Ather Rizta : ఏథర్ రిజ్టా ప్రొడక్షన్ షురూ- ఈ-స్కూటర్ కొనొచ్చా? ధర, రేంజ్ వివరాలు చూసేయండి..
10 June 2024, 11:15 IST
- Ather Rizta : ఏథర్ రిజ్టా ప్రొడక్షన్ మొదలైంది. మరి ఈ ఈ-స్కూటర్ని కొనొచ్చా? ధర, రేంజ్‌తో పాటు ఇతర పూర్తి వివరాలు చూసేయండి..
ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ రిజ్టా..
Ather Rizta on road price in Hyderabad : ఏథర్ రిజ్టా స్కూటర్‌పై మరో కీలక అప్డేట్! ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఏథర్ రిజ్టా ఈ ఏడాది తొలినాళ్లల్లో రూ .1.10 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇంట్రడక్టరీ) ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. దీనిని ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ప్రమోట్ చేస్తోంది సంస్థ. ఇది మూడు వేరియంట్లు, ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఈ-స్కూటర్ని కొనే ముందు.. దీని వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఏథర్ రిజ్టా వివరాలు..
తమిళనడు హోసూర్ తయారీ కేంద్రంలో ఏథర్ రిజ్టా ప్రొడక్షన్ ఇటీవలే ప్రారంభమైంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ తరుణ్ మెహతా సోమవారం ఉదయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్‌లో ఈ అధికారిక ప్రకటన చేశారు. కొత్త రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఏథర్ చాలా ఆశలు పెట్టుకుంది. కుటుంబాలకు సౌకర్యవంతమైన రైడ్ ఎంపికగా ఇది నిలుస్తుందని చెబుతోంది.
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు సూపర్ డిమాండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా.. ఎలక్ట్రిక్ 2 వీలర్లను కొనేందుకు కస్టమర్లు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టు ఆప్షన్స్ ఇస్తుండటంతో.. ఏథర్ సంస్థకు మంచి పేరు వచ్చింది. తక్కువ కాలంలోనే బాగా ఎదిగింది. ఎథర్ 450ఎస్, 450ఎక్స్, 450 అపెక్స్ వంటి మోడళ్లు.. మార్కెట్లో ఉన్న ఇతర ఈవీ తయారీ సంస్థలకు గట్టి పోటీనిస్తున్నాయి. అయితే ఏథర్ రిజ్టా.. పూర్తిగా కొత్త మోడల్‌గా వస్తుండటం.. పోటీని మరింత తీవ్రతరం చేస్తుంది. ఇది సంప్రదాయకంగా కనిపించే ఎలక్ట్రిక్ స్కూటర్ కావడం తో హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి వాటికి కూడా బలమైన ప్రత్యర్థిగా నిలుస్తుంది.
ఏథర్ రిజ్టా ధర ఎంత?
Ather Rizta price in Hyderabad : ఈ ఏడాది ఏఫ్రిల్‌లో.. ఏథర్ రిజ్టా అధికారికంగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీని ప్రారంభ ధర రూ .1.10 లక్షలు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ఠ ధర సుమారు రూ .1.46 లక్షలు (ఎక్స్-షోరూమ్. ఇవి ఇంట్రొడక్టరీ ప్రైజ్లని గుర్తుపెట్టుకోవాలి. రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన మోడళ్లపై వర్తించే వివిధ రాయితీలకు కూడా ఇస్తోంది ఏథర్ సంస్థ.
ఏథర్ రిజ్టా రేంజ్ ఎంత?
ఏథర్ రిజ్టా డ్యూయెల్ బ్యాటరీ-ప్యాక్ ఎంపికలను పొందుతుంది. ప్రతి దానికి రేంజ్ మారుతుంది. రిజ్టా అత్యంత సరసమైన వెర్షన్ 2.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 105 కిలోమీటర్లను రేంజ్ ఇస్తుంది. ఇందులో 3.7 కిలోవాట్ల పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది సుమారు 125 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.
ఏథర్ రిజ్టా స్పెషల్ హైలైట్స్ ఏంటి?
ఫ్రేమ్‌కు అమర్చిన పీఎంఎస్ ఎలక్ట్రిక్ మోటారుతో నడిచే ఎథర్ రిజ్టా 3.7 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. టర్న్-బై-టర్న్ నావిగేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, మోనో-ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్లైట్లు, 12-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌తో కూడిన టిీఎఫ్టీ టచ్-ఎనేబుల్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్.. ఏథర్ రిజ్టా ఫీచర్ల జాబితాలో ఉంది. 34 లీటర్ల కార్గో ఏరియాతో ప్యాక్ చేసిన రిజ్టా భారతదేశంలో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పోల్చినా అతిపెద్ద సీటును కలిగి ఉంది.
ఈ ఎథర్ రిజ్టా.. సంస్థకు చెదిన 450 సిరీస్ నుంచి ప్రేరణ పొందింది. కానీ గణనీయంగా భిన్నమైన డిజైన్‌తో పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై రూపొందించడం జరిగింది. టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్ 1 ఎయిర్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి పెట్రోల్ ఆధారిత మోడళ్లకు రిజ్టా గట్టి పోటీ ఇస్తుంది.