Pan - Aadhaar Link: పాన్ - ఆధార్ అనుసంధానం తుదిగడువు పొడిగింపు-pan aadhaar linking deadline extended to june 30 check full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Pan Aadhaar Linking Deadline Extended To June 30 Check Full Details

Pan - Aadhaar Link: పాన్ - ఆధార్ అనుసంధానం తుదిగడువు పొడిగింపు

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 28, 2023 04:08 PM IST

Pan - Aadhaar Link: పాన్ - ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు తుది గడువును కేంద్రం పొడిగించింది. మార్చి 31 తుదిగడువుగా ఉండగా.. ఇప్పుడు దాన్ని జూన్ 30కు మార్చింది.

Pan - Aadhaar Link: పాన్ - ఆధార్ అనుసంధానం గడువు పొడిగింపు
Pan - Aadhaar Link: పాన్ - ఆధార్ అనుసంధానం గడువు పొడిగింపు (Reuters)

Pan - Aadhaar Link: పర్మినెంట్ అకౌంట్ నంబర్ (PAN)కు ఆధార్ (Aadhaar) అనుసంధానం (Link) తుది గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు గడువును పెంచింది. ఈ విషయంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) మంగళవారం అధికారిక ప్రకటన చేసింది. గడువు ముగిసేలోగా పాన్ - ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకోవాలని లేకపోతే.. జూలై 1 నుంచి పాన్ నిరర్ధకంగా మారుతుందని స్పష్టం చేసింది. అంటే ఆధార్ - పాన్ అనుసంధానం జూన్ 30లోగా పూర్తి చేసుకోకుంటే ఆ తర్వాత పాన్ కార్డు పని చేయదు. పాన్‍కు సంబంధించిన కార్యకలాపాలు ఆగిపోతాయి. పాన్ - ఆధార్ అనుసంధానం తుది గడువు మార్చి 31గా ఉండగా.. ఇప్పుడు దాన్ని జూన్ 30 వరకు పొడిగించింది కేంద్రం. పాన్ - ఆధార్ లింక్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..

ట్రెండింగ్ వార్తలు

PAN - Aadhaar Link: పాన్ - ఆధార్ లింక్ స్టేటస్ చెక్ చేసుకోండిలా..

  1. ముందుగా www.incometax.gov.in వెబ్‍సైట్‍కు వెళ్లండి.
  2. హోం పేజీ క్విక్ లింక్స్ (Quick Links) సెక్షన్‍లో లింక్ ఆధార్ స్టేటస్ (Link Aadhaar Status) అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  3. లింక్ ఆధార్ స్టేటస్‍పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఓ పేజీ ఓపెన్ అవుతుంది.
  4. ఆ తర్వాత ముందుగా పాన్ నంబర్, ఆ తర్వాత ఆధార్ సంఖ్యను ఎంటర్ చేయండి.
  5. అనంతరం కింద ఉండే వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ (View Link Aadhaar Status)పై క్లిక్ చేయండి.
  6. మీ పాన్ కార్డు ఆధార్ నంబర్‌తో లింక్ అయిందో లేదో అక్కడ చూపిస్తుంది. లింక్ అయి ఉంటే సక్సెస్‍ఫుల్‍గా లింక్ అయిందని చూపిస్తుంది.

లింక్ కాకపోతే అనుసంధానం చేసుకునేందుకు లింక్‍ను చూపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

ఇంకా అనుసంధానం చేసుకోని వారు www.incometax.gov.in వెబ్‍సైట్‍లో పాన్ - ఆధార్ లింక్ చేసుకోవచ్చు. హోమ్ పేజీలో లింక్ యువర్ పాన్ బటన్‍పై క్లిక్ చేసి.. ఆ తర్వాత స్టెప్స్ ఫాలో అయి, రూ.1,000 చెల్లించాలి. అడిగిన వివరాలు సమర్పించాలి.

WhatsApp channel