తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Audi Q3 Sportback Vs Bmw X1 : ఆడీ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​ వర్సెస్​ బీఎండబ్ల్యూ ఎక్స్​1.. ది బెస్ట్​ ఏది?

Audi Q3 Sportback vs BMW X1 : ఆడీ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​ వర్సెస్​ బీఎండబ్ల్యూ ఎక్స్​1.. ది బెస్ట్​ ఏది?

Sharath Chitturi HT Telugu

19 February 2023, 7:59 IST

google News
    • Audi Q3 Sportback vs 2023 BMW X1 : లగ్జరీ కార్ల సెగ్మెంట్​లో ఇటీవలే రెండు కొత్త వెహికిల్స్​ లాంచ్​ అయ్యాయి. అవి ఆడీ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​, బీఎండబ్ల్యూ ఎక్స్​1. వీటని పోల్చి.. ది బెస్ట్​ ఏదనేది తెలుసుకుందాము..
ఆడీ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​ వర్సెస్​ బీఎండబ్ల్యూ ఎక్స్​1.. ది బెస్ట్​ ఏది?
ఆడీ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​ వర్సెస్​ బీఎండబ్ల్యూ ఎక్స్​1.. ది బెస్ట్​ ఏది? (HT AUTO)

ఆడీ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​ వర్సెస్​ బీఎండబ్ల్యూ ఎక్స్​1.. ది బెస్ట్​ ఏది?

Audi Q3 Sportback vs 2023 BMW X1 : ఇండియా మార్కెట్​లోని లగ్జరీ కార్ల సెగ్మెంట్​పై పట్టు సాధించేందుకు అంతర్జాతీయ బ్రాండ్స్​ పోటీపడుతున్నాయి! ఆడీ, బీఎండబ్ల్యూ సంస్థలు ఈ రేస్​లో ముందున్నాయి. కొత్త కొత్త లాంచ్​లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. క్యూ3 స్పోర్ట్​బ్యాక్​ లగ్జరీ వెహికిల్​ని ఇటీవలే లాంచ్​ చేసింది ఆడీ. ఇక సరికొత్త బీఎండబ్ల్యూ ఎక్స్​1 గత నెలలో బయటకొచ్చింది. ఈ క్రమంలో ఈ రెండు లగ్జరీ వాహనాలను ఓ సారి పోల్చి.. ది బెస్ట్​ ఏది? అన్నది తెలుసుకుందాము..

ఆడీ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​ వర్సెస్​ 2023 బీఎండబ్ల్యూ ఎక్స్​1- లుక్స్​..

2023 BMW X1 on road price in India : 2023 బీఎండబ్ల్యూ ఎక్స్​1 బానెట్​ మస్క్యులర్​గా, పెద్దగా ఉంటుంది. క్రోమ్​ కిడ్నీ గ్రిల్​, సీ- షేప్​లోని డీఆర్​ఎల్స్​తో కూడిన స్వెప్ట్​బ్యాక్​ ఎల్​ఈడీ హెడ్​లైట్స్​, ఫ్లష్​- ఫిట్టెడ్​ డోర్​ హ్యాండిల్స్​, రూఫ్​ రెయిల్స్​, వ్రాప్​ అరౌండ్​ ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్స్​ ఉంటాయి.

ఇక ఆడీ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​లో హుడ్​ పెద్దగా ఉంటుంది. హనీకూంబ్​ మెష్​ పాటర్న్​తో కూడిన బ్లాక్​ గ్రిల్​ ఉంటుంది. మాట్రిక్స్​ ఎల్​ఈడీ హెడ్​లైట్స్​, స్లోపింగ్​ రూఫ్​లైన్​, ఓఆర్​వీఎంలు, ఫ్లేర్​డ్​ వీల్​ ఆర్చీస్​, ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​ ఉన్నాయి.

ఈ రెండు వాహనాల్లోనూ 18 ఇంచ్​ డిజైనర్​ అలాయ్​ వీల్స్​ ఉంటాయి.

ఆడీ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​ వర్సెస్​ 2023 బీఎండబ్ల్యూ ఎక్స్​1- ఇంజిన్​..

Audi Q3 Sportback on road price Hyderabad : బీఎండబ్ల్యూ ఎక్స్​1లో 1.5 లీటర్​, త్రీ సిలిండర్​, టర్బో పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 136 హెచ్​పీ పవర్​ను, 230ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇక 2.0 లీటర్​, ఇన్​లైన్​ 4, డీజిల్​ మోటర్​ కూడా ఉంది. ఇది 150 హెచ్​పీ పవర్​ను, 360 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

ఆడీ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​లో 2.0 లీటర్​, ఫోర్​ సిలిండర్​​ టీఎఫ్​ఎస్​ఐ టర్బోఛార్జ్​డ్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 187.4 హెచ్​పీ పవర్​ను, 320 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

ఈ రెండు ఎస్​యూవీల్లోనూ 7 స్పీడ్​ గేర్​బాక్స్​ ఉంటుంది. 2023 బీఎండబ్ల్యూ ఎక్స్​1లో డీసీటీ యూనిట్​ ఉండగా.. ఆడీ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​లో టార్క్​ కన్వర్టర్​ ట్రాన్స్​మిషన్​ సెటప్​ ఉంటుంది.

ఆడీ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​ వర్సెస్​ 2023 బీఎండబ్ల్యూ ఎక్స్​1- ఫీచర్స్​..

2023 BMW X1 India launch : 2023 బీఎండబ్ల్యూ ఎక్స్​1లో డ్యూయెల్​- టోన్​ డాష్​బోర్డ్​, లెథర్​ అప్​హోలిస్ట్రీ, వయర్​లెస్​ ఛార్జర్​, పానారోమిక్​ సన్​రూఫ్​, మల్టీ-జోన్​ క్లైమేట్​ కంట్రోల్​, 10.25 ఇంచ్​ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 10.7 ఇంచ్​ ఐడ్రైవ్​ 8 ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ వంటి ఫీచర్స్​ ఉన్నాయి.

ఇక ఆడీ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​లో డ్యూయెల్​- టోన్​ క్యాబిన్​, మల్టీ కలర్​ యాంబియెంట్​ లైటింగ్​, పానారోమిక్​ సన్​రూఫ్​, అడ్జెస్టెబుల్​ ఫ్రెంట్​ సీట్స్​, వర్చుయవల్​ కాక్​పిట్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 10.1 ఇంచ్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ వంటి ఫీచర్స్​ ఉంటాయి.

ఈ రెండు లగ్జరీ ఎస్​యూవీల్లోనూ 6 ఎయిర్​బ్యాగ్స్​ ఉంటాయి.

ఆడీ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​ వర్సెస్​ 2023 బీఎండబ్ల్యూ ఎక్స్​1- ధర..

Audi Q3 Sportback facelift 2023 launch : ఇండియాలో 2023 బీఎండబ్ల్యూ ఎక్స్​1 ఎక్స్​షోరూం ధర రూ. 45.9లక్షలు- రూ. 47.9లక్షల మధ్యలో ఉంది. ఇక ఆడీ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 51.43లక్షలుగా ఉంది.

తదుపరి వ్యాసం