తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Aadhaar Pan Mandatory For Small Saving Schemes : ఈ పథకాలకు ఆధార్​, పాన్​ తప్పనిసరి..!

Aadhaar PAN mandatory for small saving schemes : ఈ పథకాలకు ఆధార్​, పాన్​ తప్పనిసరి..!

Sharath Chitturi HT Telugu

01 April 2023, 13:20 IST

    • Aadhaar PAN mandatory for small saving schemes : ఇకపై చిన్న పొదుపు పథకాల ఖాతాలు తెరవాలంటే.. ఆధార్​, పాన్​ వివరాలు కచ్చితంగా సమర్పించాల్సిందే. తాజా నిబంధన నేటి నుంచి అమల్లోకి వచ్చింది.
చిన్న పొదుపు పథకాలకు పాన్​, ఆధార్​ తప్పనిసరి
చిన్న పొదుపు పథకాలకు పాన్​, ఆధార్​ తప్పనిసరి (Reuters)

చిన్న పొదుపు పథకాలకు పాన్​, ఆధార్​ తప్పనిసరి

Aadhaar PAN mandatory for small saving schemes : పీపీఎఫ్​, ఎస్​ఎస్​వై వంటి చిన్న పొదుపు పథకాల ఖాతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆధార్​, పాన్​ నెంబర్లు తప్పనిసరి అన్న నిబంధన ఏప్రిల్​ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ విషయంపై మార్చ్​ 31న కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్​ జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

ఆ అకౌంట్లు​ ఫ్రీజ్​..!

ఆధార్​ నెంబర్​ ఇవ్వకపోయినా.. చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడులకు ఇంతకాలం అనుమతిచ్చేవారు. కానీ ఇప్పటి నుంచి వీటిల్లో పెట్టుబడులకు ఆధార్​, పాన్​ నెంబర్లు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.

Pan must for PPF account : నోటిఫికేషన్​ ప్రకారం.. పీపీఎఫ్​, ఎస్​ఎస్​వై, ఎన్​వైసీ, ఎస్​సీఎస్​ఎస్​తో పాటు ఇతర చిన్న పొదుపు పథకాల్లో ఖాతా తెరిచే సమయంలో ఎవరైనా ఆధార్​ నెంబర్​ ఇవ్వకపోయుంటే.. 2023 సెప్టెంబర్​ 30 నాటికి దానిని సమర్పించాల్సి ఉంటుంది. కొత్తగా అకౌంట్​ చేస్తున్న వారు.. ఖతా తెరిచిన 6 నెలలలోపు ఆధార్​ కార్డు నెంబర్​ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా జరగకపోతే.. అకౌంట్​ ఓపెన్​ చేసిన 6 నెలల్లో అది ఫ్రీజ్​ అయిపోతుంది. అంటే.. 2023 అక్టోబర్​ 1 నుంచి అకౌంట్​లను వాడుకోలేరు!

ఇక చిన్న పొదుపు ఖాతాల్లో అకౌంట్​ తెరుస్తున్న సమయంలోనే పాన్​ కార్డ్​ నెంబర్​ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వని పక్షంలో కింద చెప్పిన విషయాలను పరిగణించి, రెండు నెలల్లోగా పాన్​ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.

1. అకౌంట్​లో బ్యాలెన్స్​ రూ. 50వేలు దాటినప్పుడు లేదా

Aadhaar mandatory for small saving schemes : 2. ఆర్థిక ఏడాదిలో అకౌంట్​ బ్యాలెన్స్​ రూ. 1లక్ష దాటినప్పుడు లేదా

3. అకౌంట్​ నుంచి విత్​డ్రా, బదిలి చేస్తున్నప్పుడు.. ఒక నెలలో రూ. 10వేల లిమిట్​ దాటినప్పుడు.

ఒక వేళ పాన్​ నెంబర్​ ఇవ్వకపోతే.. సంబంధిత ఖాతా కార్యకలాపాలు నిలిచిపోతాయని నోటిఫికేషన్​ స్పష్టం చేసింది. అకౌంట్స్​ ఆఫీసులో పాన్​ నెంబర్​ ఇచ్చిన తర్వాతే అది మళ్లీ ఓపెన్​ అవుతుందని వివరించింది.

తదుపరి వ్యాసం