India's safest SUVs : 5 స్టార్​ సేఫ్టీ రేటింగ్​ ఉన్న బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీలు ఇవే..-automobile news list of indias safest suvs with five star safety rating ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  India's Safest Suvs : 5 స్టార్​ సేఫ్టీ రేటింగ్​ ఉన్న బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీలు ఇవే..

India's safest SUVs : 5 స్టార్​ సేఫ్టీ రేటింగ్​ ఉన్న బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీలు ఇవే..

Sharath Chitturi HT Telugu
Feb 16, 2024 09:03 AM IST

SUV's with 5 star safety rating in India : 5 స్టార్​ సేఫ్టీ రేటింగ్​ ఉన్న ఎస్​యూవీని కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! సేఫ్టీలో బెస్ట్​గా ఉన్న ఎస్​యూవీల లిస్ట్​ని ఇక్కడ చూడండి..

5 స్టార్​ సేఫ్టీ రేటింగ్​ ఉన్న బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీలు ఇవే..
5 స్టార్​ సేఫ్టీ రేటింగ్​ ఉన్న బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీలు ఇవే..

Best selling SUV's in India : ఇండియాలో ఎస్​యూవీ సెగ్మెంట్​కు సూపర్​ డిమాండ్​ కనిపిస్తోంది. అదే సమయంలో కస్టమర్లు.. సేఫ్టీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. వీరిలో మీరూ ఉన్నారా? 5 స్టార్​ సేఫ్టీ రేటింగ్​ ఉన్న బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీని కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! గత రెండేళ్లల్లో జరిగిన గ్లోబల్​​ ఎన్​సీఏపీ, భారత్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో.. 5 స్టార్​ రేటింగ్స్​​ సంపాదించుకున్న ఎస్​యూవీల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

5 స్టార్​ సేఫ్టీ కలిగిన ఎస్​యూవీలు ఇవే..

Tata Nexon safety rating : టాటా నెక్సాన్​:- సేఫ్టీకి పెట్టింది పేరు టాటా మోటార్స్​! ఇక టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​ గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​ ఇటీవలే జరిగింది. ఈ క్రాష్​ టెస్ట్​లో ఈ ఎస్​యూవీకి 5 స్టార్​ రేటింగ్​ లభించింది. అడల్ట్​ ప్రొటెక్షన్​లో 34 పాయింట్లకు గాను 32.22 పాయింట్లు సంపాదించుకుంది. చైల్డ్​ ప్రొటెక్షన్​లో 49 పాయింట్లకు 44.52 పాయింట్లు పొందింది. ఈ టాటా నెక్సాన్​ ఎస్​యూవీలో 6 ఎయిర్​బ్యాగ్స్​, ఎలక్ట్రానిక్​ స్టెబులిటీ ప్రొగ్రాన్​, ఐఎస్​ఓఎఫ్​ఐఎక్స్​ మౌంట్స్​, రేర్​ పార్కింగ్​ సెన్సార్​, టిల్ట్​ అండ్​ కొలాప్సిబుల్​ స్టీరింగ్​, సెంటర్​ లాకింగ్, హిల్​ హోల్డ్​ కంట్రోల్​ వంటి సేఫ్టీ ఫీచర్స్​ ఉన్నాయి.

టాటా హారియర్​:- టాటా హారియర్​ ఫేస్​లిఫ్ట్​ని గతేడాది లాంచ్​ చేసింది టాటా మోటార్స్​. భారత్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో ఈ ఎస్​యూవీకి 5 స్టార్​ రేటింగ్​ లభించింది. ఇందులో 6 ఎయిర్​బ్యాగ్స్​ స్టాండర్డ్​గా వస్తున్నాయి. అడాస్​ టెక్నాలజీ ఇందులో ఉంటుంది. అడల్ట్​ ప్రొటెక్షన్​లో 34 పాయింట్లకు గాను 33.05 పాయింట్లు సంపాదించుకుంది ఈ టాటా హారియర్​ ఎస్​యూవీ. చైల్డ్​ ప్రొటెక్షన్​లో 49 పాయింట్లకు 45 పాయింట్లు వచ్చాయి. ఈ ఎస్​యూవీ ఓవరాల్​ సేఫ్టీ 78.05 పాయింట్లు.

టాటా సఫారీ:- టాటా హారియర్​ ఫేస్​లిఫ్ట్​తో పాటు గతేడాది టాటా సఫారీ ఫేస్​లిఫ్ట్​ని కూడా లాంచ్​ చేసింది టాటా మోటార్స్​. దీనిపైనా భారత్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​ జరిగింది. సఫారీకి కూడా దాదాపు హారియర్​కు లభించిన పాయింట్సే దక్కాయి. ఈ 3 రో ఎస్​యూవీలో ఏపీఎస్​ విత్​ ఈబీడీ, ఈఎస్​పీ, టైర్​ ప్రెజర్​ మానిటరింగ్​ సిస్టెమ్​, క్రూజ్​ కంట్రోల్​, డ్రైవర్​ అటెన్షన్​ అలర్ట్​, హిల్​ డిసెంట్​ కంట్రోల్​, ఎమర్జెన్సీ కాల్​ అండ్​ బ్రేక్​డౌన్​ అలర్ట్​ వంటి సేఫ్టీ ఫీచర్స్​ ఉన్నాయి.

Tata punch on road price in Hyderabad : టాటా పంచ్​:- టాటాకు చెందిన చిన్న ఎస్​యూవీ టాటా పంచ్​ కూడా.. సేఫ్టీ విషయంలో టాప్​లో ఉంటుంది. గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో 5 స్టార్​ రేటింగ్​ సంపాదించుకుంది. అంతేకాకుండా.. ఈ పంచ్​ సేఫ్టీ రేటింగ్స్​.. భారీ ఎస్​యూవీ అయిన ఎక్స్​యూవీ700ని పోలి ఉండటం విశేషం. ఇక టాటా పంచ్​ ఓవరాల్​ సేఫ్టీ పాయింట్సు 57.34గా ఉంది.

వోక్స్​వ్యాగన్​ టైగన్​:- ఇండియాలోని సేఫెస్ట్​ ఎస్​యూవీల్లో వోక్స్​వ్యాగన్​ టైగన్​ ఒకటి. గ్లోబల్​ ఎన్​సీఏపీలో దీనికి 5 స్టార్​ రేటింగ్​ వచ్చింది. ఓవరాల్​ సేఫ్టీ స్కోర్​ 71.64 పాయింట్లుగా ఉంది.

స్కోడా కుషాక్​:- గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో.. స్కోడా కాంపాక్ట్​ ఎస్​యూవీ కుషాక్​కి కూడా 5 స్టార్​ రేటింగ్​ దక్కింది.

Mahindra Scorpio N on road price : మహీంద్రా స్కార్పియో-ఎన్​:- మహీంద్రా అండ్​ మహీంద్రాకు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉన్న స్కార్పియో ఎన్​కు 58.18 పాయింట్లు దక్కాయి. అడల్ట్​ ప్రొటెక్షన్​లో 5 స్టార్​ రేటింగ్​ 5 స్వచ్చింది. కానీ చైల్డ్​ ప్రొటెక్షన్​లో 3 స్టార్​ రేటింగ్​ మాత్రమే సంపాదించుకోగలిగింది.

వీటితో పాటు మహీంద్రా ఎక్స్​యూవీ700, మహీంద్రా ఎక్స్​యూవీ300కి కూడా గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో 5 స్టార్​ రేటింగ్​ వచ్చాయి.

సంబంధిత కథనం