తెలుగు న్యూస్  /  బిజినెస్  /  New Electric Car : ఇండియాలోకి ఎంజీ మోటార్​ సరికొత్త ఎలక్ట్రిక్​ కారు..

New electric car : ఇండియాలోకి ఎంజీ మోటార్​ సరికొత్త ఎలక్ట్రిక్​ కారు..

Sharath Chitturi HT Telugu

19 March 2024, 12:15 IST

    • MG Motor new EV : ఎంజీ మోటార్​ నుంచి కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​.. లాంచ్​కు రెడీ అవుతోంది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
ఎంజీ మోటార్​ నుంచి కొత్త ఈవీ..
ఎంజీ మోటార్​ నుంచి కొత్త ఈవీ..

ఎంజీ మోటార్​ నుంచి కొత్త ఈవీ..

MG Motor new electric cars : ఇండియాలో ఎలక్ట్రిక్​ వెహికిల్ సెగ్మెంట్​కి డిమాండ్​ అంతా ఇంతా లేదు! కస్టమర్లు ఎగబడి ఈవీలు కొంటుంటే.. ఆటోమొబైల్​ సంస్థలు, పోటీపడి మరి కొత్త కొత్త మోడల్స్​ని లాంచ్​ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు.. ఇండియాలోకి సరికొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​ని తీసుకొచ్చే ప్లాన్​లో ఉంది బ్రిటీష్​ సంస్థ ఎంజీ మోటార్​. ఈ విషయాన్ని తన అధికారిక సోషల్​ మీడియా అకౌంట్స్​ ద్వారా వెల్లడించింది. ఈ వెహికిల్​ని బుధవారమే రివీల్​ చేయనుంది సంస్థ. ఈ కొత్త ఈవీపై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు కానీ.. ఇది, ఎంజీ ఎక్సెలర్​ ఎలక్ట్రిక్​ కారు అని మార్కెట్​ వర్గాల్లో అంచనాలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

ఇండియాలోకి కొత్త ఎలక్ట్రిక్​ కారు..

టాటా మోటార్స్​ తర్వాత.. ఇండియన్​ ఈవీ సెగ్మెంట్​లో అత్యధిక మార్కెట్​ షేర్​ కలిగిన సంస్థ ఎంజీ మోటార్​. ఈ కంపెనీకి చెందిన ఎంజీ జెడ్​ఎస్​ ఈవీ, కామెట్​ ఈవీలు.. ఇప్పటికే రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి. మరీ ముఖ్యంగా.. కామెట్​ ఈవీకి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఇండియాపై ఫోకస్​ చేసినట్టు, రానున్న కొన్నేళ్లల్లో పలు ఈవీ మోడల్స్​ని లాంచ్​ చేయనున్నట్టు ఎంజీ మోటార్​ ఇప్పటికే చెప్పింది. ఇక ఇప్పుడు.. బుధవారం కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​ని రివీల్​ చేస్తాని చెబుతుండటం.. సర్వత్రా ఆసక్తి నెలకొంది.

MG Excelor EV : ఈ ఎంజీ ఎక్సెలర్​ ఈవీకి సంబంధించి.. సంస్థ ఎలాంటి వివరాలను ప్రకటించలేదు. కానీ ఇది కూడా కామెట్​ ఈవీని రూపొందించిన ప్లాట్​ఫామ్​పైనే తయారవుతుందని సమాచారం.

గతేడాది నవంబర్​లో.. జేఎస్​డబ్ల్యూ గ్రూప్​తో జతకట్టింది ఎంజీ మోటార్​ పేరెంట్​ కంపెనీ ఎస్​ఏఐసీ. సంస్థలో 35శాతం వాటాని జేఎస్​డబ్ల్యూ గ్రూప్​కి ఆఫర్​ చేసింది. స్టీల్​, సిమెంట్​తో పాటు ఇతర సెక్టార్​లో అగ్రగామిగా కొనసాగుతున్న జేఎస్​డబ్ల్యూ గ్రూప్​.. ఆటోమొబైల్​ సెక్టార్​లోకి ఎంట్రీ ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ జాయిట్​ వెంచర్​తో ఇండియాలో ఎంజీ మోటార్​ వేగంగా వృద్ధి చెందుతుందని అంచనాలు ఉన్నాయి. డీల్​లో భాగంగా.. ఇండియాలోకి కొత్త ఈవీలను తీసుకొస్తుంది ఎంజీ హెక్టార్​. అంతేకాకుండా.. ఎలక్ట్రిక్​ వెహికిల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ని కూడా డెవలప్​ చేస్తుంది.

MG Excelor EV launch date in India : మరి ఈ ఎంజీ ఎక్సెలర్​ ఎలా ఉంటుంది? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. పైగా.. బుడ్డి వెహికిల్​గా పేరొందిన ఎంజీ కామెట్​ ఈవీ తర్వాత వస్తుండటంతో ఈ మోడల్​పై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ కొత్త ఎంజీ మోటార్​ ఈవీ.. అంచనాలను అందుకుంటుందా? లేదా? అనేది వేచి చూడాలి.

ఇక ఐసీఈ ఇంజిన్స్​ విషయానికొస్తే.. ఇండియాలో ఎంజీ మోటార్​ వృద్ధి బాగానే ఉందని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా.. ఎంజీ హెక్టార్​, ఆస్టర్​ ఎస్​యూవీలకు సూపర్​ డిమాండ్​ కనిపిస్తోంది. కంపెనీ సేల్స్​ నెలనెలా పెరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా.. ఎస్​యూవీ సెగ్మెంట్​లో ఇప్పటికే ఉన్న పోటీ.. మరింత పెరుగుతూ వస్తోంది. కియా, టాటా మోటార్స్​కి సంస్థ గట్టిపోటీనిస్తోంది అని నెంబర్ల ద్వారా స్పష్టమవుతోంది.

తదుపరి వ్యాసం