How to link Aadhaar with mobile number : మీ ఆధార్‌ను మొబైల్ నెంబర్‌కు లింక్ చేయండిలా..
How to link Aadhaar with mobile number : మీ ఆధార్‌ను మొబైల్ నెంబర్‌కు లింక్ చేసుకోవాలా? అయితే ఇది మీకోసమే..
How to link Aadhaar with mobile number : దేశంలో ప్రతి విషయానికి ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఏదైనా అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా ఆధార్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో మన మొబైల్ నెంబర్‌కు ఆధార్‌ను లింక్ చేయడం చాలా ముఖ్యం. అత్యావశ్యకం కూడా. అందుకే మొబైల్ నెంబర్‌కు ఆధార్ ఎలా లింక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము..
ఓటీపీ ద్వారా..
దేశంలోని అన్ని టెలికాం సంస్థలు తమ యూజర్లకు.. మొబైల్ నెంబర్‌కు ఆధార్‌ను లింక్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. ఇందుకు ఓటీపీ విధానాన్ని అమలు చేస్తున్నాయి. టెలికాం సంస్థ వెబ్సైట్లో లేదా స్థానిక సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
స్టెప్ 1:- ముందుగా టెలికాం సంస్థకు చెందిన అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి.
స్టెప్ 2:- ఆధార్‌ను ఏ మొబైల్ నెంబర్ లింక్ చేద్దామని భావిస్తున్నారో.. దానిని ఎంటర్ చేయండి.
స్టెప్ 3:- సంబంధిత మొబైల్ నెంబర్‌కు టెలికాం సంస్థ ఓటీపీని పంపిస్తుంది.
స్టెప్ 4:- ఓటీపీని ఎంటర్ చేయండి. సబ్మీట్ బటన్‌ను క్లిక్ చేయండి.
ఇదీ చూడండి:- How to link Aadhaar to LPG : ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్‌ను లింక్ చేయండి ఇలా..
స్టెప్ 5:- ప్రాసెస్‌ని ముందుకు తీసుకెళ్లేందుకు మీ అనుమతులు కావాల్సి ఉంటుంది. మీ 12 డిజిట్ ఆధర్ నెంబర్‌ను టైప్ చేయండి.
స్టెప్ 6:- ఓటీపీని జనరేట్ చేయడం కోసం యూఐడీఏఐకి మెసేజ్ వెళుతుంది.
స్టెప్ 7:- యూఐడీఏఐ నుంచి ఈ-కేవైసీకి సంబంధించి మీకు ఒక మెసేజ్ వస్తుంది. దానిని వెరిఫై చేయండి.
Link Aadhaar with mobile number : స్టెప్ 8:- "యాక్సెప్ట్ ఆల్ టర్మ్స్ అండ్ కండీషన్స్"ను సెలక్ట్ చేసి, మీ ఓటీపీని ఎంటర్ చేయండి.
స్టెప్ 9:- మీ మొబైల్ నెంబర్‌కు ఆధార్ లింకైనట్టు మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
ఇదే కాకుండా.. ఏజెంట్ల ద్వారా లేదా ఐవీఆర్ఎస్ పద్ధతిలోనూ మీ మొబైల్ నెంబర్‌కు ఆధార్‌ను లింక్ చేసుకోవచ్చు.
ఆధార్ కార్డు స్టేటస్..
Aadhaar card latest news : భారతీయులు.. కేవలం ఒక్కసారి మాత్రమే ఆధార్ కార్డు కోసం ఎన్రోల్ చేసుకోవచ్చు. 12 డిజిట్ నెంబర్.. భారతీయులకు ఒక యునీక్ ఐడెంటిఫికేషన్‌గా మారింది. ఆధార్ కార్డు కోసం ఎన్రోల్ చేసుకోవాలనుకునే వారు.. సంబంధిత వివరాలను అందజేసి, బయోమెట్రిక్ సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. మరి మీరు కొత్తగా ఆధార్ కార్డు తీసుకుంటున్నారా? అయితే.. ఆన్లైన్లో మీరు మీ ఆధార్ కార్డు స్టేటస్‌ను చూసుకోవచ్చు. ఈ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం