Budget 2024: త్వరలో 8వ పే కమిషన్; బడ్జెట్ 2024 లో ప్రకటించే అవకాశం
16 July 2024, 14:45 IST
సాధారణంగా ప్రతీ పది సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘం లేదా పే కమిషన్ ను ఏర్పాటు చేస్తారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2014 ఫిబ్రవరి 28న ఏడో వేతన సంఘాన్ని ఏర్పాటు చేయగా, అది 2015 నవంబర్ 19న తన నివేదికను సమర్పించింది. ఈ సిఫార్సులు 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఏడో వేతన సంఘం ఏర్పాటై పదేళ్లు గడిచిపోయాయి.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Budget 2024 proposals: జూలై 23 న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2024 లో 8వ వేతన సంఘం ఏర్పాటు చేయడం గురించి కీలక ప్రకటన వెలువడనుందా? అంటే అవుననే సమాధానం కేంద్ర ఆర్థిక శాఖ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఏడవ వేతనం సంఘం ఏర్పాటై పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో, 8 వ పే కమిషన్ ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉద్యోగ సంఘాల నంచి వినిపిస్తోంది. 7వ వేతన సంఘం 2014 లో నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఉద్యోగ సంఘాల డిమాండ్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23 న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2024 కు ముందు, 8 వ పే కమిషన్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ సెక్రటరీ జనరల్ ఎస్బీ యాదవ్ భారత ప్రభుత్వ కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. అలాగే, పాత పెన్షన్ పథకాన్ని (OPS) పునరుద్ధరించాలని, ఉద్యోగులు, పెన్షనర్లకు కోవిడ్ -19 మహమ్మారి సమయంలో స్తంభింపజేసిన 18 నెలల కరువు భత్యం, ఉపశమనం విడుదల చేయాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.
ఏడవ వేతన సంఘానికి పదేళ్లు పూర్తయ్యాయి
ద్రవ్యోల్బణం వంటి వేరియబుల్స్ ను పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ప్రయోజనాలను సమీక్షించడానికి, సిఫారసు చేయడానికి ప్రతి పదేళ్లకు ఒకసారి కేంద్ర వేతన కమిషన్లను ఏర్పాటు చేస్తారు. మన్మోహన్ సింగ్ 2014 ఫిబ్రవరి 28న ఏడో వేతన సంఘాన్ని ఏర్పాటు చేయగా, అది 2015 నవంబర్ 19న తన నివేదికను సమర్పించింది. ఈ సిఫార్సులు 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. పదేళ్ల పద్ధతిని అనుసరిస్తే 2026 జనవరి 1 నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి వస్తుందని, అయితే దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదన్నారు.
2024 కేంద్ర బడ్జెట్లో 8వ వేతన సంఘం ప్రకటన ఉంటుందా?
8వ పే కమిషన్ తక్షణమే ఏర్పాటు చేయాలని, కొత్త పెన్షన్ స్కీమ్ (NPS)ను రద్దు చేయాలని, ఉద్యోగులు, పెన్షనర్లకు కోవిడ్-19 మహమ్మారి సమయంలో స్తంభింపజేసిన 18 నెలల డీఏ/ డీఆర్ ను విడుదల చేయాలని, కారుణ్య నియామకాలపై 5 శాతం పరిమితిని తొలగించాలని, మరణించిన ఉద్యోగిపై ఆధారపడిన వారందరికీ కారుణ్య నియామకాలు చేపట్టాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య డిమాండ్ చేసింది.