Ration card: ఇక వారికి రేషన్ ఇవ్వరు... రేషన్ కార్డు నిబంధనలలో కీలక మార్పు!-big change in the rules for taking ration from government shops ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ration Card: ఇక వారికి రేషన్ ఇవ్వరు... రేషన్ కార్డు నిబంధనలలో కీలక మార్పు!

Ration card: ఇక వారికి రేషన్ ఇవ్వరు... రేషన్ కార్డు నిబంధనలలో కీలక మార్పు!

HT Telugu Desk HT Telugu
Apr 21, 2022 06:07 PM IST

జాతీయ ఆహార భద్రత పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునేవారికి రేషన్‌ కార్డు ముఖ్యమైన డాంక్యుమెంట్. ప్రస్తుతం దేశంలో 80 కోట్ల మందికి పైగా ఆహార భద్రత పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అయితే ఈ పథకంలో జరుగుతున్న అవకతవకల వల్ల అసలైన అర్హులకు లబ్ది చేకూరడం లేదు.

<p>Ration</p>
Ration

భారతీయ పౌరులకు ఉండాల్పిన వాటిలో రేషన్ కార్డ్ అతి ముఖ్యమైన డాంక్యుమెంట్. రేషన్ కార్డు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలను పొందవచ్చు. కరోనా మహమ్మారి కాలంలో ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్‌ను అందించింది. తాజాగా ఉచిత ఆహార ధాన్యాల పంపిణీని కూడా ప్రభుత్వం పెంచింది. దీంతో పేదలకు ఎంతో ఊరట లభించింది. దీంతో రేషన్ కార్డు నిబంధనలో కొన్ని భారీ మార్పులు చేయాలని ఆహార, ప్రజాపంపిణీ శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయం కొందరికి లాభం చేకూరుతుండగా.. మరికొందరికి పెద్ద దెబ్బే.

కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ గడువును పొడిగించిన నేఫథ్యంలో రేషన్ కార్డు నిబంధనలను కూడా మార్చాలని నిర్ణయించారు. త్వరలో కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం, రేషన్ కార్డు హోల్డర్ల అర్హత ప్రమాణాలు చూస్తే... ప్రస్తుతం దేశంలో 80 కోట్ల మంది ప్రజలు జాతీయ ఆహార భద్రత పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న వారు కూడా ఈ పథకం ద్వారా లబ్థి పొందుతున్నారు. ఆర్థిక స్తోమత ఉండి కూడా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాంటి వారిని జాతీయ ఆహార భద్రత పథకం నుంచి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా నిరుపేదలకు మాత్రమే ఈ పథకం ప్రయోజనంచేకూరనుంది. ఇందుకోసం ఆహార, ప్రజాపంపిణీ శాఖ చర్యలు ప్రారంభించింది.

రేషన్ కార్డు నిబంధనల మార్పులకు సంబంధించి ఆహార, ప్రజాపంపిణీ శాఖ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందిన సూచనలను అనుసరించి కొత్త ప్రమాణాలను రూపొందించనున్నారు. అర్హులైన వ్యక్తులు మినహాయించబడతారు. ప్రస్తుతం ఆహార, ప్రజాపంపిణీ శాఖ ఆధ్వర్యంలో 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే దేశం, ఒకే రేషన్ కార్డు పథకం అమలవుతోంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఒకే రకమైన కార్డు మాత్రమే జారీ చేయబడుతుంది. ఈ పథకం ప్రయోజనం ఏమిటంటే, లబ్ధిదారుడు ఏ రాష్ట్రం నుండి అయినా రేషన్ పొందవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం