తెలుగు న్యూస్  /  Business  /  Amazfit Pop 2 Smartwatch With Bt Calling Amoled Display Launched In India Sale On November 22 Via Flipkart

Amazfit Pop 2 BT Calling Smartwatch: బ్లూటూత్ కాలింగ్‍తో అమేజ్‍ఫిట్ నయా స్మార్ట్‌వాచ్.. ప్రత్యేక ధరతో రేపే తొలి సేల్

21 November 2022, 14:36 IST

    • Amazfit Pop 2 BT Calling Smartwatch: అమెజ్‍ఫిట్ పాప్ 2 స్మార్ట్‌వాచ్ ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. ప్రత్యేకమైన ఇంట్రడక్టరీ ధరతో రేపు సేల్‍కు రానుంది.
Amazfit Pop 2 BT Calling Smartwatch: బ్లూటూత్ కాలింగ్‍తో అమేజ్‍ఫిట్ నయా స్మార్ట్ వాచ్ (Photo: Amazfit))
Amazfit Pop 2 BT Calling Smartwatch: బ్లూటూత్ కాలింగ్‍తో అమేజ్‍ఫిట్ నయా స్మార్ట్ వాచ్ (Photo: Amazfit))

Amazfit Pop 2 BT Calling Smartwatch: బ్లూటూత్ కాలింగ్‍తో అమేజ్‍ఫిట్ నయా స్మార్ట్ వాచ్ (Photo: Amazfit))

Amazfit Pop 2 BT Calling Smartwatch: స్మార్ట్‌వాచ్‍లకు ఎంతో పాపులర్ అయిన అమేజ్‍ఫిట్ బ్రాండ్ నుంచి మరో కొత్త మోడల్ వస్తోంది. బ్లూటూత్ కాలింగ్, అమోలెడ్ డిస్‍ప్లేతో అమేజ్‍ఫిట్ పాప్ 2 స్మార్ట్‌వాచ్ భారత మార్కెట్‍లో అడుగుపెట్టింది. రేపు (నవంబర్ 22) ఈ వాచ్ తొలిసారి సేల్‍కు రానుంది. తొలి సేల్ సందర్భంగా ప్రత్యేక ఇంట్రడక్టరీ ధర ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ కోసం ఇన్‍బుల్ట్ గా ఈ వాచ్‍లో స్పీకర్, మైక్రోఫోన్ ఉన్నాయి. 150కు పైగా కస్టమైజబుల్ వాచ్ ఫేసెస్‍కు ఇది సపోర్ట్ చేస్తుంది. అమేజ్‍ఫిట్ పాప్ 2 స్మార్ట్‌వాచ్ పూర్తి వివరాలు ఇవే.

Amazfit Pop 2 Specifications, Features: అమేజ్‍ఫిట్ పాప్ 2 పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

1.78 ఇంచుల హెచ్‍డీ రెజల్యూషన్ అమోలెడ్ డిస్‍ప్లేతో అమేజ్‍ఫిట్ పాప్ 2 స్మార్ట్‌వాచ్ వస్తోంది. 150కు పైగా వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి. ఆల్‍వేస్ ఆన్ డిస్‍ప్లే ఫీచర్ కూడా ఉంటుంది. అల్యూమినియమ్ అలాయ్‍తో ఈ వాచ్ బాడీని అమేజ్‍ఫిట్ రూపొందించింది. ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్‍తో వస్తోంది.

Amazfit Pop 2 Smartwatch బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తో వస్తోంది. ఇందుకోసం ఈ వాచ్‍లో ఇన్‍బుల్ట్ గా స్పీకర్, మైక్రోఫోన్ ఉంటాయి. దీంతో స్మార్ట్ ఫోన్‍కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్ నుంచే కాల్స్ మాట్లాడుకోవచ్చు.కాల్స్ కూడా చేసుకోవచ్చు. మ్యూజిక్ ప్లేబ్యాక్, కెమెరా షటర్ ను కూడా కంట్రోల్ చేయవచ్చు. ఫోన్‍కు వచ్చే సోషల్ మీడియా నోటిఫికేషన్లను కూడా వాచ్‍లో పొందవచ్చు. ఫోన్‍లో జెప్ యాక్టివ్ యాప్‍ను ఇన్‍స్టాల్ చేసుకొని ఈ అమేజ్‍ఫిట్ పాప్ 2 స్మార్ట్‌వాచ్‍ను సింక్ చేసుకోవచ్చు. ఫిట్‍నెస్, హెల్త్ డేటాను చూడవచ్చు.

హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ ట్రాకింగ్ కోసం ఎస్‍పీఓ2 సెన్సార్, స్లీప్ ట్రాకర్ హెల్త్ ఫీచర్లను Amazfit Pop 2 Smartwatch కలిగి ఉంది. 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ కు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.

270mAh బ్యాటరీతో అమేజ్‍ఫిట్ పాప్ 2 స్మార్ట్‌వాచ్ వస్తోంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని అమేజ్‍ఫిట్ పేర్కొంది. అయితే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ వాడితే కాస్త తక్కువ వస్తుంది. వాయిస్ అసిస్టెంట్‍కు కూడా ఈ నయా స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తుంది.

Amazfit Pop 2 Price, Availability: అమేజ్‍ఫిట్ పాప్ 2 ధర, సేల్

అమేజ్‍ఫిట్ పాప్ 2 లిస్టింగ్ ధర రూ.3,999గా ఉండగా.. ఫస్ట్ సేల్‍లో రూ.3,299 ఇంట్రడక్టరీ ధరకు అందుబాటులోకి వస్తుంది. రేపు (నవంబర్ 22) మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ తో పాటు అమేజ్‍ఫిట్ అధికారిక వెబ్‍సైట్‍లో సేల్ మొదలవుతుంది. పింక్, బ్లాక్ కలర్ ఆప్షన్‍లలో ఈ వాచ్ లభిస్తుంది.

టాపిక్