Tata Punch on road price in Hyderabad : హైదరాబాద్‌లో టాటా పంచ్ ఆన్‌రోడ్ ప్రైజ్ ఎంతంటే..
Tata Punch price in Hyderabad : టాటా పంచ్ ఎస్‌యూవీని కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే.. హైదరాబాద్‌లో ఈ టాటా పంచ్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Tata Punch on road price Hyderabad : ఇండియాలో ఎస్‌యూవీలకు డిమాండ్ అంతా ఇంతా లేదు. ఇక టాటా మోటార్స్‌కు చెందిన టాటా పంచ్ ఎస్యూవీ.. బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా కొనసాగుతోంది. 2024 జనవరి సేల్స్‌లో టాప్ 10 ఎస్‌యూవీల్లో మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. టాటా నెక్సాన్ని వెనక్కి నెట్టి.. ఫస్ట్ ప్లేస్‌ని దక్కించుకుంది. జనవరిలో టాటా పంచ్ ఎస్‌యూవీకి చెందిన 17,978 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2023 జనవరితో పోల్చుకుంటే ఇది 50శాతం ఎక్కువ. ఈ చిన్న ఎస్‌యూవీకి క్రేజ్ ఏ రేంజ్లో ఉందో దీని బట్టి చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మీరు కొత్త కారు కొనాలని చూస్తున్నారా? హైదరాబాద్‌లో టాటా పంచ్ ఎస్యూవీ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హైదరాబాద్‌లో టాటా పంచ్ ఆన్‌రోడ్ ప్రైజ్..
టాటా పంచ్ ప్యూర్- రూ. 7,18,718
ప్యూర్ రిథమ్- రూ. 7.60 లక్షలు
అడ్వెంచర్- రూ .8.25 లక్షలు
కామో అడ్వెంచర్- రూ. 8.36 లక్షలు
Tata Punch price in Hyderabad : ప్యూర్ సీఎన్జీ- రూ. 848 లక్షలు
అడ్వెంచర్ రిథమ్- రూ. 8.66 లక్షలు
కామో అడ్వెంచర్ రిథమ్- రూ. 8.78 లక్షలు
కామో అడ్వెంచర్ ఏఎంటీ- రూ. 9.07 లక్షలు
కామో అకంప్లీష్డ్- రూ. 9.31 లక్షలు
అడ్వెంచర్ ఏఎంటీ రిథమ్- రూ. 9.36 లక్షలు
అడ్వెంచర్ సీఎన్జీ- రూ. 9.36 లక్షలు
కామో అడ్వెంచర్ ఏఎంటీ రిథమ్- రూ. 9.48 లక్షలు
కామో అంకప్లీష్డ్ డాజిల్- రూ. 9.75 లక్షలు
అడ్వెంచర్ రిథమ్ సీఎన్జీ- రూ. 9.78 లక్షలు
అకంప్లీష్డ్- రూ. 9.83 లక్షలు
అకంప్లీష్డ్ ఎస్- రూ. 9.83 లక్షలు
Tata Punch on road price : కామో అంకప్లీష్డ్ ఏఎంటీ- రూ. 10.01 లక్షలు
అకంప్లీష్డ్ డాజిల్- రూ. 10.31 లక్షలు
అకంప్లీష్డ్ డాజిల్ ఎస్- రూ. 10.31 లక్షలు
కామో అకంప్లీష్డ్ ఏఎంటీ డాజిల్- రూ. 10.46 లక్షలు
అకంప్లీష్డ్ ఏఎంటీ- రూ. 10.54 లక్షలు
అకంప్లీష్డ్ ఎస్ ఏఎంటీ- రూ. 10.54 లక్షలు
అకంప్లీష్డ్ సీఎన్జీ- రూ. 10.54 లక్షలు
క్రియేటివ్ డీటీ- రూ. 10.95 లక్షలు
క్రియేటివ్ డీటీ ఎస్- రూ. 10.95 లక్షలు
Tata Punch SUV : అకంప్లీష్డ్ ఏఎంటీ డాజిల్- రూ. 11.01 లక్షలు
అకంప్లీష్డ్ డాజిల్ ఎస్ ఏంటీ- రూ. 11.01 లక్షలు
క్రియేటివ్ ఏఎంటీ డీటీ- రూ. 11.13 లక్షలు
క్రియేటివ్ ఫ్లాగ్షిప్ డీటీ- రూ. 11.31 లక్షలు
అకంప్లీష్డ్ డాజిల్ ఎస్ సీఎన్జీ- రూ. 11.52 లక్షలు
క్రియేటివ్ ఎస్ ఏఎంటీ డీటీ- రూ. 11.66 లక్షలు
క్రియేటివ్ ఫ్లాగ్షిప్ ఏఎంటీ డీటీ- రూ. 12.42 లక్షలు
Tata Punch on road price : సీఎన్జీ అని చెప్పినవి మినహాయిస్తే.. మిగిలినవి అన్ని పెట్రోల్ వేరియంట్లే. టాటా పంచ్ ఎస్‌యూవీలో డీజిల్ వేరియంట్లు ఏవీ లేవు. పూర్తి వివరాల కోసం మీరు మీ సమీప డీలర్షిప్ షోరూమ్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
సాధారణంగా.. ఏ వెహికిల్‌ని లాంచ్ చేసినా.. ఆటోమొబైల్ సంస్థలు ఎక్స్‌షోరూం ధరలను మాత్రమే చెబుతాయి. కానీ రోడ్డు మీదకు వచ్చేసరికి రేటు ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్‌లు వేరువేరుగా ఉండటమే ఇందుకు కారణం. హైదరాబాద్‌లో ఉన్న రేటు, ముంబైలో ఉండదు. ముంబైలో ఉన్న రేటు బెంగళూరులో ఉండదు. అందుకే.. ఏదైనా కారు కొనే ముందు దాని ఎక్స్‌షోరూం ధరతో పాటు ఆన్‌రోడ్ ప్రైజ్‌ని కూడా తెలుసుకోవడం చాలా అవసరం. అందుకు తగ్గట్టుగానే ప్లాన్ చేసుకోవాలి.
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్..
Tata Punch EV on road price : టాటా పంచ్ ఈవీని ఇటీవలే లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్. దీనికి మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఇక.. త్వరలోనే టాటా పంచ్ ఎస్‌యూవీకి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ కూడా రాబోతోందని టాక్ నడుస్తోంది. ఈ ఏడాది చివర్లో లేదా 2025లో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ అవుతుందని సమాచారం.
టాటా పంచ్ ఈవీని.. 2021 అక్టోబర్‌లో లాంచ్ చేసింది టాటా మోటార్స్. అప్పటి నుంచి సేల్స్ పరంగా ఈ ఎస్యూవీ దూసుకెళుతోంది. ఇప్పటికే 3లక్షల సేల్స్ మైలురాయిని దాటేసింది!
సంబంధిత కథనం