తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Aadhaar Ration Card Linking : ఆధార్​- రేషన్​ కార్డు లింక్​ చేసుకున్నారా? లాస్ట్​ డేట్​ ఇదే..!

Aadhaar Ration Card Linking : ఆధార్​- రేషన్​ కార్డు లింక్​ చేసుకున్నారా? లాస్ట్​ డేట్​ ఇదే..!

Sharath Chitturi HT Telugu

26 June 2023, 13:29 IST

    • Aadhaar Ration Card Linking : మీ రేషన్​ కార్డును ఆధార్​తో లింక్​ చేశారా? ఇంకా చేయకపోతే.. మీకోసమే ప్రభుత్వం డెడ్​లైన్​ను మార్చింది. ఈ నేపథ్యంలో కార్డులను ఎలా లింక్​ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాము..
ఆధార్​- రేషన్​ కార్డు లింక్​ చేసుకున్నారా?
ఆధార్​- రేషన్​ కార్డు లింక్​ చేసుకున్నారా? (HT_PRINT)

ఆధార్​- రేషన్​ కార్డు లింక్​ చేసుకున్నారా?

Aadhaar Ration Card Linking : ఆధార్​ కార్డు- రేషన్​ కార్డు అనుసంధానానికి డెడ్​లైన్​ను ఈ నెల 30 నుంచి 2023 సెప్టెంబర్​ 30కి పొడగించింది కేంద్ర ప్రభుత్వం. ఫలితంగా.. ఈ ప్రక్రియను పూర్తి చేయని వారికి అదనంగా సమయం లభించింది. సెప్టెంబర్​ 30లోపు రేషన్​ కార్డుకు ఆధార్​ను లింక్​ చేసుకోవచ్చు. ఆ తర్వాత తుది గడువును పొడగిస్తారా? లేదా? అన్న విషయంపై క్లారిటీ లేదు. అందుకే.. తుది గడువు కన్నా ముందే ప్రక్రియను పూర్తి చేయడం మంచిది.

ఎందుకు చేసుకోవాలి..?

వన్​ నేషన్​ వన్​ రేషన్​ కార్డు ప్రోగ్రామ్​లో భాగంగా ఆధార్​ కార్డు లింకింగ్​ ప్రక్రియను చేపట్టింది కేంద్రం. ఫలితంగా దేశమంతటా ఈ పథకాన్ని సక్రమంగా అమలుచేస్తే.. రేషన్​ కార్డు విషయంలో అవతకవకలు జరగకుండా ఉంటుందని కేంద్రం భావిస్తోంది. ఈ ప్రక్రియతో మోసాలను తగ్గించి, అర్హత ఉన్న వారికి రేషన్​ను అందించవచ్చని కేంద్రం అభిప్రాయపడుతోంది. దేశంలో చాలా మందికి ఒకటి కన్నా ఎక్కువ రేషన్​ కార్డులు ఉన్నట్టు గుర్తించిన కేంద్రం.. అనర్హులు లబ్ధిపొందకుండా చూసుకునేందుకే ఈ చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేసింది. ఒక్కసారి రేషన్​ కార్డుకు ఆధార్​ కార్డును లింక్​ చేస్తే.. డూప్లికేట్​ రేషన్​ కార్డును వినియోగించుకోలేరు. ఫలితంగా అక్రమాలు తగ్గే అవకాశం ఉంటుంది.

ఆధార్​- రేషన్​ కార్డు అనుసంధానం ఎలా చేయాలి?

రేషన్​ కార్డుకు ఆధార్​ను అనుసంధానించేందుకు ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ మోడ్స్​ ఉన్నాయి.

ఆన్​లైన్​లో ఇలా..

స్టెప్​ 1:- ముందుగా మీరు యూఐడీఏఐ వెబ్‌సైట్ uidai.gov.inకి వెళ్లండి.

స్టెప్​ 2:- ఇప్పుడు 'స్టార్ట్ నౌ' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- ఆ తర్వాత జిల్లా, రాష్ట్రం పేరుతో సహా మీ చిరునామాను సమర్పించండి.

స్టెప్​ 4:- "రేషన్ కార్డ్ బెనిఫిట్" ఆప్షన్​పై క్లిక్ చేయండి.

ఇదీ చూడండి:- Ration card: ఇక వారికి రేషన్ ఇవ్వరు... రేషన్ కార్డు నిబంధనలలో కీలక మార్పు!

How to link Aadhaar with ration card : స్టెప్​ 5:- మీ ఆధార్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, ఈ-మెయిల్ చిరునామా, మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.

స్టెప్​ 6:- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.

స్టెప్​ 7:- ఓటీపీని నమోదు చేసిన తర్వాత, స్క్రీన్‌పై ప్రాసెస్ పూర్తి సందేశం కనిపిస్తుంది.

స్టెప్​ 8:- ఇప్పుడు మీ ఆధార్ ధృవీకరణ జరుగుతుంది. మీ రేషన్ కార్డుతో లింక్ అయిపోతుంది.

ఆఫ్​లైన్​లో ఇలా..

రేషన్ కార్డ్‌ని ఆధార్‌తో ఆఫ్‌లైన్‌తో లింక్ చేయడానికి, అవసరమైన డాక్యుమెంట్స్​ను రేషన్ కార్డ్ సెంటర్‌లో సమర్పించాలి. ఆధార్ కాపీ, రేషన్ కార్డు , పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను ఇచ్చి.. ఆధార్ బయోమెట్రిక్ డేటా వెరిఫికేషన్‌తో రేషన్ కార్డును అనుసంధానం చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం