CBN In Delhi: రెండో రోజు ఢిల్లీలో చంద్రబాబు, నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ చైర్మన్‌, సీఈఓలతో భేటీ-cbn second day in delhi meets nirmala seetaraman and neeti ayog chairman ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn In Delhi: రెండో రోజు ఢిల్లీలో చంద్రబాబు, నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ చైర్మన్‌, సీఈఓలతో భేటీ

CBN In Delhi: రెండో రోజు ఢిల్లీలో చంద్రబాబు, నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ చైర్మన్‌, సీఈఓలతో భేటీ

HT Telugu Desk HT Telugu
Jul 05, 2024 10:49 AM IST

CBN In Delhi: రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్న త‌రువాత తొలిసారి ముఖ్య‌మంత్రి హోదాలో చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ కొనసాగుతుంది.

నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన ఏపీ సిఎం చంద్రబాబు, మంత్రులు, ఎంపీలు
నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన ఏపీ సిఎం చంద్రబాబు, మంత్రులు, ఎంపీలు

CBN In Delhi: ఏపీ సిఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. శుక్రవారం ఉద‌యం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. అనంత‌రం రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై డిమాండ్ చేయనున్నారు‌.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి ఆర్థిక మద్ధతుపై విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు, అమ‌రావ‌తి నిర్మాణాల‌కు నిధులు, అప్పులకు అనుమ‌తుల స‌డ‌లింపు వంటి అంశాలు గురించి చ‌ర్చించారు. అలాగే వెనుకబ‌డిన ప్రాంతాల నిధులు విడుద‌ల చేయాల‌ని, అలాగే వివిధ ప‌థ‌కాలకు రావల్సిన పెండింగ్ నిధులు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కోరారు.

నేడు చంద్రబాబు ప‌ర్య‌ట‌న ఇలా…

శుక్ర‌వారం ఢిల్లీలో సీఎం చంద్రబాబు తొలిత ఉద‌యం 9 గంట‌ల‌కు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్ర‌మ‌ణ్యంను క‌లిశారు. ఆయ‌న‌తో ఉద‌యం 9 గంట‌ల నుంచి 9ః45 గంట‌ల వ‌ర‌కు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ర‌ద్దు చేస్తామ‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్న‌ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చర్చించ‌నున్నారు. ఆ త‌రువాత ఉద‌యం 10 గంట‌ల‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో భేటీ అయ్యారు. ఆమెతో అరగంట సేపు స‌మావేశం అయ్యారు. అనంతరం కేంద్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి జెపీ న‌డ్డాతో ఉద‌యం 10ః45 గంట‌ల నుంచి 11ః15 గంట‌ల వ‌ర‌కు అరగంట సేపు భేటీ అవుతారు. ఉద‌యం 11ః30 కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అవుతారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఉద‌యం 11ః30 నుంచి మ‌ధ్యాహ్నం 12ః15 గంట‌ల వ‌ర‌కు 45 నిమిషాల పాటు భేటీ అవుతారు.

అనంత‌రం అశోక రోడ్డు 50లో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ స‌హాయ మంత్రి రామ్‌దాస్ అథ్వాలే, వేదంతా చైర్మ‌న్ అనిల్ అగ‌ర్వాల్‌, ఎన్‌టీపీసీ సీఎండీ గుర్దీప్ సింగ్‌, నేష‌న‌ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఎఐ) చైర్మ‌న్ సంతోష్ యాద‌వ్‌ల‌తో వేర్వేరుగా మ‌ధ్యాహ్నం 12ః30 గంట‌ల నుంచి 1ః15 గంట‌ల వ‌ర‌కు 45 నిమిషాల పాటు స‌మావేశం అవుతారు.

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి 3 గంట‌ల వ‌ర‌కు డీజీ సీఐఐ చంద్ర‌జీత్ బెన‌ర్జీ, ఫిక్కీ ప్ర‌తినిధి బృందం ఫిక్కీ ఉపాధ్యక్షుడు అనంత్ గోయింక‌, ఫిక్కీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ జ్వోతి విజ్‌తో పాటు ఐదు, ఆరుగురు ఇండ‌స్ట్రీ లీడ‌ర్లుతో స‌మావేశం అవుతారు. అలాగే సెయిల్ డైరెక్ట‌ర్ సుఖ్‌బీర్ సింగ్‌, యూఎస్‌-ఇండియా స్ట్రేట‌జీ పార్ట‌న‌ర్‌షిప్ ఫోరం అధ్యక్షుడు ముకేష్ అఘీతో వేర్వేరేగా స‌మావేశం అవుతారు.

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు గంట పాటు విలేక‌రుల స‌మావేశంలో చంద్ర‌బాబు పాల్గొని ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ గురించి వివ‌రిస్తారు. అనంత‌రం సాయంత్రం 5 గంట‌ల నుండి 5ః30 గంట‌ల వ‌ర‌కు జ‌ప‌నీస్ దౌత్య‌వేత్త సుజుకీ హిరోషీతో స‌మావేశం అవుతారు. అనంత‌రం ఢిల్లీ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు బ‌య‌లుదేరుతారు.

తొలి రోజు (గురువారం) ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, ఆరుగురు కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గ‌డ్క‌రీ, పియూష్ గోయ‌ల్‌, హ‌ర్దీప్ సింగ్ పూరి, శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌, మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌, 16వ ఆర్థిక సంఘం చైర్మెన్ అర‌వింద్ ప‌న‌గారియా కలిసి రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక మద్దతు కోసం వినతులందించారు. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రావాల్సిన పెండింగ్ నిధులు, విభ‌జ‌న చ‌ట్టం అమ‌లుపై నివేదించారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షాను గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంట‌ర్ వ్య‌యం రూ.385 కోట్లు, నిర్వ‌హ‌ణ వ్యయం 27.54 కోట్లు విడుద‌ల చేయాల‌ని కోరారు. విభ‌జ‌న చ‌ట్టంలోని ఆస్తుల పంప‌కం చేయాల‌ని, విభ‌జ‌న చ‌ట్టంలోని ప‌దో షెడ్యూల్లోని సెక్ష‌న్ 47, సెక్ష‌న్ 76లోని ఆస్తుల విభ‌జ‌న చేయాల‌ని కోరారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బ‌కాయిలు ఇప్పించాల‌ని కోరారు. ఏపికి ఐపీఎస్ అధికారుల సంఖ్య‌ను 79 నుంచి 117కి పెంచాల‌ని సీఎం చంద్రబాబు విజ్ఞ‌ప్తి చేశారు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner