తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Aadhaar Card Status : మీ ఆధార్​ కార్డు ఎన్​రోల్​​మెంట్​ స్టేటస్​ను చెక్​ చేసుకోండిలా..

Aadhaar card status : మీ ఆధార్​ కార్డు ఎన్​రోల్​​మెంట్​ స్టేటస్​ను చెక్​ చేసుకోండిలా..

Sharath Chitturi HT Telugu

19 May 2023, 6:24 IST

    • Aadhaar card enrollment status కొత్తగా ఆధార్​ కార్డు తీసుకుంటున్నారా? మీ ఎన్​రోల్​మెంట్​ స్టేటస్​ను ఆన్​లైన్​లో ఇలా చెక్​ చేసుకోండి..
మీ ఆధార్​ కార్డు ఎన్​రోల్​​మెంట్​ స్టేటస్​ను చెక్​ చేసుకోండిలా..
మీ ఆధార్​ కార్డు ఎన్​రోల్​​మెంట్​ స్టేటస్​ను చెక్​ చేసుకోండిలా.. (HT_PRINT)

మీ ఆధార్​ కార్డు ఎన్​రోల్​​మెంట్​ స్టేటస్​ను చెక్​ చేసుకోండిలా..

Aadhaar card status check online : భారతీయుల నిత్య జీవితంలో ఆధార్​ కార్డు ఇప్పుడు ఓ భాగమైపోయింది. ఆధార్​ కార్డు లేకపోతే ఇప్పుడు దాదాపు ఏ పనీ జరగడం లేదు! ఈ 12 డిజిట్​ నెంబర్​.. భారతీయులకు ఒక యునీక్​ ఐడెంటిఫికేషన్​గా మారింది. ఆధార్​ కార్డు కోసం ఎన్​రోల్​ చేసుకోవాలనుకునే వారు.. సంబంధిత వివరాలను అందజేసి, బయోమెట్రిక్​ సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. ఆధార్​ కోర్డు కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా.. కేవలం ఒక్కసారి మాత్రమే ఆధార్​ కార్డు కోసం ఎన్​రోల్​ చేసుకోవచ్చు. మీరు కొత్తగా ఆధార్​ కార్డు తీసుకుంటున్నారా? అయితే.. ఆన్​లైన్​లో మీరు మీ ఆధార్​ కార్డు స్టేటస్​ను చూసుకోవచ్చు..

ఆధార్​ కార్డు ఎన్​రోల్​మెంట్​ స్టేటస్​ను చెక్​ చేసుకోండిలా..

స్టెప్​ 1:- యూఐడీఏఐ అధికారిక వెబ్​సైట్​ (udai.gov.in) లోకి వెళ్లండి.

How to check Aadhaar card status : స్టెప్​ 2:- 'మై ఆధార్​' ఆప్షన్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 3:- ఆధార్​ స్టేటస్​ ఆప్షన్​ మీద క్లిక్​ చేస్తే.. కొత్త వెబ్​ పేజ్​ ఓపెన్​ అవుతుంది.

స్టెప్​ 4:- మీ ఎన్​రోల్​మెంట్​ ఐడీ, తేదీ, ఎన్​రోల్​మెంట్​ టైమ్​, సెక్యూరిటీ కోడ్​ వంటి వివరాలు ఇవ్వండి.

ఇదీ చూడండి:- Aadhaar Toll Free Number : ఆధార్‌ సమస్యలా..? ఈ టోల్ ఫ్రీ నెంబర్​కు కాల్ చేయండి

స్టెప్​ 5:- ఆ తర్వాత 'చెక్​ స్టేటస్​' బటమ్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 6:- మీ ఆధార్​ జనరేట్​ అయ్యి ఉంటే.. స్క్రీన్​ మీద మీకు మెసేజ్​ వస్తుంది. మీ ఈ- ఆధార్​ కార్డును డౌన్​లోడ్​ చేసుకోండి.

Aadhaar card download online : స్టెప్​ 7:- ఈ- ఆధార్​ కార్డు కోసం డౌన్​లౌడ్​ ఆధార్​ ఆప్షన్​ మీద క్లిక్​ చేయాలి.

స్టెప్​ 8:- ఆధార్​ కార్డు మొబైల్​లో రావాలనుకుంటే.. 'గెట్​ ఆధార్​ ఆన్​ మొబైల్​' ఆప్షన్​ ఎంచుకోవాలి.

ఈ విధంగా ఆన్​లైన్​లో ఉచితంగా మీ ఆధార్​ కార్డు ఎన్​రోల్​మెంట్​ స్టేటస్​ను చెక్​ చేసుకోవచ్చు.

ఆధార్​ కార్డులో ఫొటో మార్చడం ఎలా?

How to change photo in Aadhaar card : మీ ఆధార్​ కార్డులో ఫొటో పాతదైపోయిందా? ఆధార్​ కార్డు ఫొటో మార్చాలని భావిస్తున్నారా? అయితే ఈ ప్రాసెస్​ ఇలా ఉంటుంది..

స్టెప్​ 1:- యూఐడీఏఐ అధికారిక వెబ్​సైట్​ uidai.gov.in లోకి వెళ్లాలి.

స్టెప్​ 2:- ఆధార్​ ఎన్​రోల్​మెంట్​ ఫామ్​ మీద క్లిక్​ చేయాలి.

స్టెప్​ 3:- ఫామ్​ను పూర్తిగా ఫిల్​ చేయాలి. ఆ తర్వాత సమీపంలోని ఆధార్​ ఎన్​రోల్​మెంట్​ సెంటర్​ లేదా ఆధార్​ సేవా కేంద్రలో దానిని సమర్పించాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం