వినాయక చవితి పండుగ సీజన్ కోసం రూపొందించిన మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ఎయిర్ టెల్ ఆవిష్కరించింది. ఇవి పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్లతో పలు ఓటీటీ స్ట్రీమింగ్ సేవలను పొందవచ్చు. కొత్త ఆఫర్ల ప్రత్యేకతలు ఇవే..
ఎయిర్ టెల్ తో పాటు రిలయన్స్ జియో కూడా తన సొంత ఫెస్టివల్ (FESTIVAL) రీఛార్జ్ ప్లాన్లను లాంచ్ చేసింది. రూ.899, రూ.999, రూ.3,599 అనే మూడు డినామినేషన్లలో ఈ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ జియో (jio) ప్లాన్లు అదనపు ప్రయోజనాల శ్రేణితో వస్తాయి. 10 ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ సబ్స్క్రిప్షన్ బండిల్, రూ.175 విలువైన 10 జీబీ డేటా వోచర్ 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తాయి. అదనంగా, వినియోగదారులు మూడు నెలల ఉచిత జొమాటో (zomato) గోల్డ్ సబ్స్క్రిప్షన్ పొందుతారు. వివిధ రెస్టారెంట్లలో డిస్కౌంట్ కూపన్స్ పొందుతారు. రూ.2,999 కంటే ఎక్కువ కొనుగోళ్లపై జియో రూ.500 వోచర్ ను కూడా అందిస్తోంది.
టాపిక్