How to link Aadhaar to LPG : ఎల్​పీజీ గ్యాస్​ కనెక్షన్​కు ఆధార్​ను లింక్​ చేయండి ఇలా..-how to link aadhaar card to lpg gas connection see full details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  How To Link Aadhaar To Lpg : ఎల్​పీజీ గ్యాస్​ కనెక్షన్​కు ఆధార్​ను లింక్​ చేయండి ఇలా..

How to link Aadhaar to LPG : ఎల్​పీజీ గ్యాస్​ కనెక్షన్​కు ఆధార్​ను లింక్​ చేయండి ఇలా..

Sharath Chitturi HT Telugu
May 22, 2023 07:21 AM IST

How to link Aadhaar to LPG : కొత్తగా ఎల్​పీజీ గ్యాస్​ కనెక్షన్​ తీసుకుంటున్నారా? అయితే.. కనెక్షన్​కు ఆధార్​ కార్డును ఎలా లింక్​ చేయాలో ఇక్కడ తెలుసుకోండి..

ఎల్​పీజీ గ్యాస్​ కనెక్షన్​కు ఆధార్​ కార్డును లింక్​ చేయడం ఎలా?
ఎల్​పీజీ గ్యాస్​ కనెక్షన్​కు ఆధార్​ కార్డును లింక్​ చేయడం ఎలా? (MINT_PRINT)

How to link Aadhaar to LPG : దేశవ్యాప్తంగా ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్లపై సబ్సిడీని ఇస్తోంది భారత ప్రభుత్వం. అయితే సబ్సిడీ అమౌంట్​ పొందాలంటే ఎల్​పీజీ గ్యాస్​ కనెక్షన్​ను ఆధార్​ కార్డుతో లింక్​ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు.. సబ్సిడీ అమౌంట్​ డైరక్ట్​గా బ్యాంక్​ అకౌంట్​లోకి పడిపోతుంది. ఈ నేపథ్యంలో ఎల్​పీజీ గ్యాస్​ కనెక్షన్​కు ఆధార్​ కార్డును ఎలా లింక్​ చేయాలో ఇక్కడ తెలుసుకుందాము..

ఎల్​పీజీ గ్యాస్​ కనెక్షన్​..

ఎల్​పీజీ గ్యాస్​ కనెక్షన్​కు ఆధార్​ను లింక్​ చేసే ముందు.. బ్యాంక్​ అకౌంట్​ను ఆధార్​ నెంబర్​తో లింక్​ చేసుకోవాలి. అనంతరం ఆధార్​ కార్డు ఫొటో కాపీనీ సంబంధిత గ్యాస్​ ఏజెన్సీ డీలర్​కు ఇవ్వాలి. అప్పుడు అది ఎల్​పీజీ గ్యాస్​ కనెక్షన్​కు లింక్​ అవుతుంది.

ఆధార్​ కార్డును భారత్​ గ్యాస్​ కనెక్షన్​కు లింక్​ చేయడం ఎలా?

వెబ్​సైట్​ ద్వారా..

స్టెప్​ 1:- ముందుగా యూఐడీఏఐ​ వెబ్​సైట్​లోకి వెళ్లండి.

link Aadhaar number to LPG connection : స్టెప్​ 2:- ఫార్మ్​ను డౌన్​లోడ్​ చేసుకోండి.

స్టెప్​ 3:- మీ రెసిడెన్షియల్​ అడ్రెస్​ను ఫిల్​ చేయండి.

స్టెప్​ 4:- ఎలాంటి బెనిఫిట్​ (ఎల్​పీజీ)ను ఎంచుకోవాలని అనుకుంటున్నారో సెలక్ట్​ చేసుకోండి.

స్టెప్​ 5:- ఆధార్​ నెంబర్​తో పాటు మీ వ్యక్తిగత వివరాలను ఎంటర్​ చేయండి.

స్టెప్​ 6:- సబ్మీట్​ బటన్​ మీద క్లిక్​ చేయండి. మీకు ఒక ఓటీపీ వస్తుంది.

స్టెప్​ 7:- అప్లికేషన్​ సబ్మీషన్​ కోసం ఓటీపీని ఫిల్​ చేయండి.

ఇదీ చూడండి:- Aadhaar card status : మీ ఆధార్​ కార్డు ఎన్​రోల్​​మెంట్​ స్టేటస్​ను చెక్​ చేసుకోండిలా..

డిస్ట్రిబ్యూటర్​కు ఇస్తుంటే..

Aadhaar card latest news : స్టెప్​ 1:- భారత్​ గ్యాస్​ అధికారిక వెబ్​సైట్​లో నుంచి ఫార్మ్​ను డౌన్​లోడ్​ చేసుకోండి.

స్టెప్​ 2:- ఫార్మ్​ను ప్రింటౌంట్​ తీసుకోండి.

స్టెప్​ 3:- ఫార్మ్​లోని పూర్తి వివరాలు వెల్లడించండి

స్టెప్​ 4:- మీ సమీపంలోని ఎల్​పీజీ గ్యాస్​ డిస్ట్రిబ్యూటర్​ వద్దకు వెళ్లండి. మీ అప్లికేషన్​ను సమర్పించండి. సంబంధిత డాక్యుమెంట్​లు ఇవ్వాలి.

ఆధార్​ కార్డును హెచ్​పీ గ్యాస్​తో లింక్​ చేయడం ఎలా..

డిస్ట్రిబ్యూటర్​ ద్వారా..

Link Aadhaar to HP gas online : స్టెప్​ 1:- హెచ్​పీ గ్యాస్​ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- సబ్సిడరీ ఫార్మ్​ను డౌన్​లోడ్​ చేసుకోండి.

స్టెప్​ 3:- ప్రింటౌట్​ తీసుకోండి.

స్టెప్​ 4:- సంబంధిత వివరాలు ఫార్మ్​లో రాయండి

స్టెప్​ 5:- మీ సమీపంలోని ఎల్​పీజీ హెచ్​పీ గ్యాస్​ డిస్ట్రిబ్యూటర్​ కార్యాలయానికి వెళ్లండి. సంబంధిత పత్రాలతో పాటు ఫార్మ్​ను సబ్మీట్​ చేయండి.

స్టెప్​ 6:- లేదా.. కార్యాలయంలోని బాక్స్​లోనూ ఫార్మ్​ను డ్రాప్​ చేయవచ్చు.

ఐవీఆర్​ఎస్​ పద్ధతిలో..

Link Aadhaar to Bharat gas online : హెచ్​పీ గ్యాస్​ కాల్​ సెంటర్​కు కాల్​ చేయండి. ఐవీఆర్​ఎస్​ ద్వారా ఆధార్​ కార్డును లింక్​ చేసే ఆప్షన్​ను ఎంచుకోండి. ఒక్కో జిల్లాకు ఒక్కో ఐవీఆర్​ఎస్​ నెంబర్​ ఉంటుంది. ఇది హెచ్​పీ అధికారిక వెబ్​సైట్​లో అందుబాటులో ఉంటుంది.

భారత్​ గ్యాస్​లో చెప్పిన పద్ధతినే ఉపయోగించి.. హెచ్​పీ గ్యాస్​లోను వెబ్​సైట్​ ద్వారా ఆధార్​ కార్డును లింక్​ చేసుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం