తెలుగు న్యూస్  /  బిజినెస్  /  How To Link Aadhaar With Mobile Number : మీ ఆధార్​ను మొబైల్​ నెంబర్​కు లింక్​ చేయండిలా..

How to link Aadhaar with mobile number : మీ ఆధార్​ను మొబైల్​ నెంబర్​కు లింక్​ చేయండిలా..

Sharath Chitturi HT Telugu

26 May 2023, 6:23 IST

    • How to link Aadhaar with mobile number : మీ ఆధార్​ను మొబైల్​ నెంబర్​కు లింక్​ చేసుకోవాలా? అయితే ఇది మీకోసమే..
మీ ఆధార్​ కార్డును మొబైల్​ నెంబర్​తో లింక్​ చేయండిలా..
మీ ఆధార్​ కార్డును మొబైల్​ నెంబర్​తో లింక్​ చేయండిలా.. (HT_PRINT)

మీ ఆధార్​ కార్డును మొబైల్​ నెంబర్​తో లింక్​ చేయండిలా..

How to link Aadhaar with mobile number : దేశంలో ప్రతి విషయానికి ఆధార్​ కార్డు తప్పనిసరిగా మారింది. ఏదైనా అకౌంట్​ ఓపెన్​ చేయాలన్నా, ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా ఆధార్​ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో మన మొబైల్​ నెంబర్​కు ఆధార్​ను లింక్​ చేయడం చాలా ముఖ్యం. అత్యావశ్యకం కూడా. అందుకే మొబైల్​ నెంబర్​కు ఆధార్​ ఎలా లింక్​ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము..

ఓటీపీ ద్వారా..

దేశంలోని అన్ని టెలికాం సంస్థలు తమ యూజర్లకు.. మొబైల్​ నెంబర్​కు ఆధార్​ను లింక్​ చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. ఇందుకు ఓటీపీ విధానాన్ని అమలు చేస్తున్నాయి. టెలికాం సంస్థ వెబ్​సైట్​లో లేదా స్థానిక సర్వీస్​ సెంటర్​కు వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

స్టెప్​ 1:- ముందుగా టెలికాం సంస్థకు చెందిన అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- ఆధార్​ను ఏ మొబైల్​ నెంబర్​ లింక్​ చేద్దామని భావిస్తున్నారో.. దానిని ఎంటర్​ చేయండి.

స్టెప్​ 3:- సంబంధిత మొబైల్​ నెంబర్​కు టెలికాం సంస్థ ఓటీపీని పంపిస్తుంది.

స్టెప్​ 4:- ఓటీపీని ఎంటర్​ చేయండి. సబ్మీట్​ బటన్​ను క్లిక్​ చేయండి.

ఇదీ చూడండి:- How to link Aadhaar to LPG : ఎల్​పీజీ గ్యాస్​ కనెక్షన్​కు ఆధార్​ను లింక్​ చేయండి ఇలా..

స్టెప్​ 5:- ప్రాసెస్​ని ముందుకు తీసుకెళ్లేందుకు మీ అనుమతులు కావాల్సి ఉంటుంది. మీ 12 డిజిట్​ ఆధర్​ నెంబర్​ను టైప్​ చేయండి.

స్టెప్​ 6:- ఓటీపీని జనరేట్​ చేయడం కోసం యూఐడీఏఐకి మెసేజ్​ వెళుతుంది.

స్టెప్​ 7:- యూఐడీఏఐ నుంచి ఈ-కేవైసీకి సంబంధించి మీకు ఒక మెసేజ్​ వస్తుంది. దానిని వెరిఫై చేయండి.

Link Aadhaar with mobile number : స్టెప్​ 8:- "యాక్సెప్ట్​ ఆల్​ టర్మ్స్​ అండ్​ కండీషన్స్​"ను సెలక్ట్​ చేసి, మీ ఓటీపీని ఎంటర్​ చేయండి.

స్టెప్​ 9:- మీ మొబైల్​ నెంబర్​కు ఆధార్​ లింకైనట్టు మీకు ఒక కన్ఫర్మేషన్​ మెసేజ్​ వస్తుంది.

ఇదే కాకుండా.. ఏజెంట్​ల ద్వారా లేదా ఐవీఆర్​ఎస్​ పద్ధతిలోనూ మీ మొబైల్​ నెంబర్​కు ఆధార్​ను లింక్​ చేసుకోవచ్చు.

ఆధార్​ కార్డు స్టేటస్​..

Aadhaar card latest news : భారతీయులు.. కేవలం ఒక్కసారి మాత్రమే ఆధార్​ కార్డు కోసం ఎన్​రోల్​ చేసుకోవచ్చు. 12 డిజిట్​ నెంబర్​.. భారతీయులకు ఒక యునీక్​ ఐడెంటిఫికేషన్​గా మారింది. ఆధార్​ కార్డు కోసం ఎన్​రోల్​ చేసుకోవాలనుకునే వారు.. సంబంధిత వివరాలను అందజేసి, బయోమెట్రిక్​ సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. మరి మీరు కొత్తగా ఆధార్​ కార్డు తీసుకుంటున్నారా? అయితే.. ఆన్​లైన్​లో మీరు మీ ఆధార్​ కార్డు స్టేటస్​ను చూసుకోవచ్చు. ఈ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం