తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bsnl Recharge Plans: బీఎస్ఎన్ఎల్ నుంచి ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో మరో చౌకైన రీచార్జ్ ప్లాన్

BSNL recharge Plans: బీఎస్ఎన్ఎల్ నుంచి ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో మరో చౌకైన రీచార్జ్ ప్లాన్

Sudarshan V HT Telugu

28 September 2024, 18:46 IST

google News
  • BSNL recharge Plans: ఇటీవల దూకుడు పెంచిన ప్రభుత్వ రంగ టెలీకాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్తగా మరో చౌకైన మొబైల్ రీచార్జ్ ప్లాన్ ను తీసుకువచ్చింది. ఇటీవల రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్లాన్‌లు ఖరీదైనవిగా మారాయి. దాంతో, చాలా మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు.

 బీఎస్ఎన్ఎల్ ప్రి పెయిడ్ ప్లాన్
బీఎస్ఎన్ఎల్ ప్రి పెయిడ్ ప్లాన్ (HT_Photo)

బీఎస్ఎన్ఎల్ ప్రి పెయిడ్ ప్లాన్

BSNL recharge Plans: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్లాన్‌లు ఖరీదైనవిగా మారినప్పటి నుండి, చాలా మంది ప్రజలు బీఎస్ఎన్ఎల్ (BSNL) వైపు మొగ్గు చూపుతున్నారు. మీరు కూడా ఖరీదైన రీఛార్జ్‌ల పట్ల అసంతృప్తిగా ఉంటే, తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీతో పాటు డేటాను అందించే ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, మీ కోసం బీఎస్ఎన్ఎల్ లో మంచి ప్లాన్ అందుబాటులో ఉంది.

బీఎస్ఎన్ఎల్ 180 రోజుల ప్లాన్, 90 జీబీ డేటా

ప్రభుత్వ రంగ టెలీకాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) 180 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్రి పెయిడ్ మొబైల్ రీచార్జ్ ప్లాన్ ను తీసుకువచ్చింది. దీని ధర రూ. 897. ఈ ప్లాన్ తో కస్టమర్‌లు ఇంటర్నెట్ వినియోగం కోసం అపరిమిత ఉచిత డేటాను పొందుతారు. ఈ బీఎస్ఎన్ఎల్ ప్రి పెయిడ్ ప్లాన్‌లో మొత్తం 90GB డేటాను కస్టమర్లకు అందిస్తారు. అంటే, మీ డేటా (data) వినియోగంలో రోజువారీ లిమిట్ ఉండదు. మొత్తం 180 రోజుల్లో 90 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు.అంటే, మీ అవసరాలకు అనుగుణంగా డేటాను ఉపయోగించవచ్చు.

ఇతర ప్రయోజనాలు

90 జీబీని వినియోగించిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40 Kbps కు తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. అలాగే, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లను ఉచితంగా పంపించవచ్చు. రూ. 897 కు లభించే ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ ఎక్కువ వ్యాలిడిటీ అవసరం అయిన వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

300 రోజుల వ్యాలిడిటీ కోసం..

బీఎస్ఎన్ఎల్ లో మరో ప్రి పెయిడ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్రి పెయిడ్ ప్లాన్ కు 300 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. దీని ధర రూ. 797. ఇందులో కస్టమర్‌లు 300 రోజుల వాలిడిటీతో పాటు ఉచిత వాయిస్-కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. ఈ ప్లాన్ ప్రతిరోజూ 2 జీబీ డేటాను అందిస్తుంది. ప్రతిరోజూ 100 ఉచిత SMS సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

తదుపరి వ్యాసం