Tata Punch price hike : బెస్ట్ సెల్లింగ్ టాటా పంచ్ ధర పెంపు- ఎంతంటే..
Tata Punch price hike details : టాటా పంచ్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి అలర్ట్! పంచ్ ఎస్‌యూవీని ధరలను పెంచింది టాటా మోటార్స్ సంస్థ. ఆ వివరాలు..
Tata Punch on road price in Hyderabad : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా ఉన్న టాటా పంచ్ ధరను పెంచింది టాటా మోటార్స్. వేరియంట్ల బట్టి.. టాటా పంచ్‌పై గరిష్ఠంగా రూ. 17వేల వరకు హైక్ తీసుకుంది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
పెరిగిన టాటా పంచ్ ఎస్యూవీ ధరలు..
టాటా పంచ్‌లో నాలుగు వేరియంట్లు ఉన్నాయి. అవి.. ప్యూర్, అడ్వెంచర్, అకంప్లీష్డ్, క్రియేటివ్. ఎంట్రీ లేవల్ టాటా పంచ్ ప్యూర్ వేరియంట్ ధర రూ. 13వేలు పెరిగింది. ఫలితంగా.. టాటా మోటార్స్‌కి చెందిన టాటా పంచ్ ఎస్యూవీ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 6.13లక్షలకు చేరింది. ఇతర వేరియంట్ల ధరలు గరిష్ఠంగా రూ. 10వేల వరకు పెరిగాయి.
Tata Punch price hike details : టాటా పంచ్‌లో సీఎన్జీ మోడల్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా.. దాని ధర కూడా పెరిగింది. సీఎన్జీ మోడల్‌పై రూ. 17వేల వరకు ప్రైజ్ హైక్ తీసుకుంది టాటా మోటార్స్.
ధరల పెంపుతో.. టాటా పంచ్ ఎక్స్‌షోరూం ప్రైజ్ వివరాలు తెలుసుకోవాలనుకునే వారు అధికారిక వెబ్‌సైట్‌ని లేదా స్థానిక డీలర్షిప్ షోరూమ్‌ని సందర్శించాల్సి ఉంటుంది.
టాటా పంచ్ ఎస్యూవీ విశేషాలు..
Tata Punch price : ఈ టాటా పంచ్‌లో మస్క్యులర్ క్యాంప్షెల్ బానెట్ ఉంటుంది. ఇందులో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది.. 84 హెచ్‌పీ పవర్‌ని, 113 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. సీఎన్జీ మోడల్.. 72 హెచ్‌పీ పవర్‌ని, 103 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మేన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ కూడా ఇందులో ఉన్నాయి.
టాటా పంచ్‌లో ఈవీ వర్షెన్ కూడా ఉంది. గత నెలలోనే ఈ మోడల్ని సంస్థ లాంచ్ చేసింది.
Tata Punch EV price in Hyderabad : 2021 అక్టోబర్‌లో లాంచ్ అయ్యింది ఈ టాటా పంచ్. ఇటీవలే.. 3 లక్షల సేల్స్ మైలురాయిని తాకింది.
అంతేకాదు.. టాటా పంచ్‌కు ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని కూడా తీసుకురాబోతోంది టాటా మోటార్స్ సంస్థ. 2025లో ఈ వెహికిల్ లాంచ్ అవుతుందని సమాచారం.
తన పోర్ట్‌ఫోలియోలోని వెహికిల్స్‌ని 3ఏళ్లకోసారి అప్డేట్ చేస్తూ ఉంటుంది టాటా మోటార్స్. ఇందులో భాగంగానే.. టాటా నెక్సాన్, నెక్సాన్ ఈవీ, హారియర్, సఫారీ ఎస్‌యూవీలకు 2023లో ఫేస్‌లిఫ్ట్ వర్షెన్స్ వచ్చాయి. ఇక 2021లో లాంచ్ అయిన టాటా పంచ్‌కు 2024లో అప్డేటెడ్ వర్షెన్ రావాల్సి ఉంది. అయితే.. ఈ మోడల్.. 2025 రెండో భాగంలో మార్కెట్లోకి అడుగుపెడుతుందని టాక్ నడుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం