Aadhaar Toll Free Number : ఆధార్ సమస్యలా..? ఈ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయండి
Aadhaar Related Queries: ఆధార్ సేవలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది భారత విశిష్ట ప్రాధికార సంస్థ(UIDAI ). ఆధార్ సమస్యలకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
UIDAI Toll Free Number : ఇటీవలే ఆధార్ సేవలకు సంబంధించి హైదరాబాద్ వేదికగా గ్రీవెన్స్ సెంటర్ ప్రారంభించింది భారత విశిష్ట ప్రాధికార సంస్థ. ప్రతిరోజూ వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ప్రత్యేకంగా సెంటర్ ను ప్రారంభించింది. ఇదిలా ఉంటే... మరో కీలక అప్డేట్ ఇచ్చింది భారత విశిష్ట ప్రాధికార సంస్థ. ఆధార్ కార్డు సమస్యలకు సంబంధించి ప్రశ్నలు, సందేహాలను నివృత్తి చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం 1947 నెంబర్ పేరుతో ఉచిత టోల్ ఫ్రీ సర్వీస్ ను ప్రారంభించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఆధార్ ప్రాంతీయ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
గ్రీవెన్స్ సెంటర్...
హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల ప్రజలకు ఆధార్ సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. రోజుకు సుమారు 200 మంది వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ కార్యాలయానికి వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో సరైన సదుపాయాలు లేకపోవటం, ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.... ప్రత్యేకంగా అన్ని రకాల వసతులతో గ్రీవెన్స్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు చేశారు. వీల్ చైన్ వంటి సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఆధార్ అప్డేట్….
మార్చి 15 నుండి 14 జూన్ 2023 వరకు ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశాన్ని కూడా యూఏఐడీ తీసుకొచ్చింది. ఆన్‍లైన్ ద్వారానే ఈ ఉచిత సదుపాయం ఉంటుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇది తీసుకొచ్చామని యూఐడీఏఐ తెలిపింది. అలాగే మూడు నెలల పాటు మాత్రమే ఆన్‍లైన్‍లో ఈ ఉచిత అప్‍డేట్ అవకాశం ఉంది. ఆ తర్వాత చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ వివరాలను ఆన్‍లైన్‍లో అప్‍డేట్ చేసుకునే వారికి మాత్రమే ఈ ఉచిత సదుపాయం ఉంటుంది. మైఆధార్ వెబ్‍సైట్/పోర్టల్ (myaadhaar.uidai.gov.in )లో ఆధార్ వివరాలను అప్‍డేట్ చేసుకుంటే ఉచితం. ఒకవేళ ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్‍డేట్ చేసుకుంటే సాధారణంగా రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‍లైన్ చేసుకుంటే ఉచితమే.
సంబంధిత కథనం