తెలుగు న్యూస్  /  బిజినెస్  /  How To Link Epf Account To Aadhaar : ఈపీఎఫ్​ అకౌంట్​ను ఆధార్​తో లింక్​ చేయడం ఎలా?

How to link EPF account to Aadhaar : ఈపీఎఫ్​ అకౌంట్​ను ఆధార్​తో లింక్​ చేయడం ఎలా?

Sharath Chitturi HT Telugu

30 May 2023, 10:24 IST

google News
    • How to link EPF account to Aadhaar : మీ ఈపీఎఫ్​ అకౌంట్​ను ఆధార్​ నెంబర్​తో లింక్​ చేయాలా? ఈ ప్రక్రియకు సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
ఈపీఎఫ్​ అకౌంట్​ను ఆధార్​తో లింక్​ చేయడం ఎలా?
ఈపీఎఫ్​ అకౌంట్​ను ఆధార్​తో లింక్​ చేయడం ఎలా? (MINT_PRINT)

ఈపీఎఫ్​ అకౌంట్​ను ఆధార్​తో లింక్​ చేయడం ఎలా?

How to link EPF account to Aadhaar : భారతీయులకు ఆధార్​ కార్డు చాలా కీలకం. ఇది లేకపోతే దాదాపు ఏ పని కూడా జరగదు! ఈ నేపథ్యంలో ఈపీఎఫ్​ (ఎంప్లాయీ ప్రావిడెంట్​ ఫండ్​) అకౌంట్​కు ఆధార్ నెంబర్​​ను లింక్​ చేసుకోవడంతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఆ ప్రయోజనాలేంటి? ఈపీఎఫ్​కు ఆధార్​ను ఎలా లింక్​ చేయాలి? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

ప్రయోజనాలు..

ఈపీఎఫ్​ఓలో ప్రస్తుతం 4కోట్ల మందికిపైగా సబ్​స్క్రైబర్స్​ ఉన్నారు. అందరు తమ ఈపీఎఫ్​ ఖాతాను ఆధార్​తో లింక్​ చేసుకోవాలని ఈపీఎఫ్​ఓ వెల్లడించింది. దీనితో కలిగే ప్రయోజనాలు చూద్దాము..

  • అకౌంట్​ను డూప్లికేట్​ చేసే ముప్పు తగ్గుతుంది.
  • వ్యక్తిగత వివరాల డేటాలో తప్పులు ఉండే అవకాశం తగ్గుతుంది
  • పీఎఫ్​ అకౌంట్​ నుంచి డబ్బులు విత్​డ్రా చేసుకోవడం సులభమవుతుంది.

ఈపీఎఫ్​ అకౌంట్​కు ఆధార్​ను లింక్​ చేయడం ఎలా..?

ఇందుకోసం రెండు పద్ధతులు ఉన్నాయి. అవి.. ఆన్​లైన్​, ఆఫ్​లైన్​

ఆన్​లైన్​ ప్రక్రియ..

స్టెప్​ 1:- ఈపీఎఫ్​ఓ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లండి. https://iwu.epfindia.gov.in/eKYC/ (ఇది ఈపీఎఫ్​ అకౌంట్​కు ఆధార్​ను లింక్​ చేసుకోవడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోర్టల్​)

స్టెప్​ 2:- మీ యూఏఎన్​, దానికి అటాచ్​ చేసిన మొబైల్​ నెంబర్​ను ఎంటర్​ చేయండి.

స్టెప్​ 3:- సబ్మీట్​ బటన్​ ప్రెస్​ చేస్తే.. మీ ఫోన్​కు ఓటీపీ వస్తుంది.

స్టెప్​ 4:- ఓటీపీని ఎంటర్​ చేయండి. జెండర్​పై క్లిక్​ చేయండి. మీ వివరాలు ఇవ్వండి.

స్టెప్​ 5:- మీ ఆధార్​ నెంబర్​ టైప్​ చేసి.. ఆధార్​ వెరిఫికేషన్​ ప్రక్రియను ఎంచుకోండి.

Link EPF account to Aadhaar : స్టెప్​ 6:- 'యూజ్​ మొబైల్​ నెంబర్​/ ఈమెయిల్​ బేస్డ్​ వెరిఫికేషన్​' వంటి ఆప్షన్స్​ వస్తాయి. వాటిల్లో ఒకటి ఎంచుకోండి.

స్టెప్​ 7:- మీకు ఓటీపీ వస్తుంది. అది టైప్​ చేసి ఎంటర్​ చేస్తే వెరిఫికేషన్​ ప్రక్రియ పూర్తవుతుంది.

ఇదీ చూడండి:- How to link Aadhaar to LPG : ఎల్​పీజీ గ్యాస్​ కనెక్షన్​కు ఆధార్​ను లింక్​ చేయండి ఇలా..

ఉమంగ్​ యాప్​..

స్టెప్​ 1:- ఉమంగ్​ యాప్​ డౌన్​లోడ్​ చేసుకోండి. ఓపెన్​ చేసి సర్వీసెస్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- ఆల్​ సర్వీసెస్​ ట్యాబ్​లో ఈపీఎఫ్​ఓపై క్లిక్​ చేయండి.

స్టెప్​ 3:- ఈకేవైసీ సర్వీసెస్​పై క్లిక్​ చేసి, ఆధార్​ సీడింగ్​ ఆప్షన్​ ఎంచుకోండి.

EPF account Aadhaar link : స్టెప్​ 4:- యూఏఎన్​ నెంబర్​ ఎంటర్​ చేస్తే ఓటీపీ వస్తుంది. లాగిన్​ అవ్వండి.

స్టెప్​ 5:- మీ ఆధార్​ రిజిస్టర్డ్​ నెంబర్​కు మరో ఓటీపీ వస్తుంది.

స్టెప్​ 6:- ఆ ఓటీపీని వెరిఫై చేయండి. మీ ఆధార్​ నెంబర్​.. ఈపీఎఫ్​ అకౌంట్​కు లింక్​ అయిపోతుంది!

ఆఫ్​లైన్​ మోడల్​..

ఆఫ్​లైన్​లో మోడ్​లో ఈపీఎఫ్​ అకౌంట్​ను ఆధార్​ నెంబర్​కు లింక్​ చేయాలంటే.. స్థానిక ఈపీఎఫ్​ ఆఫీస్​కు వెళ్లాల్సి ఉంటుంది. ఆధార్​ సీడింగ్​ అప్లికేషన్​ను ఫిల్​ చేసి, సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించాలి. ఆ ఫామ్​ను ఎగ్జిక్యూటివ్​కు ఇవ్వాలి. వెరిఫికేషన్​ అనంతరం ఆధార్​ నెంబర్​ మీ ఈపీఎఫ్​ అకౌంట్​కు లింక్​ అవుతుంది.

తదుపరి వ్యాసం