Mahindra sales : ఫిబ్రవరిలో 40శాతం పెరిగిన ఎం అండ్​ ఎం సేల్స్​.. ఎంజీ మోటార్​ కూడా!-scorpion and other suvs power mahindra sales in february grow by 40 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mahindra Sales : ఫిబ్రవరిలో 40శాతం పెరిగిన ఎం అండ్​ ఎం సేల్స్​.. ఎంజీ మోటార్​ కూడా!

Mahindra sales : ఫిబ్రవరిలో 40శాతం పెరిగిన ఎం అండ్​ ఎం సేల్స్​.. ఎంజీ మోటార్​ కూడా!

Sharath Chitturi HT Telugu
Mar 01, 2024 01:06 PM IST

Mahindra and Mahindra car sales in February : ఫిబ్రవరి సేల్స్​ డేటాను ప్రకటించాయి మహీంద్రా అండ్​ మహీంద్రా, ఎంజీ మోటార్​. వాటి వివరాలను ఇక్కడ చూసేయండి..

ఫిబ్రవరిలో 40శాతం పెరిగిన ఎం అండ్​ ఎం సేల్స్​..!
ఫిబ్రవరిలో 40శాతం పెరిగిన ఎం అండ్​ ఎం సేల్స్​..!

Mahindra and Mahindra February sales : ఇండియాలో ఎస్​యూవీ సెగ్మెంట్​కు లభిస్తున్న డిమాండ్.. దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మహీంద్రా అండ్​ మహీంద్రాకు కలిసి వస్తోంది. 2023 ఫిబ్రవరితో పోల్చుకుంటే 2024 ఫిబ్రవరిలో ఈ సంస్థ సేల్స్​ 40శాతం పెరిగాయి! గత నెలలో 42,401 యుటిలిటీ వెహికిల్స్​ని విక్రయించింది ఎం అండ్​ ఎం.

ఫిబ్రవరి నెలలో ఇండియాలో 30,358 ఎస్​యూవీలను విక్రయించింది ఎం అండ్​ ఎం. ఇండియాలోనే అతిపెద్ద ఎస్​యూవీ మేన్యుఫ్యక్చరింగ్​ సంస్థగా కొనసాగుతోంది ఎం అండ్​ ఎం. స్కార్పియో ఎన్​, స్కార్పియో క్లాసిక్​ వంటి ఎస్​యూవీలు మంచి ప్రదర్శన చేస్తున్నాయి.

మహీంద్రా అండ్​ మహీంద్రా ఎస్​యూవీ పోర్ట్​ఫోలియో చాలా పటిష్ఠంగా ఉంది. స్కార్పియో ఎన్​, స్కార్పియో క్లాసిక్​తో పాటు థార్​, బొలెరో, బొలెరో నియో, ఎక్స్​యూవీ700, ఎక్స్​యూవీ300, ఎక్స్​యూవీ400.ఈవీకి క్రేజీ డిమాండ్​ కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా.. స్కార్పియో ఎన్​, స్కార్పియో క్లాసిక్​లు లాంచ్​ అయిన రెండేళ్ల తర్వాత కూడా 1 లక్షకుపైగా పెండింగ్​ బుకింగ్స్​ ఉండటం విశేషం. ఈ రెండు మోడల్స్​ కలిపి ప్రతి నెల 16వేలకుపైగా యూనిట్​లు అమ్ముడుపోతాయి.

ఇక డిమాండ్​ని క్యాష్​ చేసుకునేందుకు.. మహీంద్ర స్కార్పియో ఎన్​లో కొత్త వేరియంట్​ని ఇటీవలే లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఈ మోడల్​ విశేషాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎక్స్​యూవీ300, ఎక్స్​యూవీ400 ఎలక్ట్రిక్​ వెహికిల్​కి ప్రతి నెల 9వేలకుపైగా బుకింగ్స్​ లభిస్తున్నాయి. ఎక్స్​యూవీ700 ఎస్​యూవీని ప్రతి నెల కనీసం 7వేల మంది బుక్​ చేసుకుంటున్నారు!

ఎంజీ మోటార్​ సేల్స్​..

MG motor sales in February 2024 : ఫిబ్రవరి నెల సేల్స్​కి సంబంధించిన వివరాలను ప్రకటించింది మరో దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ ఎంజీ మోటార్​. ఫిబ్రవరి సేల్స్​ 18శాతం పెరిగాయి! గత నెలలో 4,532 యూనిట్​లని సంస్థ విక్రయించింది. జనవరి సేల్స్​తో పోల్చుకుంటే ఇది ఎక్కువే! 2024 మొదటి రెండు నెలల్లో.. 2023 మొత్త సేల్స్​లో 14శాతాన్ని అచీవ్​ చేసింది సంస్థ. 2023లో మొత్తం మీద 56,902 యూనిట్​లను విక్రయించింది.

ఎంజీ హెక్టార్​ ఎస్​యూవీకి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఇండియాలో సంస్థకు ఉన్న బెస్ట్​ సెలింగ్​ మోడల్స్​లో ఇది టాప్​లో ఉంది! గత నెలలో ఎన్ని హెక్టార్​ యూనిట్​లు అమ్ముడుపోయాయన్న విషయాన్ని సంస్థ వెల్లడించలేదు. కాగా.. 2023లో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీగా నిలిచింది ఈ ఎంజీ హెక్టార్​.

ఇక ఎంజీ మోటార్​ ఎలక్ట్రిక్​ వెహికిల్స్​కి కూడా మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఫిబ్రవరి సేల్స్​లో 33శాతం వాటా ఈవీలదే అని సంస్థ వెల్లడించింది. జెడ్​ఎస్​ ఈవీ, కామెట్​ ఈవీ వంటి మోడల్స్​ సంస్థ పోర్ట్​ఫోలియోలో బలంగా ఉన్నయి.

టాటా మోటార్స్​.. ఈవీ సెగ్మెంట్​లో రారాజుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. టాటా మోటార్స్​ తర్వాత.. ఇండియా ఈవీ సెగ్మెంట్​లో రెండో అత్యధిక మార్కెట్​ షేర్​ కలిగిన సంస్థ ఈ ఎంజీ మోటార్​.

Whats_app_banner

సంబంధిత కథనం