'ముస్లిం డెలివరీ బాయ్ వద్దు'..తినే తిండికి మతం రంగు.. స్విగ్గీకి కస్టమర్‌ మెసేజ్-dont want muslim shocking bigotry by hyderabad swiggy customer triggers outrage ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  'ముస్లిం డెలివరీ బాయ్ వద్దు'..తినే తిండికి మతం రంగు.. స్విగ్గీకి కస్టమర్‌ మెసేజ్

'ముస్లిం డెలివరీ బాయ్ వద్దు'..తినే తిండికి మతం రంగు.. స్విగ్గీకి కస్టమర్‌ మెసేజ్

Sep 01, 2022 09:11 PM IST HT Telugu Desk
Sep 01, 2022 09:11 PM IST

ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీకి హైదరాబాద్ కస్టమర్ షాకింగ్ రిక్వెస్ట్ చేశాడు. 'ముస్లిం డెలివరీ వ్యక్తి వద్దు' అంటూ కస్టమర్ యాప్‌లో ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్ బాక్స్‌లో రాశాడు. తెలంగాణ రాష్ట్ర టాక్సీ అండ్ డ్రైవర్స్ జేఏసీ చైర్మన్ షేక్ సలావుద్దీన్ స్విగ్గీ ఆర్డర్ స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ కస్టమర్ సందేశం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కూడా ఈ 'షాకింగ్ ఇన్‌స్ట్రక్షన్'పై స్పందిస్తూ, స్విగ్గీ మతం పేరుతో ఇలాంటి కఠోరమైన మూర్ఖత్వాన్ని చూస్తూ కూర్చోలేరని అన్నారు. ప్రముఖ హిందూ కార్యకర్త రాహుల్ ఈశ్వర్ కస్టమర్‌ను బ్లాక్‌లిస్ట్ చేయమని స్విగ్గీని అభ్యర్థించారు. మరింత తెలుసుకోవడానికి ఈ వీడియోను చూడండి.

More