తెలుగు న్యూస్  /  Business  /  Bajaj Pulsar 125 Carbon Fibre Edition Launched For Starting Price Rs 89254

Bajaj Pulsar 125 Carbon Fibre Edition: ఆకర్షణీయమైన లుక్‍తో బజాజ్ పల్సర్ కొత్త ఎడిషన్.. ధర ఎంతంటే..!

15 November 2022, 19:40 IST

    • Bajaj Pulsar 125 Carbon Fibre Edition: బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్ వచ్చేసింది. పల్సర్ 125 బైక్‍కు లుక్స్ పరమైన అప్‍గ్రేడ్‍గా ఇది ఉంది.
Bajaj Pulsar 125 Carbon Fibre Edition: బజాజ్ పల్సర్ కు హంగులతో కొత్త ఎడిషన్
Bajaj Pulsar 125 Carbon Fibre Edition: బజాజ్ పల్సర్ కు హంగులతో కొత్త ఎడిషన్

Bajaj Pulsar 125 Carbon Fibre Edition: బజాజ్ పల్సర్ కు హంగులతో కొత్త ఎడిషన్

Bajaj Pulsar 125 Carbon Fibre Edition: ఎంతో పాపులర్ అయిన పల్సర్ మోటార్ సైకిల్‍కు కొత్త వేరియంట్‍ను బజాజ్ ఆటో (Bajaj Auto) లాంచ్ చేసింది. బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్ ఇండియాలో మంగళవారం విడుదలైంది. ఎంట్రీ లెవెల్ పల్సర్ మోటార్ సైకిల్‍కు బాడీ గ్రాఫిక్స్ తో కూడిన అదనపు హంగులతో ఈ కొత్త ఎడిషన్ వచ్చింది. కార్బన్ ఫైబర్ ఎడిషన్‍లో సింగ్ సీట్, స్ప్లిట్ సీట్ వెర్షన్‍లు విడుదలయ్యాయి. బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్ వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

ITR filing 2024: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? ఫామ్ 16 గురించి ఈ విషయాలు తెలుసుకోండి

Air India-Vistara merger: ఎయిర్ ఇండియా - విస్తారా విలీనంపై కీలక అప్ డేట్ ఇచ్చిన టాటా సన్స్

Changes from May 1 : మే 1 నుంచి ఈ విషయాల్లో భారీ మార్పులు.. కచ్చితంగా తెలుసుకోవాలి

Best Mutual Funds : ఏడాది కాలంలో అద్భుత రిటర్నులు ఇచ్చిన టాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ ఇవే..

Bajaj Pulsar 125 Carbon Fibre Edition Price: ధర

బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్ సింగిల్ సీట్ వెర్షన్ ధర రూ.89,254 (ఎక్స్-షోరూం, ఢిల్లీ), స్ల్పిట్ సీట్ వెర్షన్ ధర రూ.91,642 (ఎక్స్-షోరూం, ఢిల్లీ)గా ఉంది. బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్‍లలో ఈ కొత్త మోడల్ వచ్చింది.

Bajaj Pulsar 125 Carbon Fibre Edition: డిజైన్

బాడీ గ్రాఫిక్స్ తో పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్‍కు కొత్త లుక్‍ను ఇచ్చింది బజాజ్. ఈ మోటార్ సైకిల్‍కు బ్లాక్ బేస్ పెయింట్ ఉంటుంది. కలర్ వేరియంట్‍ను బట్టి బ్లూ, రెడ్ హైలైట్స్ ఉంటాయి. ఈ పల్సర్ ఎడిషన్ హెడ్‍ల్యాంప్ కౌల్, ఫ్లుయెల్ ట్యాంక్, ఫ్రంట్ ఫెండర్, టైల్ సెక్షన్, బెల్లీ ప్యాన్, అలాయ్ వీల్స్ కు బాడీ గ్రాఫిక్స్ ఉంటుంది. దీంతో లుక్ పరంగా ఈ కొత్త పల్సర్ ఎడిషన్ మరింత స్టైలిష్‍గా కనిపిస్తోంది.

Bajaj Pulsar 125 Carbon Fibre Edition: ఫీచర్లు

బజాజ్ పల్సర్ 125 ఫైబర్ ఎడిషన్ మోటార్ సైకిల్ 124.4cc సింగిల్ సిలిండర్ ఇంజిన్‍ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 8,500rpm (రెవల్యూషన్/రొటేషన్ పర్ మినిట్) వద్ద 11.64bphను, 6,500rpm వద్ద 10.80 గరిష్ట టార్క్యూను జనరేట్ చేస్తుంది. మొత్తంగా పల్సర్ ఎంట్రీ లెవెల్ స్పెసిఫికేషన్లనే కలిగి ఉంది. ఈ సెగ్మెంట్‍లో హోండా ఎస్‍పీ 125, గ్లామర్ 125 మోటార్ సైకిళ్లతో పల్సర్ 125 పోటీ పడుతోంది.

బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్ కూడా 5-స్పీడ్ గేర్ బాక్స్ తోనే వస్తోంది. టెలి స్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక డ్యుయల్ షాక్ అబ్సాబర్స్ ఉంటాయి. 240mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ యూనిట్ ఉంటుంది. 6 స్పోక్ అలాయ్ వీల్స్ పై ఈ బైక్ రన్ అవుతుంది. 1320mm వీల్ బేస్, 17 ఇంచుల వీల్ షోడ్‍తో వస్తోంది. మొత్తంగా ఈ కార్బన్ ఫైబర్ ఎడిషన్ 165mm గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉంది.

టాపిక్