తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Small Cap Mutual Funds : బెస్ట్​ స్మాల్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ లిస్ట్​ ఇదే..

Best small cap mutual funds : బెస్ట్​ స్మాల్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ లిస్ట్​ ఇదే..

Sharath Chitturi HT Telugu

22 July 2023, 8:14 IST

google News
    • Best small cap mutual funds : స్మాల్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్​వెస్ట్​ చేయాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే..
బెస్ట్​ స్మాల్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ లిస్ట్​ ఇదే..
బెస్ట్​ స్మాల్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ లిస్ట్​ ఇదే.. (unsplash)

బెస్ట్​ స్మాల్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ లిస్ట్​ ఇదే..

Best small cap mutual funds : మీ ఇన్​వెస్ట్​మెంట్​ జర్నీని మ్యూచువల్​ ఫండ్స్​తో ప్రారంభించాలని చూస్తున్నారా? రిస్క్​ తీసుకోవడానికి సిద్ధమైతే.. స్మాల్​ క్యాప్​ ఫండ్స్​ బెస్ట్​ ఆప్షన్​ అవుతుంది! మార్కెట్​లో చాలా స్మాల్​ క్యాప్​ ఫండ్స్​ ఉన్నాయి. మరి వాటిల్లో దేనిని ఎంచుకోవాలి? అని మీకు సందేహం కలుగుతుంది. ఈ నేపథ్యంలో గత 3ఏళ్ల ప్రదర్శన ఆధారంగా.. టాప్​ ఫండ్స్​ను మీ ముందుకు తీసుకొస్తున్నాము. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి.

క్వాంట్​ స్మాల్​ క్యాప్​ ఫండ్​..

ఇందులోని డైరక్ట్​ ప్లాన్​.. మూడేళ్లల్లో 58.07శాతం రిటర్నులు ఇచ్చింది. రెగ్యులర్​ ప్లాన్​ 55.72శాతం రిటర్నులు తెచ్చిపెట్టింది. నిఫ్టీ స్మాల్​ క్యాప్​ 250 టోటల్​ రిటర్న్​ ఇండెక్స్​ను ఫండ్​ ట్రాక్​ చేస్తుంది. ఇది మూడేళ్లల్లో కేవలం 38.73శాతం రిటర్నులు మాత్రమే ఇచ్చింది.

నిప్పాన్​ ఇండియా స్మాల్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​..

ఇందులోని డైరక్ట్​ ప్లాన్ మూడేళ్లల్లో​ 48.29శాతం, రెగ్యులర్​ ప్లాన్​ 46.99శాతం మేర రిటర్నులు తెచ్చిపెట్టాయి. ఇది కూడా నిఫ్టీ స్మాల్​ క్యాప్​ 250 టోటల్​ రిటర్న్​ ఇండెక్స్​నే ట్రాక్​ చేస్తుంది.

కెనెరా రొబెకో స్మాల్​ క్యాప్​ ఫండ్​..

మూడేళ్లల్లో డైరక్ట్​ ప్లాన్​ 45.34శాతం, రెగ్యులర్​ ప్లాన్​ 42.93శాతం మేర లాభాలను తెచ్చిపెట్టాయి. ఇది కూడా పైన చెప్పిన ఇండెక్స్​నే ట్రాక్​ చేస్తుంది.

ఇదీ చూడండి:- Mutual Funds: లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్.. ఏ ఫండ్ లో పెట్టుబడులు పెట్టడం బెటర్?

హెచ్​డీఎఫ్​సీ స్మాల్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​..

ఇందులోని డైరక్ట్​ ప్లాన్​ మూడేళ్లల్లో 44.88శాతం, రెగ్యులర్​ ప్లాన్​ 43.88శాతం లాభాలను ఇచ్చాయి. ఇది బీఎస్​ఈ 250 స్మాల్​ క్యాప్​ టోటల్​ రిటర్న్​ ఇండెక్స్​ను ట్రాక్​ చేస్తుంది. ఈ సూచీ మూడేళ్లల్లో 39.16శాతం మేర లాభాలను తెచ్చిపెట్టింది.

కొటాక్​ స్మాల్​ క్యాప్​ ఫండ్​..

కొటాక్​ స్మాల్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​లోని డైరక్ట్​ ప్లాన్​తో మదుపర్లు మూడేళ్లల్లో 43.84శాతం మేర లాభాలను పొందారు. రెగ్యులర్​ ప్లాన్​లో అది 41.84శాతంగా ఉంది. ఇది నిఫ్టీ స్మాల్ ​క్యాప్​ 250 టోటల్​ రిటర్న్​ ఇండెక్స్​ను ఫాలో అవుతుంది.

టాటా స్మాల్​ క్యాప్​ ఫండ్​..

ఇందులోని డైరక్ట్​ ప్లాన్​ మూడేళ్లల్లో 43.82శాతం, రెగ్యులర్​ ప్లాన్​ 41.24శాతం రిటర్నులు తెచ్చిపెట్టాయి.

జులై 19 వరకు ఉన్న డేటాను రూపొందించి, ఈ లిస్ట్​ను తయారు చేయడం జరిగింది.

(గమనిక:- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. మ్యూచవల్​ ఫండ్స్​ అంటే రిస్క్​తో కూడుకున్న విషయం అని గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ను సంప్రదించడం ఉత్తమం.)

తదుపరి వ్యాసం