​ని వాడారు. 15.6 ఇంచ్​ రొటేటింగ్​ టచ్​స్క్రీన్​ ఇన్పోటైన్​మెంట్​ సిస్టెమ్​, హెడ్​-ఆప్​ డిస్​ప్లే, 10.25 ఇంచ్​ డిజిటల్​ డ్రైవర్​ డిస్​ప్ల, 2 వయర్​లెస్​ ఛార్జింగ్​ పాడ్స్​ వంటివి లభిస్తున్నాయి.

ఇండియాలో లాంచ్​ అయిన బీవైడీ సీల్​ ఈవీ పొడవు 4,800ఎంఎం. వెడల్పు 1,857ఎంఎం. ఎతతు 1,460ఎంఎం.

బీవైడీ సంస్థ.. కొత్త కారులో సేఫ్టీకి పెద్ద పీట వేసినట్టు కనిపిస్తోంది. యూరో ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లలో దీనికి 5స్టార్​ రేటింగ్స్​ లభించాయి. అడల్ట్​ ఆక్యుపెంట్స్​లో 89శాతం, చైల్డ్​ ఆక్యుపెంట్స్​ ప్రొటెక్షన్​లో 87శాతం, వల్నరెబులిటీ రోడ్​ యూజర్స్​ సెగ్మెంట్​లో 82శాతం, సేఫ్టీ అసిస్ట్​లో 76శాతం స్కోర్​ని సంపాదించుకుంది ఈ ఎలక్ట్రిక్​ కారు. ఈ లగ్జరీ ఈవీలో డ్యూయెల్​ ఫ్రెంట్​ ఎయిర్​బ్యాగ్స్​, సీట్​బెల్ట్​ రిమైండర్స్​, ఆటోనొమస్​ ఎమర్జెన్సీ బ్రేకింగ్​, లేన్​ అసిస్ట్​ సిస్టెమ్​, సైడ్​ ఎయిర్​బ్యాగ్స్​, సెంటర్​ ఎయిర్​బ్యాగ్​ వంటి ఫీచర్స్​ ఉన్నాయి. ఐఎస్​ఓఫిక్స్​ చైల్డ్​ సీట్​ మౌంట్స్​, ఎయిర్​బ్యాగ్​ కటాఫ్​ స్విచ్​, డిస్ట్రాక్షన్​ డిటెక్షన్​ వంటి ఫీచర్స్​ కూడా ఈ కారులో అందుబాటులో ఉన్నాయి.

బీవైడీ సీల్​ ఈవీ- రేంజ్​, ధర వివరాలు..

BYD Seal EV price : ఈ బీవైడీ సీల్​ ఈవీలో మూడు వేరియంట్లు ఉంటాయి. వీటిల్లో 6.14 కేడబ్ల్యూహెచ్​, 82.5 కేడబ్ల్యూహెచ్​ భారీ బ్యాటకీ ప్యాక్స్​ ఉంటాయి. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. ఈ కారులో 650 కన్నా ఎక్కువ కి.మీలు తిరగొచ్చని సంస్థ చెబుతోంది. ఈ లగ్జరీ సెడాన్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​లో రేర్​తో పాటు ఆల్​ వీల్​ డ్రైవ్​ సెటప్​ ఉంది. 0-100 కేఎంపీహెచ్​ స్పీడ్​ని 3.8 సెకన్లలో అందుకోగలుగుతుంది!

ఇక ఈ బీవైడీ సీల్ సెడాన్​​ ఈవీ డైనమిక్​ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 41లక్షలుగా ఉంది. ప్రీమియం వర్షెన్​ ఎక్స్​షోరూం ధర రూ. 45.5లక్షలుగాను, టాప్​ ఎండ్​ మోడల్​ పర్ఫార్మెన్స్​ ఎక్స్​షోరూం ధర రూ. 53లక్షలుగాను ఉంది.

ఇండియాలో బీవైడీ వెహికిల్స్​కి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ముఖ్యంగా.. బీవైడీ అట్టో 3 బాగా క్లిక్​ అయ్యింది. ఇక ఇప్పుడు.. సీల్​ సెడాన్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​ కూడా కస్టమర్లను ఆకట్టుకుంటుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ఇక.. ఈ బీవైడీ సీల్​ ఈవీ బుకింగ్స్​ ఇప్పటికే మొదలయ్యాయి. త్వరలోనే.. డెలివరీలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది.

తదుపరి వ్యాసం