LPG cylinder price cut : గుడ్ న్యూస్.. తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర!
LPG cylinder price cut : వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. ఫలితంగా సిలిండర్‌పై రూ. 171.50 తగ్గింది.
LPG cylinder price cut : కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి పెట్రోలియం- ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు. ఫలితంగా.. 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 171.50 తగ్గింది. తాజా ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని తెలుస్తోంది. కాగా.. డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు తగ్గించలేదు.
సాధారణంగా.. వాణిజ్య గ్యాస్ సిలిండర్లు హోటళ్లు వంటి ప్రాంతాల్లో వినియోగిస్తారు. ఇళ్లల్లో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్‌ను వాడతారు.
తాజా తగ్గింపుతో.. దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1856.50కు చేరింది. కోల్‌కతాలో 19కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1960.50గా ఉంది. తగ్గింపునకు ముందు ఈ ధర రూ. 2132గా ఉండేది. ముంబైలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1980 నుంచి రూ. 1808కి పడింది. చెన్నైలో గత నెలలో రూ. 2192గా ఉన్న వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 2021కు పడింది.
ఇదీ చదవండి:- Oil companies profit on petrol : లీటరు పెట్రోల్‌పై చమురు సంస్థల లాభం ఎంతంటే..
Commercial LPG cylinder price cut : చమురు సంస్థలు.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను ఈ ఏడాది మార్చ్ 1న పెంచాయి. యూనిట్‌పై రూ. 350.50 ప్రైజ్ హైక్ తీసుకున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ ధరను రూ. 50 పెంచాయి. ఏప్రిల్‌లో కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గించాయి. యూనిట్‌పై రూ. 92ను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. మొత్తం మీద కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఈ ఏడాదిలో మూడుసార్లు పెరగ్గా.. రెండుసార్లు తగ్గాయి!
గతేడాది సెప్టెంబర్ 1న వాణిజ్య సిలిండర్ ధరలు తగ్గాయి. 2022 ఆగస్టు, జులైలోని ఈ తరహా గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే.. వరుసగా రెండు నెలలు తగ్గింపు కనిపించింది!
విమాన ఇంధన ధరలు కూడా..!
ATF price drop : విమాన ఇంధన ధరలు (ఏటీఎఫ్) భారీగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఏటీఎఫ్ ధర రూ. 98,349.95 కిలో లీటర్ నుంచి రూ. 95,935.34 కిలో లీటరుకు చేరింది. ఈ వార్త విమానయాన సంస్థలకు భారీ ఊరటను కలిగించే విషయం.
విమాన ఇంధన ధరలను ప్రతి నెల 1వ తేదీన సవరిస్తారు. ఈ ఏడాది మార్చ్‌లో ఏటీఎఫ్ ధర 4శాతం మేర తగ్గింది.
సంబంధిత కథనం