తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Infinity E1x E-scooter : ఇన్ఫినిటీ ఈ1 ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొత్త వేరియంట్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Infinity E1X e-scooter : ఇన్ఫినిటీ ఈ1 ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొత్త వేరియంట్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Sharath Chitturi HT Telugu

27 May 2024, 13:30 IST

google News
    • Infinity E1X e-scooter : ఇన్ఫినిటీ ఈ1 కొత్త వేరియంట్​ లాంచ్​ అయ్యింది. ఇందులో స్వాపెబుల్​ బ్యాటరీ ఉంటుంది. దీని ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.. ఎ
బౌన్స్​ ఇన్ఫినిటీ ఈ1ఎక్స్​లో కొత్త వేరియంట్​..
బౌన్స్​ ఇన్ఫినిటీ ఈ1ఎక్స్​లో కొత్త వేరియంట్​..

బౌన్స్​ ఇన్ఫినిటీ ఈ1ఎక్స్​లో కొత్త వేరియంట్​..

Bounce Infinity E1X price : బెంగళూరు ఆధారిత ఎలక్ట్రిక్​ వెహికిల్​ స్టార్టప్​ సంస్థ బౌన్స్​ ఇన్ఫినిటీ.. తన బెస్ట్​ సెల్లింగ్​ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్​లో కొత్త వేరియంట్​ని లాంచ్​ చేసింది. దీని పేరు.. బౌన్స్​ ఇన్ఫినిటీ ఈ1ఎక్స్​. 2024 జూన్​ నుంచి ఈ మోడల్​ సేల్స్​ ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో.. ఈ ఎలక్ట్రిక్​ స్కూట్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఇన్ఫినిటీ ఈ1ఎక్స్​ కొత్త వేరియంట్​..

బౌన్స్​ ఇన్ఫినిటీ ఈ1ఎక్స్ ఎలక్ట్రిక్​ స్కూటర్​​ ఎక్స్​షోరూం ధర రూ. 55,000 నుంచి 59,000 మధ్యలో ఉంటుది. ఇదొక బ్యాటరీ- స్వాపెబుల్​ వేరియంట్​. దీనిని కస్టమైజ్​ చేసుకోవచ్చు. పూర్తిగా అయిపోయిన బ్యాటరీని.. కొత్తగా ఛార్జ్​ అయిన బ్యాటరీతో సౌకర్యవంతంగా, సింపుల్​గా స్వాప్​ చేసుకోవచ్చు.

ఈ ఇన్ఫినిటీ ఈ1ఎక్స్​లో 2 స్పీడ్​ మోడల్స్​ని లాంచ్​ చేసింది సంస్థ. అవి.. 55 కేఎంపీహెచ్​, 65 కేఎంపీహెచ్​. అంతేకాదు.. ఇందులో 92కేఎంపీహెచ్​ టాప్​ స్పీడ్​ మోడల్​ని సైతం విడుదల చేసేందుకు సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఫలితంగా వాటిని విదేశాలకు కూడా ఎగుమతి చేయాలని ప్లాన్​ చేస్తోంది.

Bounce Infinity E1X price in Bengaluru : "ప్రస్తుతం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 2 వీలర్​ మార్కెట్​ కలిగిన దేశం ఇండియా. కానీ ఈవీల నిజమైన బెనిఫిట్స్​ని ఎవరు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. ఇన్నోవేషన్​ కోసం ఈవీలు చాలా ముఖ్యంగా మారతాయి. అంతేకాకుండా.. వెహికిల్​ నుంచి బ్యాటరీ కాస్ట్​ని తీస్తే.. అవి మరింత చౌకగా మారతాయి," అని బౌన్స్​ ఇన్ఫినిటీ సహ- వ్యవస్థాపకుడు, సీఈఓ వివేకానంద హల్లెకరె తెలిపారు.

దేశవ్యాప్తంగా ముఖ్యమైన నగరాల్లో 30వేల ఈవీలను యాడ్​ చేసేందుకు.. సన్​ మొబిలిటీతో జత కట్టింది బౌన్స్​ ఇన్ఫినిటీ. బెంగళూరు, హైదరాబాద్​, పూణె, దిల్లీ ఎన్​సీఆర్​, ముంబై వంటి నగరాల్లో బౌన్స్​ ఇన్ఫినిటీ ఈ-స్కూటర్​ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇక దిగ్గజ ఫుడ్​ డెలివరీ సంస్థలతో కూడా సంస్థ సంప్రదింపులు జరుపుతోంది. ఫలితంగా.. క్విక్​-కామర్స్​, లాస్ట్​ మైల్​ డెలివరీ కంపెనీలతో తన రీచ్​ని పెంచుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది.

Bounce Infinity E1X : బౌన్స్​ ఇన్ఫినిటీ.. తన ఈ1+ ఎలక్ట్రిక్​ స్కూటర్​ రేంజ్​పై గతంలో భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ1+ ఎక్స్​షోరూం ధర రూ. 1.13 లక్షలు నుంచి రూ. 89,999కి దిగొచ్చింది. ఇందులో రిమూవెబుల్​ బ్యాటరీ ఉంటుంది 15ఏఎంపీ వాల్​ సాకెట్​తో దీనిని ఛార్జ్​ చేసుకోవచ్చు. క్విక్​ ఛార్జంగ్​, ఎక్స్​టెండెడ్​ రేంజ్​ వంటి ఫీచర్స్​ కూడా ఇందులో ఉన్నాయి.

హోండా స్టైలో 160.. వచ్చేస్తోంది!

భారత ఆటోమొబైల్​ మార్కెట్​లో.. ఈవీలతో పాటు 2 వీలర్​ సెగ్మెంట్​కి కూడా మంచి డిమాండ్​ కనిపిస్తోంది. దీనిని క్యాష్​ చేసుకునేందుకు ఆటోమొబైల్​ సంస్థ.. పోటీపడి మరీ కొత్తకొత్త స్కూటర్లను లాంచ్​ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు.. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) నుంచి ఓ కొత్త స్కూటర్​ మార్కెట్​లోకి ఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. స్టైలో 160 స్కూటర్​కు సంస్థ పేటెంట్ పొందడం ఇందుకు కారణం. హోండా స్టైలో 160 ఈ సంవత్సరం ప్రారంభంలో ఇండోనేషియాలో లాంచ్ అయ్యింది. దానిని ఇప్పటివరకు మరే ఇతర మార్కెట్​లోనూ విడుదల చేయలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం