Aadhaar Card mandatory: ఇక్కడ కొడవలి కొనాలన్నా ఆధార్ కార్డ్ చూపాల్సిందే..
'koyta' crime: కొడవలి ఉపయోగించి చేసే దాడులు పెరుగుతుండడంతో పుణె పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా, పుణెలో కొడవలి గ్యాంగ్ ల పేరుతో యువత ఈ తరహా ఆయుధాలతో నేరాలకు పాల్పడుతున్నారు.
'koyta' crime: పుణె (pune) నగరంలో కొడవలి కొనుగోలు చేయాలంటే షాపులో ఆధార్ కార్డ్ ను (Aadhaar Card mandatory) చూపాల్సిందేనని అక్కడి పోలీసులు నిబంధన పెట్టారు. ఈ మేరకు అక్కడి షాప్స్ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. కొడవలి, పెద్ద కత్తులు, కొబ్బరి బొండాలు కొట్టడానికి ఉపయోగించే కత్తి మొదలైన వాటిని ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే షాపుల యజమానులకు ఆధార్ కార్డును (Aadhaar Card mandatory) చూపాల్సి ఉంటుంది. షాపుల యజమానులు ఈ ఆయుధాలను కొనుగోలు చేస్తున్నవారి ఆధార్ కార్డు వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
'koyta' crime: దాడులు పెరుగుతుండడంతో..
ఇటీవల కాలంలో కొడవళ్లు, కొబ్బరి బొండాలు నరికే కత్తులతో దాడులు చేయడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం పెరుగుతోంది. దాంతో, ఆ తరహా ఆయుధాల కొనుగోలుపై దృష్టి పెట్టాలని పుణె (pune police) పోలీసులు నిర్ణయించారు. ఈ తరహా ఆయుధాలకు సంబంధించిన నేరాలపై దృష్టి పెట్టడానికి పుణె (pune) పోలీస్ కమిషనర్ రితేశ్ కుమార్ 450 మంది పోలీసులను ప్రత్యేకంగా నియోగించారు. పుణె (pune) లోని ఒక షాపులో వారు సుమారు 100 కొడవళ్లను సీజ్ చేశారు. అలాగే, ఈ తరహా ఆయుధాలను అమ్మేవారి వివరాలను నమోదు చేసుకొని ఉండాలని అన్ని పోలీస్ స్టేషన్లకు కమిషనర్ ఆదేశాలిచ్చారు. అయితే, రిజిస్టర్డ్ షాపులు కాకుండా, ఇలాంటి ఆయుధాలను రోడ్డు పక్కన పెట్టి కూడా చాలామంది అమ్ముతుంటారు. వారిలో అత్యధికులు నిరక్షరాస్యులే ఉంటారు. కాబట్టి, వారు కొడవలి, కొబ్బరి బోండాలు నరికే కత్తి మొదలైన ఆయుధాలను అమ్మేముందు, కొనుగోలు చేసేవారి నుంచి ఆధార్ కార్డు కాపీని (Aadhaar Card mandatory) తీసుకోవాల్సి ఉంటుంది.