Aadhaar card status : మీ ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ స్టేటస్‌ను చెక్ చేసుకోండిలా..
Aadhaar card enrollment status కొత్తగా ఆధార్ కార్డు తీసుకుంటున్నారా? మీ ఎన్రోల్మెంట్ స్టేటస్‌ను ఆన్లైన్లో ఇలా చెక్ చేసుకోండి..
Aadhaar card status check online : భారతీయుల నిత్య జీవితంలో ఆధార్ కార్డు ఇప్పుడు ఓ భాగమైపోయింది. ఆధార్ కార్డు లేకపోతే ఇప్పుడు దాదాపు ఏ పనీ జరగడం లేదు! ఈ 12 డిజిట్ నెంబర్.. భారతీయులకు ఒక యునీక్ ఐడెంటిఫికేషన్‌గా మారింది. ఆధార్ కార్డు కోసం ఎన్రోల్ చేసుకోవాలనుకునే వారు.. సంబంధిత వివరాలను అందజేసి, బయోమెట్రిక్ సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. ఆధార్ కోర్డు కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా.. కేవలం ఒక్కసారి మాత్రమే ఆధార్ కార్డు కోసం ఎన్రోల్ చేసుకోవచ్చు. మీరు కొత్తగా ఆధార్ కార్డు తీసుకుంటున్నారా? అయితే.. ఆన్లైన్లో మీరు మీ ఆధార్ కార్డు స్టేటస్‌ను చూసుకోవచ్చు..
ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ స్టేటస్‌ను చెక్ చేసుకోండిలా..
స్టెప్ 1:- యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ (udai.gov.in) లోకి వెళ్లండి.
How to check Aadhaar card status : స్టెప్ 2:- 'మై ఆధార్' ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3:- ఆధార్ స్టేటస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే.. కొత్త వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది.
స్టెప్ 4:- మీ ఎన్రోల్మెంట్ ఐడీ, తేదీ, ఎన్రోల్మెంట్ టైమ్, సెక్యూరిటీ కోడ్ వంటి వివరాలు ఇవ్వండి.
ఇదీ చూడండి:- Aadhaar Toll Free Number : ఆధార్ సమస్యలా..? ఈ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయండి
స్టెప్ 5:- ఆ తర్వాత 'చెక్ స్టేటస్' బటమ్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 6:- మీ ఆధార్ జనరేట్ అయ్యి ఉంటే.. స్క్రీన్ మీద మీకు మెసేజ్ వస్తుంది. మీ ఈ- ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి.
Aadhaar card download online : స్టెప్ 7:- ఈ- ఆధార్ కార్డు కోసం డౌన్‌లౌడ్ ఆధార్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
స్టెప్ 8:- ఆధార్ కార్డు మొబైల్లో రావాలనుకుంటే.. 'గెట్ ఆధార్ ఆన్ మొబైల్' ఆప్షన్ ఎంచుకోవాలి.
ఈ విధంగా ఆన్లైన్లో ఉచితంగా మీ ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.
ఆధార్ కార్డులో ఫొటో మార్చడం ఎలా?
How to change photo in Aadhaar card : మీ ఆధార్ కార్డులో ఫొటో పాతదైపోయిందా? ఆధార్ కార్డు ఫొటో మార్చాలని భావిస్తున్నారా? అయితే ఈ ప్రాసెస్ ఇలా ఉంటుంది..
స్టెప్ 1:- యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ uidai.gov.in లోకి వెళ్లాలి.
స్టెప్ 2:- ఆధార్ ఎన్రోల్మెంట్ ఫామ్ మీద క్లిక్ చేయాలి.
స్టెప్ 3:- ఫామ్‌ను పూర్తిగా ఫిల్ చేయాలి. ఆ తర్వాత సమీపంలోని ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రలో దానిని సమర్పించాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం