How to change photo in Aadhaar card : ఆధార్ కార్డులో ఫొటో మార్చడం ఎలా?
How to change photo in Aadhaar card : ఆధార్ కార్డులో ఫొటో మార్చాలని అనుకుంటున్నారా? ఈ ప్రాసెస్ చాలా సింపుల్. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
How to change photo in Aadhaar card : రోజువారీ జీవితంలో ఆధార్ కార్డు చాలా అవసరం. ఏం పని చేయాలనుకున్నా.. ఇప్పుడు ఆధార్ తప్పనిసరిగా మారిపోయింది. మీరు మీ ఆధార్ కార్డులో ఫొటోను మార్చుకోవాలని చూస్తున్నారా? ఆధార్ కార్డులో ఫొటో మార్చుకునే ప్రక్రియ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆధార్ కార్డులో ఫొటో మార్చడం ఎలా?
స్టెప్ 1:- యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ uidai.gov.in లోకి వెళ్లాలి.
స్టెప్ 2:- ఆధార్ ఎన్రోల్మెంట్ ఫామ్ మీద క్లిక్ చేయాలి.
Aadhar card photo update process : స్టెప్ 3:- ఫామ్‌ను పూర్తిగా ఫిల్ చేయాలి. ఆ తర్వాత సమీపంలోని ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రలో దానిని సమర్పించాలి.
స్టెప్ 4:- అక్కడే మీ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది.
స్టెప్ 5:- మీ కొత్త ఫొటోను అక్కడి ఎగ్జిక్యూటివ్ తీసుకుంటారు. దానిని మీ ఆధార్ కార్డ్‌కు యాడ్ చేస్తారు.
స్టెప్ 6:- ఈ సర్వీసు కోసం రూ. 100+ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎక్నాలెడ్మెంట్ స్లిప్‌ను మీకు అందిస్తారు. దానితో పాటు యూఆర్ఎన్ (అప్డేటెడ్ రిక్వెస్ట్ నెంబర్) కూడా ఇస్తారు.
Aadhar card latest news : యూఐడీఏఐలోకి వెళ్లి మీ యూఆర్ఎన్ నెంబర్‌ను టైప్ చేస్తే.. మీ రిక్వెస్ట్ స్టేటస్‌ను కూడా మీరు ట్రాక్ చేయవచ్చు. అయితే మీ ఆధార్ కార్డులో ఫొటో మార్చే ప్రక్రియకు కనీసం 90రోజుల సమయం పట్టొచ్చు. ఆ తర్వాత ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్‌కు వెళ్లి మీ అప్డేటెడ్ ఆధార్ కార్డును ప్రింట్ చేసుకోవచ్చు. లేదా మీ అప్డేటెడ్ ఆధార్ కార్డును యూఐడీఏఐ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ ఎలా అంటే..
స్టెప్ 1:- యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లి.. డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేయాలి.
స్టెప్ 2:- ఆధార్ నెంబర్, ఎన్రోల్మెంట్ ఐడీ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయాలి.
స్టెప్ 3:- క్యాప్చా ఎంటర్ చేసి 'సెండ్ ఓటీపీ' ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
స్టెప్ 4:- ఓటీపీ ఎంటర్ చేసి.. వెరిఫై అండ్ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మీ ఆధార్ కార్డు డౌన్లోడ్ అవుతుంది.
సంబంధిత కథనం